Home
News

కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ సర్వీసులపై ట్రయల్స్‌ ప్రారంభం.. తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే..!!

టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI- ట్రాయ్‌) ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు వీలుగా ఎవరు ఫోన్‌ చేసిన వారి పేరు మొబైల్‌ డిస్‌ప్లేపైన కనిపించేలా కాలింగ్ నేమ్‌ ప్రజంటేషన్‌ (CNAP- Calling Name Presentation) సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని సిఫార్సు చేసింది. దీని ఆధారంగా స్పామ్‌ కాల్స్‌ నుంచి లేదా ఇతర అవస్థల నుంచి యూజర్లకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ట్రాయ్‌ భావిస్తోంది.

తెలియని నంబర్ల నుంచి ఫోన్‌ వచ్చినా.. :
ఈ సర్వీసులను ప్రారంభించే ముందు ఇందుకు సంబంధించిన ట్రయల్స్‌ను టెలికాం సంస్థలు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించాయి. సిమ్‌ కార్డులు తీసుకొనే సమయంలో ఇచ్చిన గుర్తింపు కార్డులో ఉన్న పేర్లను కాలింగ్‌ సమయంలో కనిపిస్తాయి. ఫలితంగా మీ మొబైల్‌లో సేవ్‌ చేయని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చినా.. వారి వివరాలను తెలుసుకోవచ్చు.

telecom companies started calling name presentation service trials in haryana and mumbai

సముఖంగా లేని టెలికాం సంస్థలు..! :
అయితే ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ట్రూకాలర్‌ సహా కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. అయితే క్లౌడ్‌ సర్వర్‌లో ఉన్న పేర్లను మాత్రమే దీని ద్వారా తెలుసుకొనే ‌అవకాశం ఉంది. కానీ కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ సర్వీసుల ద్వారా.. సరైన వివరాలు తెలియనున్నాయి. అయితే ఈ తరహా సర్వీసులు అందిస్తేందుకు టెలికాం సంస్థలు సుముఖంగా లేవు.

తొలి దశలో హర్యానా, ముంబైలో ట్రయల్స్‌ :
సాంకేతిక సమస్యలు సహా ఇతర కారణాలను సాకుగా చూపాయి. అయితే ట్రాయ్‌ సహా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే కొన్ని నగరాల్లో కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ సర్వీసు ట్రయల్స్‌ను ప్రారంభించాయి. తొలి దశ ఫలితాల తర్వాత మరిన్ని నగరాల్లో ఈ సర్వీసులకు ట్రయల్‌ నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం హర్యానా, ముంబైలో ఈ ట్రయల్స్‌ నడు‌స్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ సర్వీసులపై టెలికాం శాఖ (DoT) కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం వల్ల స్పామ్ కాల్స్ నుంచి యూజర్లకు అవస్థలు తగ్గుతాయని భావిస్తోంది. థర్డ్‌ పార్టీ యాప్‌ల పరంగా ట్రూకాలర్‌ ఈ తరహా సేవలు అందిస్తుండగా.. గూగుల్‌ కూడా ఈ తరహా సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

గూగుల్‌ Lookup టూల్‌ పేరుతో ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. బీటా వెర్షన్లో అందుబాటులో ఉందని తెలుస్తోంది. అందరికీ ఎప్పటికి విడుదల కానుందనే విషయం తెలియలేదు. ట్రాకాలర్‌ క్లౌడ్‌ సర్వీస్‌ ఆధారంగా వివరాలు అందిస్తుండగా.. గూగుల్‌ దేని ప్రాతిపదికన సర్వీసులు అందిస్తుందనే తెలియాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
calling name presentation service trials started by telecom companies in few cities
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X