సింగపూర్‌లో కెమెరా లేని 'ఐఫోన్స్' హాల్ చల్...

Posted By: Super

సింగపూర్‌లో కెమెరా లేని 'ఐఫోన్స్' హాల్ చల్...

 

ప్రపంచంలో టెక్నాలజీ పరంగా ముందు ఉన్న మహా నగరం సింగపూర్. ఈ మహా నగరంలో ఉన్న మిలిటరీ మరియు గవర్నమెంట్ అధికారుల కోసం ప్రత్యేకంగా అక్కడున్న మొబైల్ ఆపరేటర్స్ కెమెరా లేనటువంటి ఐఫోన్ 4, ఐఫోన్ 5లను ఆఫర్ చేస్తున్నారు. సింగపూర్ లోకల్ మొబైల్ క్యారియర్ ఎమ్1 తన వెబ్‌సైట్లో ఈ ఆఫర్‌ని పెట్టడం జరిగింది.

కొన్ని గవర్నమెంట్ సంస్దలలో ముఖ్యంగా మిలిటరీ బేస్‌లలో కెమెరా ఉ్న్న ఫోన్స్ నిషిద్దం. ఇలాంటి కారణాలను దృష్టిలో పెట్టుకోని యాపిల్ ప్రయోగాత్మకంగా ఈ డివైజ్‌లను విడుదల చేసింది. కెమెరా లేని ఈ హ్యాండ్ సెట్స్ కోసం సింగపూరియన్ క్యారియర్ 'ఎమ్1' అధనంగా S$49 ($38)లను యూజర్స్ నుండి వసూలు చేస్తుంది.

సింగపూర్‌లో కెమెరా లేని 'ఐఫోన్స్' హాల్ చల్...

 

'ఎమ్1' మొబైల్ క్యారియర్ వద్ద ఎవరైనా కస్టమర్స్ ఆపిల్ ఐఫోన్ 4, ఐఫోన్ 5ని కోనుగోలు చేసినట్లేతే వారు 1 సంవత్సరం వారంటీని కొల్పోతారు. అందుకు కారణం 'ఎమ్1' మొబైల్ సంస్ద ఆపిల్ ఐఫోన్ 4, ఐఫోన్ 5లలో ఉన్న కెమెరాని తీసివేసి అమ్మకాలు జరుపుతుంది కాబట్టి. ఐతే కెమెరాని 'ఎమ్1' మొబైల్ సంస్ద తీసివేస్తుంది కాబట్టి మూడవ పార్టీ వెండర్ ద్వారా 'ఎమ్1' మొబైల్ క్యారియర్ యూజర్స్‌కు 1 సంవత్సరం వారంటీని అందిస్తుంది. 1సంవత్సరం వారంటీని అందించినందుకు గాను 'ఎమ్1' మొబైల్ క్యారియర్ S$321ని తీసుకుంటుంది.

ఇటీవలే సింగపూర్ డిఫెన్స్ మినిస్టరీ మిలిటరీ అధికారులకు ఈ స్మార్ట్ ఫోన్‌ని ఎలా ఉపయోగించాలనే అంశంపై ప్రత్యేకంగా విన్నవించినట్లు సమచారం. దీనిని బట్టి అర్దం అయింది ఏమిటంటే సింగపూర్‌లో ఆపిల్ ఐఫోన్స్‌కి కెమెరా తోలగించవచ్చునని గవర్నమెంటే అధికారకంగా అనుమతించినట్లు ప్రజలు అర్దం చేసుకుంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot