Home
News

చందమామకు అడుగు దూరంలో చంద్రయాన్ -2 పరేషాన్

చంద్రయాన్ -2 మిషన్ జులై 22న ప్రారంభించిన సంగతి అందరికి తెలిసినదే. చంద్రయాన్ -2 కొన్ని రోజుల ప్రయాణం తరువాత ఈ రోజు ఉదయం 5.30 నిమిషాలకు చందుడిపైన దిగాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావించారు. రోవర్ ప్రగ్యాన్ తో కలిసి చంద్రుడు మీద ల్యాండ్ అయే విక్రమ్ చారిత్రాత్మక ల్యాండింగ్కు సాక్ష్యమివ్వడానికి బయలుదేరింది. ఈ కార్యక్రమం మొత్తం రాత్రి 1.10 నుండి ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అన్ని టీవీ ఛానెళ్లకు మరియు యూట్యూబ్ వంటి వాటిలో కూడా లైవ్ ఇచ్చారు.

PM మోడీ

ఈ కార్యక్రమం మొత్తం వీక్షించడానికి PM మోడీ కూడా బెంగళూరులోని ఇస్రో యొక్క ఇస్ట్రాక్ కేంద్రంకు నిన్న సాయంత్రం వెళ్ళాడు. ఆయనను ఇస్రో కేంద్రంలో ఇస్రో యొక్క చైర్మన్ కె. శివన్ స్వాగతించారు. భారతదేశం చరిత్రను సృష్టించడానికి మరొక రెండు నిమిషాల సమయం ఉండగా ఇస్రో యొక్క గ్రౌండ్ స్టేషన్ నుండి మూన్ ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్ కోల్పోయింది. ల్యాండర్ చంద్రుని వైపు దిగుతున్నప్పుడు ఇది జరిగింది.

చంద్రయాన్ -2 నుండి ఇస్రో కమ్యూనికేషన్ కోల్పోయింది

చంద్రయాన్ -2 నుండి ఇస్రో కమ్యూనికేషన్ కోల్పోయింది

రోవర్ ల్యాండర్ చంద్రుడికి మరొక 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు చంద్రయాన్ -2 మరియు కంట్రోల్ సెంటర్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ సంబంధం కోల్పోయింది. మూన్ ల్యాండర్ విక్రమ్‌ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై దిగడానికి రెండు నిమిషాల కాల వ్యావధిలో ఈ కమ్యూనికేషన్ సంబంధం కోల్పోయింది.

ప్రగ్యాన్ విశేషాలు

ప్రగ్యాన్ విశేషాలు

చంద్రుడి మీద పరిశోధనలు చేసే ప్రగ్యాన్ ఆరు చక్రాలతో సుమారు 27 కేజీల బరువుతో తయారుచేసారు. ఈ ఆరు చక్రాలలో ఒక వైపు గల చివరి చక్రం మీద అశోక చక్రం ముద్రించారు మరియు మరొక వైపు ఇస్రో సంస్థ యొక్క చిహ్నాన్ని ముద్రించారు.

చంద్రయాన్ -2 నుండి ఇస్రో కమ్యూనికేషన్ మళ్ళి పొందవచ్చా ?

చంద్రయాన్ -2 నుండి ఇస్రో కమ్యూనికేషన్ మళ్ళి పొందవచ్చా ?

విక్రమ్ రోవర్ ప్రగ్యాన్ తో కలిసి చంద్రుడి మీద పరిశోధనలు చేయడానికి చంద్రయాన్ -2 ను ప్రయోగించిన తరువాత లాండింగ్ సమయంలో కమ్యూనికేషన్ కోల్పోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కాస్త దిగులు చెందారు. ప్రగ్యాన్ చంద్రుడి మీద ఒక రోజు పరిశోధనలు చేయాలి అని అందరు భావించారు. చంద్రుడి మీద ఒక రోజు అంటే మన మున్న భూతలం మీద 14 రోజులు కావున శాస్త్రవేత్తలు మనోధైర్యం కొల్పకుండా కమ్యూనికేషన్ కోల్పోవడానికి గల కారణాలు కనుగొని తిరిగి మళ్ళి కమ్యూనికేషన్ పొందడానికి మార్గాలను కనుగొనాలని సీనియర్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. తిరిగి మళ్ళి కమ్యూనికేషన్ పొందడానికి మనకు ఇంకా 14 రోజుల సమయం ఉంది.ఒక వేల కమ్యూనికేషన్ తిరిగి పొందగలిగితే చంద్రుడి పైన పరిశోధనలు చేసిన నాల్గవ దేశంగా ఇండియా అవతరిస్తుంది.

PM నరేంద్ర మోడీ

PM నరేంద్ర మోడీ

విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పోయిన తర్వాత విశ్వాసం కోల్పోవద్దని మన PM నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు చెప్పారు.ISTRAC యొక్క కంట్రోల్ రూం వద్ద దిగులుగా ఉన్న శాస్త్రవేత్తలతో సంభాషిస్తూ ప్రధాని ఇలా అన్నారు. మీరు ఇప్పటివరకు ఏమి చేసినా అది మాములు పని కాదు. దేశం మీ యొక్క పనిని గర్విస్తుంది. మీరందరూ దేశానికి మరియు మానవజాతికి గొప్ప పని చేశారు. ఈ పని చేయడానికి చాలా ధైర్యం కావాలి. మీ యొక్క మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగండి నేను మీతో ఉన్నాను. రాబోయే రోజులలో దేశం మీ నుంచి ఇంకా ఉత్తమమైన వాటిని ఆశిస్తోంది అని అన్నారు.

PM నరేంద్ర మోడీ

విక్రమ్ చారిత్రాత్మక ల్యాండింగును వీక్షించడానికి బెంగుళూరుకు వెళ్లిన PM నరేంద్ర మోడీ అక్కడ ఉన్న విద్యార్థులతో సంభాషించారు మరియు వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. తదనంతరం వరుస ట్వీట్లలో మోడీ ఇలా అన్నారు "మన శాస్త్రవేత్తల ధైర్యానికి భారతదేశం గర్వంగా ఉంది. వారు తమ ఉత్తమమైన పనితనాన్ని ఇచ్చారు మరియు భారతదేశాన్ని ఎల్లప్పుడూ గర్వపడేలా చేసారు. ఇవి ధైర్యంగా ఉండటానికి క్షణాలు, ధైర్యంగా ఉందాం అని తెలిపారు.

ఇస్రో ల్యాండర్ ప్లాన్

ఇస్రో ల్యాండర్ ప్లాన్

ఇస్రో ల్యాండర్ కోసం రెండు వేర్వేరు ల్యాండింగ్ సైట్లను ఎంచుకుంది. మొదటి సైట్ ప్రాధమిక ల్యాండింగ్ సైట్ కాగా రెండవది మిషన్ కోసం ద్వితీయ బ్యాకప్ సైట్. చంద్రుడి ఉపరితలం నుండి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న తర్వాత ల్యాండర్ తుది ల్యాండింగ్ సైట్‌ను ఎన్నుకుంటుందని కూడా ఇది గుర్తించింది. సెకన్లలో నిర్ణయం తీసుకోవడానికి ల్యాండర్ డేటాను సేకరించి విశ్లేషిస్తుంది.

ల్యాండింగ్ సైట్

ప్రాధమిక ల్యాండింగ్ సైట్ చంద్రునిపై రెండు క్రేటర్స్ మధ్య మంజినస్ మరియు సింపెలియస్ అని పిలువబడుతుంది. ఈ ప్రదేశం చంద్రునిపై దక్షిణ ధ్రువం నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూన్ ల్యాండర్ విక్రమ్ ఉపరితలం నుండి 35 కిలోమీటర్ల నుండి తుది అవరోహణను ప్రారంబించి 10 నిమిషాల్లో ల్యాండర్ ఉపరితలం నుండి 7.4 కిలోమీటర్లు ప్రయాణించింది.మరొక 38-సెకన్ల తరువాత ల్యాండర్ ఉపరితలం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి కమ్యూనికేషన్ కోల్పోయింది.

Best Mobiles in India

English summary
Can Chandrayan-2 Revert The Signals To ISRO?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X