చైనా ఉత్పత్తుల బహిష్కరణ ఎండమావే ! షాకింగ్ కారణాలు ఇవే

Written By:

భారత మార్కెట్లో ఇప్పడు ఆధిపత్యం ఎవరిదైనా ఉందంటే ముందుగా చైనా పేరునే చెప్పుకోవాలి. ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా వస్తువులే మన దేశ మార్కెట్ ని ఆక్రమించాయి. అయితే ప్రధాని మోడీ ఈ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చిన తరువాత దాని ఊసే కానరావడం లేదు. సోషల్ మీడియాలో దీనిపై అనుకున్నంత స్పందన రావడం లేదని తెలుస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

చైనాకు దిమ్మతిరిగింది :అప్పుడే హెచ్చరికలు మొదలుపెట్టింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోడీ ఈ విషయంలో మౌనం

చైనా ఉత్పత్తులు బహిష్కరించాలని కొంతమంది బిజెపి నేతలు వంత పాడుతున్నా దేశ ప్రధాని మోడీ ఈ విషయంలో మౌనంగా ఉంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చైనాతో వాణిజ్యంపై తన దృష్టిని నిలిపారు.

మేక్‌ ఇన్‌ ఇండియా' విజయం సాధించాలంటే

ఇంకా చెప్పాలంటే మోదీ మానసపుత్రిక 'మేక్‌ ఇన్‌ ఇండియా' విజయం సాధించాలంటే ఇప్పుడు చైనా మీదే మనం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

భారత్‌ ఏటా 6,170 కోట్ల డాలర్ల ఉత్పత్తులను దిగుమతి

చైనాకు భారత్‌ ఏటా 900 కోట్ల డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటే, ఆ దేశం నుంచి భారత్‌ ఏటా 6,170 కోట్ల డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది.

వ్యత్యాసం అక్షరాలా 5,270 కోట్ల డాలర్లు

ఎగుమతులు, దిగుమతుల మధ్యనున్న వ్యత్యాసం అక్షరాలా 5,270 కోట్ల డాలర్లు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలని చైనా ఎన్నోసార్లు భారత్‌కు విజ్ఞప్తి చేసింది.

భారత్‌కు పూట గడవదనే విషయం

ప్రస్తుతం చైనా దిగుమతులు లేకుండా భారత్‌కు పూట గడవదంటే అతిశయోక్తి కాదు. భారత్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా చైనాకు గడుస్తుంది కానీ చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా భారత్‌కు పూట గడవదనే విషయం ఈ వ్యత్యాసమే సూచిస్తోంది.

పలు ప్రాజెక్టులను చైనా పెట్టుబడిదారులు

హైస్పీడ్‌ రైళ్లు, పలు జాతీయ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి భారత్‌ ప్రధానంగా చైనా పెట్టుబడులు, అక్కడి సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులను చైనా పెట్టుబడిదారులు భారత్‌లో నిర్మిస్తున్నారు.

పటేల్‌ కాంస్య విగ్రహం ప్రస్తుతం చైనాలోనే

మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కాంస్య విగ్రహం ప్రస్తుతం చైనాలోనే తయారవుతోంది.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌

ఇక పండగ సీజన్‌ కావడంతో ఇప్పటికే చైనా ఉత్పత్తులు భారత్‌లో 87 కోట్ల డాలర్ల వ్యాపారాన్ని చేసుకున్నాయి. ఒక్క ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా జరిగిన వ్యాపారం మాత్రమే ఇది.

ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలే

ఆన్‌లైన్‌లో జరిగిన వ్యాపారంలో ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలే ఎక్కువగా ఉన్నాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆన్‌లైన్‌ వ్యాపారంతో పోలిస్తే ఇది ఏడింతలు ఎక్కువ. మిగతా పద్ధతుల్లో జరిగిన వ్యాపారం వివరాలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఎలక్ట్రానిక్‌ వస్తువులను

అయితే కొన్ని వస్తువులను బహిష్కరించవచ్చునేమో కాని ఎలక్ట్రానిక్‌ వస్తువులను పెద్దగా బహిష్కరించే అవకాశం లేదు. అవే ఇప్పుడు ఇండియాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

మేక్‌ ఇన్‌ ఇండియా మేడ్‌ బై చైనా

మొత్తంగా 'మేక్‌ ఇన్‌ ఇండియా మేడ్‌ బై చైనా' కావాలంటే ఇరుదేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు కొనసాగించక తప్పని పరిస్థితి. అటువంటి సమయంలో చైనా ఉత్పత్తుల బహిష్కరణ అనేది ఎండమావిగానే ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

l

English summary
Can India really avoid Chinese Gadgets Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot