నిద్రలేమితో భాదపడే సాప్ట్‌వేర్ ఇంజనీర్స్‌కు శుభవార్త

Posted By: Staff

నిద్రలేమితో భాదపడే సాప్ట్‌వేర్ ఇంజనీర్స్‌కు శుభవార్త

సాప్ట్‌వేర్ ఇంజనీర్ అంటే అందరూ వేలకు వేలు జీతాలు వస్తుంటాయి అనే భ్రమలో ఉంటుంటారు. ఐతే కొంతవరకు నిజమే. ఉద్యోగం మత్తులో పడి ఆరోగ్యం గురించి సరిగ్గా ఆలోచించకపోతే ప్రమాదాల భారిన పడతారని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సాప్ట్‌వేర్ ఉద్యోగులకు వచ్చేటటువంటి జబ్బు నిద్రలేమి. నిద్రలేమి అంటే రేత్రిళ్శు నిద్రపోకుండా ఎక్కువ సేపు మేలుకుంటే వచ్చేదన్నమాట. ఇలాంటి జబ్బు సాధారణంగా బిపిఓ, సాప్ట్‌వేర్ ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. పని ఒత్తిడిలో ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు పాటించకుండా షిప్ట్‌లు అంటూ ఉద్యోగాలు చేస్తుంటారు. దాంతో నిద్రలేమికి గురవుతుంటారు. అంతేకాకుండా కళ్శ క్రింద కూడా నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వాటన్నింటి నుండి తప్పించుకోవాలంటే ఏమి చేయాలి. ఎలా సుఖంగా నిద్రపోవాలంటే ఏమి చేయాలో చూద్దాం.

అలాంటి తీవ్ర నిద్రలేమితో బాధపడుతున్న వారు ఇక మాత్రల జోలికెళ్లే అవసరం ఎంతమాత్రం లేదంటున్నారు వైద్యులు. 'రాత్రి టోపీ'(నైట్‌ క్యాప్‌) ధరించడం ద్వారా సుఖమయ నిద్ర సొంతమవుతుందని చెబుతున్నారు. అమెరికా వైద్యుల బృందం అతిశీతలీకరించిన నీటి ట్యూబులతో ఓ టోపీని రూపొందించింది. దాన్ని ధరించడం ద్వారా మెదడు నరాలు చల్లబడి.. మంచి నిద్రపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులోని 'ప్రీ ఫ్రంటల్‌ కార్టెక్స్‌' అనే భాగాన్ని చల్లబరచడం ద్వారా ప్రయోజనాలుంటాయని పిట్స్‌బర్గ్‌ వర్సిటీకి చెందిన ముఖ్యపరిశోధకుడు ఎరిక్‌ నోఫ్జింగర్‌ తెలిపారు.

అధ్యయనంలో భాగంగా నిద్రలేమితో బాధపడేవారిలో కొందరికి ఈ టోపీలు ధరింపజేసి.. మరికొందరిని మమూలుగా పరీక్షించామన్నారు. టోపీలు ధరించినవారు పడుకున్న సమయంలో 89 శాతం సమయం పూర్తిగా నిద్రలోనే ఉన్నారని తేలిందన్నారు. త్వరలోనే విస్తృత స్థాయి ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot