Home
News

పబ్‌జికి పోటీగా Call of Duty, మైండ్ బ్లోయింగ్ గేమ్ ఇది

వీడియో గేమ్ లవర్స్‌కు ఇది నిజంగాశుభవార్తే.. గేమింగ్ ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న కాల్ ఆఫ్ డ్యూటీ ఇకపై మొబైల్ ప్లాట్‌ఫాంపై కూడా ల‌భ్యం కానుంది. ఇప్పటిదాకా ఇది పీసీల మీదనే రన్ అయ్యేది. కాగా మొబైల్ ల

వీడియో గేమ్ లవర్స్‌కు ఇది నిజంగాశుభవార్తే.. గేమింగ్ ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న కాల్ ఆఫ్ డ్యూటీ ఇకపై మొబైల్ ప్లాట్‌ఫాంపై కూడా ల‌భ్యం కానుంది. ఇప్పటిదాకా ఇది పీసీల మీదనే రన్ అయ్యేది. కాగా మొబైల్ లో విడుదల కోసం ఆ గేమ్‌ను డెవ‌ల‌ప్ చేసే సంస్థ యాక్టివిజ‌న్ ప‌బ్‌జి మొబైల్ గేమ్ డెవ‌ల‌ప‌ర్ టెన్సెంట్ గేమ్స్‌తో భాగ‌స్వామ్యం అయింది. పబ్‌జీకి పోటీగా కాల్ ఆఫ్ డ్యూటీ'ని టెన్సెంట్ కంపెనీ తీసుకువస్తోంది.

పబ్‌జికి పోటీగా Call of Duty, మైండ్ బ్లోయింగ్ గేమ్ ఇది

'కాల్ ఆఫ్ డ్యూటీ-మొబైల్' ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తుంది. అయితే ప్రస్తుతానికి యూరప్, అమెరికాలో మాత్రమే ఈ గేమ్ అందుబాటులో ఉంది. ఇండియాలో ఎప్పుడు లాంఛ్ అవుతుందన్న స్పష్టత లేదు.

యాక్టివిజన్ డెవలప్

యాక్టివిజన్ డెవలప్

'కాల్ ఆఫ్ డ్యూటీ'ని టెన్సెంట్‌కు చెందిన టిమి స్టూడియో, యాక్టివిజన్ డెవలప్ చేసింది మల్టీప్లేయర్ ఎక్స్‌పీరియెన్స్ ఈ గేమ్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్ పీసీ, కన్సోల్స్ కోసం రూపొందించారు.

డౌన్‌లోడ్ చేసుకోవడానికి

డౌన్‌లోడ్ చేసుకోవడానికి

ఇప్పటికే కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ట్రైలర్ గేమింగ్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూజర్లు ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్ప‌టికే గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ రిజిస్ట్రేష‌న్ల‌ను కూడా ప్రారంభించారు

రానున్న వేస‌విలో

రానున్న వేస‌విలో

ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ఈ గేమ్ రానున్న వేస‌విలో ల‌భిస్తుంది. యూజ‌ర్లు ప్రీ రిజిస్ట‌ర్ చేసుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌ను అంద‌రి క‌న్నా ముందుగానే పొంద‌వ‌చ్చు.

ఆల్ఫా ద‌శలోనే

ఆల్ఫా ద‌శలోనే

ప్ర‌స్తుతం కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్ ఆల్ఫా ద‌శలోనే ఉంది. త్వ‌ర‌లో బీటా వెర్ష‌న్‌ను లాంచ్ చేసి యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెస్తారు. ఆ త‌రువాత పూర్తి స్థాయి వెర్ష‌న్‌లో ఈ గేమ్‌ను లాంచ్ చేస్తారు.

ఆన్‌లైన్‌లో ఇత‌రుల‌తో పోటీ

ఆన్‌లైన్‌లో ఇత‌రుల‌తో పోటీ

ఇక ఈ గేమ్ అచ్చం ప‌బ్‌జి మొబైల్‌ను పోలి ఉంటుంది. అందులోలాగే కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్‌లోనూ యూజ‌ర్లు ఆన్‌లైన్‌లో ఇత‌రుల‌తో పోటీ ప‌డ‌వ‌చ్చు. ప‌లు ర‌కాల వెప‌న్స్‌తో ముందుకు సాగాలి.

గేమ్‌లో ప‌లు మ్యాప్‌లు

గేమ్‌లో ప‌లు మ్యాప్‌లు

గేమ్ విన్ అయ్యే దాన్ని బ‌ట్టి ర్యాంకింగ్‌లు, రివార్డులు ల‌భిస్తాయి. అలాగే గేమ్‌లో ముందుకు వెళ్లే కొద్దీ ప‌లు లెవ‌ల్స్‌ను దాటాల్సి ఉంటుంది. ఇక గేమ్‌లో ప‌లు మ్యాప్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే భిన్న‌మైన క్యారెక్ట‌ర్లు ఉంటాయి. వాటిలో ప్లేయ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన క్యారెక్ట‌ర్‌ను ఎంచుకుని గేమ్ ఆడ‌వ‌చ్చు..!

More from GizBot

Best Mobiles in India

English summary
Call of Duty: Mobile is coming soon to Android and iOS smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X