స్మార్ట్‌ఫోన్‌లను ఎగపడి కొంటున్న భారతీయలు.. ఈ లెక్కలు చూస్తే మీకే నిజమనిపిస్తుంది..!
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల కు భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పండుగల సీజన్ సమయంలో అధిక సంఖ్యలో కొనుగోలు జరుగుతుంటాయి. ప్రీమియం ఫోన్‌ల నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ వరకు కొనుగోలు చేస్తారు. అయితే తాజాగా Canalys రీసెర్ట్ కీలక వివరాలను విడుదల చేసింది. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2024 మూడో త్రైమాసికంలో 9 శాతం వృద్ధిని నమోదు చేసిందని Canalys రిసెర్చ్ పేర్కొంది. మొత్తంగా 47.1 మిలియన్ యూనిట్లను రవాణా చేసినట్లు తెలిపింది. ఈ జాబితాలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.
2024 Q3 లో వివో 19 శాతం మార్కెట్ షేర్ తో (Vivo shipments) ఏకంగా 9.1 మిలియన్ ల యూనిట్‌లను రవాణా చేసినట్లు ఈ పరిశోధన నివేదిక పేర్కొంది. రెండో స్థానంలో 7.8 మిలియన్ మొబైల్ యూనిట్ల షిప్‌మెంట్‌లతో షియోమి (Xiaomi) ఉంది. మూడో స్థానంలో 7.5 మిలియన్ మొబైల్స్ షిప్‌మెంట్‌లతో శాంసంగ్ (Samsung) నిలిచింది.

6.3 మిలియన్ మొబైల్ షిప్‌మెంట్ లతో OPPO నాలుగో స్థానంలో, 5.3 మిలియన్‌ల షిప్‌మెంట్‌లతో రియల్‌మి (Realme) 5వ స్థానంలో నిలిచింది. ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు 11.1 మిలియన్ షిప్‌మెంట్‌లతో ఆరో స్థానంలో నిలిచాయి. మొత్తంగా ఈ సంవత్సరం మూడు త్రైమాసికంలో 9 శాతం వృద్ధి సాధించాయి.
ఈ రీసెర్చ్ నివేదిక ఆధారంగా కొత్త హ్యాండ్‌సెట్‌ల లాంచ్, ఛానల్ మార్జిన్‌లతో వివో తొలి స్థానంలో నిలిచింది. బలమైన ఆఫ్‌లైన్ ఛానల్‌లు సహా ఆన్‌లైన్ స్టో్‌ర్‌లను ఉపయోగించాయి. మిగిలిన టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు మిడ్ హై రేంజ్‌లో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నాయి.
ఐఫోన్ 15 సిరీస్‌తో ఆపిల్ విక్రయాలు( iPhone) పెంచుకుంది. చిన్న నగరాల నుంచి కూడా బలమైన డిమాండ్‌ను అందుకుంది. దీంతోపాటు ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు గూగుల్ (Google pixel), నథింగ్ (Nothing Smartphones), మోటోరోలా (Motorola) సహా ఇతర బ్రాండ్‌లు ప్రత్యేకమైన డిజైన్, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్ సహా ఇతర వ్యూహాల ద్వారా వృద్ధి నమోదు చేస్తున్నాయి.
అగ్రస్థానంలో నిలిచిన వివో విషయానికి వస్తే.. T2, T3 సిరీస్‌లు తక్కువ ధరలో ఎక్కువ డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. అదే వివో V30e, వివో V30, వివో V40 సిరీస్ ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలోని కెమెరా, మల్టీ టాస్కింగ్ ఫీచర్‌లు, డిజైన్ సహా ఇతర అంశాలు ప్రభావితం చేస్తాయి. వివో మొబైల్‌ల కొనుగోలు పెరిగేందుకు ఇది కూడా కారణంగా ఉండవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








