రతన్ టాటా ప్రేమ వివాహానికి గండికోట్టిన ఇండో-చైనా యుద్దం...

Posted By: Super

రతన్ టాటా ప్రేమ వివాహానికి గండికోట్టిన ఇండో-చైనా యుద్దం...

న్యూఢిల్లీ: అపర కుబేరులైనా.. కార్పొరేట్‌ దిగ్గజాలైనా.. ప్రేమలో పడాల్సిందే అంటున్నారు టాటా గ్రూప్‌ అధిపతి రతన్‌ టాటా. కుర్రతనంలోని తన ప్రేమాయాణాన్ని ఇప్పుడు నెమరవేసుకున్నారు. రతన్‌ నాలుగు సార్లు ప్రేమలో పడ్డారు. ప్రతి సారి పెళ్లి వరకు వెళ్లారు. కానీ చేసుకోలేకపోయారు. అయితే.. తన వరకూ పెళ్లి చేసుకోకపోవడం అదృష్టంగానే భావిస్తున్నారు. 'పెళ్లి చేసుకోకపోవడం తప్పేమి కాదు. ఒక వేళ చేసుకుని ఉంటే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా ఉండేది' అని ఒక ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరెప్పుడూ ప్రేమలో పడలేదా అని అడిగారనుకోండి. నాలుగు సార్లు నా ప్రేమ పెళ్లి వరకు వచ్చిందని చెప్పగలను.

చివరకు కారణం ఏదైనా భయంతో వెనక్కు తగ్గాను అని చెప్పారు. ఆయన ప్రేమ కథల గురించి మరింత వివరించమన్నప్పుడు.. నేను అమెరికాలో పని చేస్తున్నప్పుడు ఒకరితో నా ప్రేమ వ్యవహారం గాఢంగా సాగింది. నేను ఇక్కడకు వచ్చేశాను. నాతోపాటు రావడానికి ఇష్టపడింది కూడా. కానీ ఇండో-చైనా యుద్ధం ప్రభావం ఆమెపైన పడిందనుకుంటా.. చివరకు రావడానికి మొగ్గు చూపలేదు. అక్కడే వేరొకరని పెళ్లి చేసుకుందని రతన్‌ టాటా మనసు విప్పారు. అయితే.. ప్రేమలో పడిన నాలుగు సార్లు పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు వేర్వేరని అన్నారు. మీరు ప్రేమించిన వారు ఎవరైనా ఢిల్లీలో ఉన్నారా అంటే.. ఉన్నారని చెప్పిన రతన్‌ మరిన్ని వివరాలను వెల్లడించడానికి అంగీకరించలేదు. ఇది అమెరికాలో కూడా ప్రసారం అవుతుంది. ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయడం మంచిదని చమత్కరించారు.

ఈఏడాది మధ్య నాటికి రతన్‌టాటా వారసుడి పేరు బయటకు వచ్చే వీలుంది. 'ప్రథమార్ధం చివరి కల్లా వారసుడి ఎంపిక పూర్తికాగలదని ఆశిస్తున్నాను. నేను పదవీ విరమణ చేయడానికి కొద్ది కాలానికి ముందుగా నియామకం జరగొచ్చు' అని రతన్‌ టాటా అన్నారు. పేరు వెనుక టాటా లేని వ్యక్తి వారసుడిగా ఎంపిక అవడానికి ఏ మేరకు అవకాశాలున్నాయని అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. దీనిపై తాను ఎటువంటి వ్యాఖ్యానం చేయనన్నారు. 'పోటీలో నా సవతి సోదరుడు ఉన్నాడు. అతను వారసుడిగా ఎంపిక అవ్వడానికి అవకాశాలు 90 శాతమా, 50 శాతమా లేక 10 శాతమా అనే విషయాన్ని నేను చెప్పలేను' అని రతన్‌ అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot