బిట్‌కాయిన్ భారీగా బ్లాస్ట్, అందరి కొంపలు ముంచేసింది !

By Hazarath
|

బిట్‌కాయిన్‌..ఇప్పుడు ఈ పేరు తెలియని వారు మార్కెట్లో ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అనతి కాలంలో సంచలనంలా మారి అన్ని దేశాలకు చుక్కలు చూపించింది. దీని దెబ్బకు తాళలేని చాలా దేశాలు ఈ కరెన్సీని బ్యాన్ చేశారు. అయినప్పటికీ ఇది మార్కెట్లో అమితమైన వేగంతో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఇది భారీగా బ్లాస్ట్‌ అయి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. నేడు ఏకంగా 20 శాతం మేర కిందకి పడిపోయింది. మూడు నెలల కాలంలో తొలిసారి 6,200 డాలర్ల మార్కు కిందకి వచ్చి చేరింది.

 

భారీ ఆఫర్లతో సంచలనం రేపుతున్న వొడాఫోన్ రూ. 399 ప్లాన్భారీ ఆఫర్లతో సంచలనం రేపుతున్న వొడాఫోన్ రూ. 399 ప్లాన్

6,190 డాలర్ల కిందకు

6,190 డాలర్ల కిందకు

ఇటీవల కాలంలో ప్రపంచంలో ప్రధాన మార్కెట్లలో క్రిప్టోకరెన్సీకి ఎదురుదెబ్బలు తగులుతుండటంతో దీని విలువ భారీగా కుదేలవుతోంది. నవంబర్‌ మధ్య నుంచి తొలిసారి ఈ వర్చ్యువల్‌ కరెన్సీ 6,190 డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్టు చేసింది.

కఠినతరమైన పరిస్థితులు..

కఠినతరమైన పరిస్థితులు..

క్రిప్టోమార్కెట్‌కు పలు దేశాల నుంచి కఠినతరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చైనా, రష్యా, దక్షిణ కొరియా లాంటి అతిపెద్ద మార్కెట్ల ప్రభుత్వాలు దీనిపై నిషేధం విధిస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్ విలువ దారుణంగా పతనమవుతున్నది.

క్రిప్టోకరెన్సీలను వాడకుండా..

క్రిప్టోకరెన్సీలను వాడకుండా..

పేమెంట్‌ సిస్టమ్‌లో క్రిప్టోకరెన్సీలను వాడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భారత్‌ కూడా ప్రకటించింది. మార్కెట్ నుంచి పారదోలుతామని బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

జపాన్‌ అథారిటీలు రైడ్‌ ..
 

జపాన్‌ అథారిటీలు రైడ్‌ ..

హ్యాకర్లు 530 మిలియన్‌ డాలర్లు వర్చ్యువల్‌ కరెన్సీని దొంగలించడంతో, ఆ కరెన్సీ ఎక్స్చేంజ్‌పై జపాన్‌ అథారిటీలు రైడ్‌ కూడా చేశారు. రుణ భయాలతో పలు కమర్షియల్‌ లెండర్లు క్రెటిట్‌ కార్డుల ద్వారా బిట్‌కాయిన్లను కొనుగోలు చేయడాన్ని కస్టమర్లకు నిరాకరించాయి.

బిట్‌కాయిన్లపై ఆందోళన..

బిట్‌కాయిన్లపై ఆందోళన..

యూరప్‌, జపాన్‌, అమెరికా సెంట్రల్‌ బ్యాంకులు కూడా బిట్‌కాయిన్లపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్‌ భారీగా కిందకి పడిపోతుంది. అటు ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

19511 డాలర్ల మార్క్‌ హై రికార్డు

19511 డాలర్ల మార్క్‌ హై రికార్డు

కాగా గతేడాది నవంబర్ తర్వాత తొలిసారి బిట్‌కాయిన్ 5992 డాలర్ల స్థాయికి దిగజారింది. ఇప్పుడు ఏకంగా 6,200 డాలర్ల మార్కు కిందకి వచ్చి చేరింది. ఇంతకు ముందు ఆల్ టైమ్ హై రికార్డు 19511 డాలర్ల మార్క్‌ను చేరుకున్న విషయం తెలిసిందే.

Best Mobiles in India

English summary
Can I still get rich with Bitcoin Read more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X