ఫోన్ కాల్స్ కనెక్ట్ అవడానికి టైమ్ పడుతోందా దానికి కారణం ఏంటో తెలుసా?

ఇప్పటివరకు ఫోన్ కాల్స్ విషయంలో కాల్ డ్రాప్స్ గురించి మాత్రమే అందరూ మాట్లాడుకోవడం చూస్తూ ఉన్నాం.అయితే తాజాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మరో కీలకమైన విషయం పై దృష్టి పెట్టింది.

|

ఇప్పటివరకు ఫోన్ కాల్స్ విషయంలో కాల్ డ్రాప్స్ గురించి మాత్రమే అందరూ మాట్లాడుకోవడం చూస్తూ ఉన్నాం.అయితే తాజాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మరో కీలకమైన విషయం పై దృష్టి పెట్టింది. అదే కాల్ సెట్ అప్ టైమ్ . అంటే ఎవరికైనా మనం ఫోన్ చేయడం కోసం మన ఫోన్ లోని ఫోన్ యాప్ ఓపెన్ చేసి నెంబర్ టైప్ చేసి, లేదా ఆల్రెడీ ఉన్న కాంటాక్ట్ సెలక్ట్ చేసుకొని కాల్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఎంతసేపటికి ఫోన్ కనెక్ట్ అవుతుంది అన్నది కాల్ సెట్ అప్ టైమ్ గా పరిగణిస్తూ ఉంటారు.

వోల్ట్  ఆధారంగా పనిచేసే నెట్‌వర్క్‌లకి మధ్య ఈ కాల్ సెట్ అప్ టైమ్....

వోల్ట్ ఆధారంగా పనిచేసే నెట్‌వర్క్‌లకి మధ్య ఈ కాల్ సెట్ అప్ టైమ్....

సాంకేతికంగా చూస్తే వోల్ట్ ఆధారంగా పనిచేసే నెట్‌వర్క్‌లకి మధ్య ఈ కాల్ సెట్ అప్ టైమ్ చాలా వేగంగా ఉంటుంది. దాదాపు కొన్ని సందర్భాల్లో కాల్ కనెక్ట్ అవడం కోసం 30 సెకన్ల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉండడం గమనార్హం.

టెలికాం నెట్వర్క్‌లు తమ నెట్వర్క్ ద్వారా చేయబడే ఫోన్ కాల్స్....

టెలికాం నెట్వర్క్‌లు తమ నెట్వర్క్ ద్వారా చేయబడే ఫోన్ కాల్స్....

ఈ నేపథ్యంలో అక్టోబర్ ఒకటో తేదీ నుండి దేశంలోని వివిధ టెలికాం నెట్వర్క్‌లు తమ నెట్వర్క్ ద్వారా చేయబడే ఫోన్ కాల్స్ విషయంలో కాల్ సెట్ అప్ టైమ్ ఎంత ఉంటోంది అన్న వివరాలను సమర్పించ వలసిందిగా TRAI టెలికం కంపెనీలను కోరింది. ఆయా కంపెనీలు ఇచ్చే సమాచారం ఆధారంగా, కొన్ని ప్రమాణాలను నిర్దేశించే ఆలోచనలో TRAI ఉన్నట్టు తెలుస్తోంది

2G, 3G, 4G,వోల్ట్  వంటి వేర్వేరు  టెక్నాలజీలు....
 

2G, 3G, 4G,వోల్ట్ వంటి వేర్వేరు టెక్నాలజీలు....

సహజంగా 2G, 3G, 4G,వోల్ట్ వంటి వేర్వేరు టెక్నాలజీలు వాడుకలో ఉన్న నేపథ్యంలో.. ఒక టెక్నాలజీ వాడే వినియోగదారుడు మరో టెక్నాలజీ ఆధారంగా పనిచేసే నెంబర్‌‌కి కాల్ చేయాలంటే ఖచ్చితంగా కాల్ కనెక్ట్ అవడం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.

4G నెట్‌వర్క్‌లో  ఉన్న నెంబర్‌కి కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.....

4G నెట్‌వర్క్‌లో ఉన్న నెంబర్‌కి కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.....

2G నెట్వర్క్ మాత్రమే ఉన్న వినియోగదారుడు 4G నెట్‌వర్క్‌లో ఉన్న నెంబర్‌కి కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. ఇలా సాంకేతికంగా ఉన్న అవరోధాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. వీలైనంత వరకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించాలన్న యోచనలో TRAI ఉంది.

Best Mobiles in India

English summary
Call connection time, call mute on TRAI's radar; seeks operators data for a fix.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X