ఈయేడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ నియమకాలు జోరు

Posted By: Staff

ఈయేడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ నియమకాలు జోరు

న్యూఢిల్లీ: గత రెండు సంవత్సరాల నుంచి మందగించిన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ తిరిగి పుంజుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్‌ - జూన్‌ కాలానికి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. మై హైరింగ్‌ డాట్‌ కామ్‌ అంచనా ప్రకారం క్యాంపస్‌లకు వెళ్లి రిక్రూట్‌మెంట్‌ ప్లేస్‌మెంట్‌ గత ఏడాదితో పోల్చుకుంటే 32 శాతం వృద్ధి చెందిందని తెలిపింది. సర్వేలో భాగంగా మొత్తం 497 మంది కంపెనీల యాజమాన్యాలను దేశంలోని వివిధ రంగాలకు చెందిన ఇన్సిస్టిట్యూట్‌ల నుంచి వివరాలు సేకరించింది. భారతీయ కంపెనీలు ఎంట్రీ లెవెల్‌ ప్లేస్‌మెంట్‌లను క్యాంపస్‌ ద్వారా ఎంపిక చేస్తున్నాయి. దీని ద్వారా వేతనాలు తక్కువగా ఇవ్వవచ్చు కంపెనీలపై వేతన భారం పడదని సర్వేలో తేలింది. అన్నీ రంగాల్లో రిక్రూట్‌మెంట్‌ జోరందుకుంది.

ఐటీ, ఐటీఈఎస్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో క్యాంపస్‌రిక్రూట్‌మెంట్‌ గత ఏడాదితో పోల్చుకుంటే భారీగానే పుంజుకుంది. వీరికి ఇచ్చే వేతనాల ప్యాకేజీలో ఎలాంటి మార్పు లేదు. గత ఏడాది ఎంత ప్యాకేజీ ఉందో అంతే ఉందని వేతనాల్లో ఎలాంటి మార్పులేదని మై హైరింగ్‌ క్లబ్‌డాట్‌ కామ్‌ వ్యవస్థాపకుడు సీఈవో రాజేష్‌కుమార్‌ చెప్పారు. ఆర్థిక మాంద్యం కొనసాగినప్పుడు కంపెనీలు కొత్తగా ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ చేపట్టలేదని.. ఆ కొరత అలానే కొనసాగుతోందని ఆయన అన్నారు.

ఐటీ, ఐటీఈఎస్‌ రంగాలు ఆర్థిక మాంద్యం నుంచి కోలుకుని 2011 మొదటి త్రైమాసికంలో 16 శాతం రిక్రూట్‌మెంట్‌ జరగ్గా.. బ్యాంకింగ్‌, ఇన్‌ఫ్రారంగం 15 శాతం, రాటెయిల్‌ రంగం 14 శాతం, ఇంజినీరింగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ 13 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఆటోమొబైల్‌ రంగం 12 శాతం, టెలికాం రంగం 9 శాతం మేర రిక్రూట్‌మెంట్‌ జరిగింది. కొన్ని పరిశ్రమల్లో వేతనాలు భారీగానే పెరిగాయి. ఐటీ, ఐటీఈఎస్‌ రంగానికి చెందిన పరిశ్రమలో గరిష్ఠంగా 10 శాతం పెరిగాయి బ్యాంకింగ్‌, పైనాన్షియల్‌ రంగంలో 8 శాతం మేర వేతనాలు పెరిగాయి. రీటెయిల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఇంజినీరింగ్‌, తయారీ రంగంలో 6 శాతం మేర వేతనాలు పెరగగా... ఆటోమబైల్‌, టెలికాం రంగాలుల వరుసగా 5 శాతం, నాలుగు శాతం మేర పెరిగాయి.

రిక్రూట్‌మెంట్‌ అప్పుడు వేతనాలు పెంచడం లేదని (గత ఏడాది) ఎంత పే ప్యాకేజీ ఉందో అంతే కొనసాగిస్తున్నారని కుమార్‌ వివరించారు. వచ్చే ఏడాది అన్నా కొత్త పే ప్యాకేజీ అమల్లోకి తెస్తారని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగులకు తీసుకోవడం వల్ల సంస్థలకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రిక్రూట్‌మెంట్‌ కన్సెల్టెంట్‌కు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో వారికి కావాల్సినంత మంది అభ్యర్థులు అందుబాటులో ఉంటారని కుమార్‌ తెలిపారు. ఈ సర్వేఈ ఏడాది మే - జూలై నెలలో నిర్వహించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot