గేమ్ ఆడుతూ రూ.35,00,000 లు గెలుచుకొనే అవకాశం. మీరు కూడా ఆడొచ్చు ...! 

By Maheswara
|

గత కొన్ని సంవత్సరాలుగా FPS-మొబైల్ గేమింగ్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. కాల్ ఆఫ్ డ్యూటీ వంటి హై-ఎండ్ పిసి గేమ్‌లను ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో (ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండూ) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి, మొబైల్ గేమింగ్ గత కొన్ని సంవత్సరాలుగా కొత్త కొత్త టెక్నాలజీ లతో అభివృద్ధి చెందింది. వినియోగదారుల సంఖ్యను పెంచేందుకు మరియు ఉన్న వినియోగదారులను అలరించడానికి గేమింగ్ పోటీలు జరుగుతున్నాయి. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమింగ్ పోటీని ప్రకటించింది. ఇక్కడ విజేతలు కొంత మంది అందమైన బహుమతిగా డబ్బు ను రివార్డ్ గా పొందుతారు.ఇలాంటి ఈ టోర్నమెంట్ గురించిన విషయాలు తెలుసుకుందాం రండి.

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమింగ్ పోటీ

Also Read: అమ్మాయిలకే ప్రత్యేకంగా కొత్త ఫోన్ ! ధర కూడా తక్కువే ...రూ.6,888 మాత్రమే!Also Read: అమ్మాయిలకే ప్రత్యేకంగా కొత్త ఫోన్ ! ధర కూడా తక్కువే ...రూ.6,888 మాత్రమే!

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఇండియా కప్ పోటీ వివరాలు
 
కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఇండియా కప్ పోటీ వివరాలు

వీడియో గేమ్ ప్రచురణకర్త అయిన యాక్టివిజన్ బ్లిజార్డ్ సహకారంతో లోకో రైజ్ ఆఫ్ హీరోస్: కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఇండియా కప్ టోర్నమెంట్‌ను ప్రకటించింది. భారతదేశంలో ఆన్ లైన్ స్పోర్ట్స్, ఇ-స్పోర్ట్స్ సంస్కృతిని ప్రాచుర్యం పొందటానికి ఈ గేమింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియచేసారు. ఇది మీ జట్టుతో మీరు పాల్గొనగల బహిరంగ టోర్నమెంట్ అవుతుంది.

ఓపెన్ టోర్నమెంట్

ఓపెన్ టోర్నమెంట్

నిబంధనల ప్రకారం ఈ టోర్నమెంట్ 5v5 మోడ్‌లో జరుగుతుంది (ప్రతి జట్టుకు ఐదుగురు సభ్యులు). జట్టు సభ్యులందరూ పోటీలో పాల్గొనడానికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి మరియు 2021 జనవరి 4 వరకు  ఉంటాయి. ఈ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి 2048 జట్లు మాత్రమే అనుమతించబడటం విశేషం.

ఫైనల్స్ లో విజయం పొందిన జట్టు

ఫైనల్స్ లో విజయం పొందిన జట్టు

2048 జట్లలో ప్రో లీగ్‌కు 16 జట్లు ఖరారు కానున్నాయి. అంతిమ బహుమతి డబ్బు కోసం నాలుగు ప్రొఫెషనల్ జట్లు ఫైనలిస్ట్ జట్లలో చేరనున్నాయి. ఈ పోటీ యొక్క మొదటి రౌండ్ జనవరి 2 న ప్రారంభమవుతుంది మరియు జనవరి 9 వరకు జరుగుతుంది. క్వార్టర్, సెమీ మరియు ఫైనల్ రౌండ్లు 2021 జనవరి 24న జరుగుతాయి.చివరగా ఫైనల్స్ లో విజయం పొందిన జట్టు రూ.35 లక్షలు ప్రైజ్ మనీ పొందుతారు.

Also Read: Oneplus కొత్త ఫోన్ !ఊసరవెల్లి లాగా రంగులు మార్చడమే కాదు... మీ ఊపిరి ని కూడా లెక్కపెట్టగలదు.Also Read: Oneplus కొత్త ఫోన్ !ఊసరవెల్లి లాగా రంగులు మార్చడమే కాదు... మీ ఊపిరి ని కూడా లెక్కపెట్టగలదు.

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

మీ సమాచారం కోసం ఈ వివరాలు అందిస్తున్నాము. కాల్ ఆఫ్ డ్యూటీని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆట 4.5-స్టార్ రేటింగ్ కలిగి ఉంది మరియు 100 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. దీని పరిమాణం సుమారు 2GB వరకు ఉంది.

Best Mobiles in India

English summary
Call Of Duty India Mobile Game Tournament Registrations Live Now, Winners Will Get Rs.35 Lakhs Prize Money.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X