మోడ్రెన్ లైఫ్‌స్టైల్ ఫోటోగ్రఫీ కోసం కానాన్ ‘EOS M100’..

|

జపాన్‌కు చెందిన ప్రముఖ ఫోటో కెమెరాల తయారీ కంపెనీ కానాన్, EOS M100 పేరుతో సరికొత్త ప్రొఫెషనల్ కెమెరాను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అత్యాధునిక మిర్రర్‌లెస్ ఇంటర్‌ఛేంజబుల్ లెన్స్‌తో వస్తోన్న ఈ కెమెరా ధర రూ.39,995.

Canon EOS M100 mirrorless camera launched in India: Features, specs and price

మోడ్రెన్ లైఫ్‌స్టైల్ ఫోటోగ్రఫీకి అనుగుణంగా తీర్చిదిద్దబడిన ఈ కెమెరా మరింత ఖచ్చితత్వంతో కూడిన ఫోటోగ్రఫీని అందించగలుగుతుందని కానన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. సెల్ఫ్-పోర్ట్రెయిట్స్, క్లోజప్ ఫుడ్ షాట్స్, స్వీపింగ్ ల్యాండ్‌స్కేప్స్ వంటి ట్రెండింగ్ ఫోటో షూట్స్‌కు ఇఓఎస్ ఎమ్100 కెమెరా పర్‌ఫెక్ట్ కాంప్లిమెంట్‌గా నిలుస్తుందని సంస్థ పేర్కొంది.

ఈ కెమెరాతో పాటుగా 5 సరికొత్త లెన్సులను కూడా కానన్ ఇండియా ఆవిష్కరించింది. టీఎస్- ఇ50ఎమ్ఎమ్ ఎఫ్/2.8ఎల్ మాక్రో, టీఎస్-ఇ90ఎమ్ఎమ్ ఎఫ్/2.8ఎల్ మాక్రో, టీఎస్-ఇ135ఎమ్ఎమ్ ఎఫ్/4ఎల్ మాక్రో, టీఎస్-ఇఎఫ్85ఎమ్ఎమ్ ఎఫ్/1.4ఎల్ ఐఎస్ యూఎస్ఎమ్, మాక్రో ట్విన్ లైట్ ఎంటి -26ఇఎక్స్-ఆర్‌టీ మోడల్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి.

ఇఓఎస్ ఎమ్100 కెమెరా ద్వారా హైక్వాలిటీ ఫోటోలతో పాటు స్టన్నింగ్ వీడియోలను చిత్రీకరించుకునే వీలుంటుంది. ఈ కెమెరాలో ఏర్పాటు చేసిన 3 అంగుళాల టిల్ట్ టైప్ ఎల్‌సీడీ డిస్‌ప్లే 180 డిగ్రీల వరకు రొటేట్ అవుతుంది. బ్లాక్ కలర్ వేరియంట్‌లో మాత్రమే ఈ కెమెరా అందుబాటులో ఉంటుంది. కాంపాక్ట్ ఇంకా స్టైలిష్‌గా డిజైన్ కాబడిన ఈ కెమెరాను సులువుగా ఆపరేట్ చేసుకునే వీలుంటుంది.

ఇంటర్నెట్ స్లోగా ఉందన్న సంగతి మరచిపోండి..ఇంటర్నెట్ స్లోగా ఉందన్న సంగతి మరచిపోండి..

కెమెరా స్పెసిఫికేషన్స్‌ను పరిశీలించినట్లయితే.. ఈ డివైస్ 24.2 మెగా పిక్సల్ ఏపీఎస్-సీ సీఎమ్ఓఎస్ సెన్సార్‌తో వస్తోంది. ఈ సెన్సార్‌తో పాటుగా ఏర్పాటు చేసిన డిజిక్ 7 ప్రాసెసర్ బ్యూటిఫుల్ ఇంకా క్లియర్ ఇమేజెస్‌ను ఆఫర్ చేస్తుంది. డ్యుయల్ - పిక్సల్ సీఎమ్ఓఎస్ ఆటో ఫోకస్ ఫీచర్ ద్వారా వేగంగా కదులుతోన్న సబ్జెక్టులను సైతం మరింత ఖచ్చితత్వంతో క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది.

ఈ కెమెరా 3 అంగుళాల టచ్ ప్యానల్ ఎల్‌సీడీ స్ర్కీన్‌తో వస్తోంది. క్రియేటివ్ అసిస్ట్ ఫీచర్ ద్వారా డివైస్ సెట్టింగ్స్ ను మరింత సింప్లిఫై చేసుకునే వీలుటుంది. ఈ ఫీచర్ ద్వారా కెమెరాను 6 రకాల సెట్టింగ్‌లలో కాన్ఫిగర్ చేసుకునే వీలుంటుంది. ఫోటోగ్రఫీ ఎక్స్‌ప్రెషన్స్‌ను విస్తృతం చేయటంలో క్రియేటివ్ అసిస్ట్ ఫీచర్ కీలక పాత్ర పోషిస్తంది.

ఇఓఎస్ ఎమ్100 ISO రేంజ్ 100-25600 మధ్య ఉంటుంది. ఇన్-కెమెరా రా కన్వర్షన్, సెల్ఫ్ పోర్ట్రెయిట్ మోడ్ విత్ స్మూత్ స్కిన్ ఫీచర్, బ్లుటూత్, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సీ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఈ కెమెరాలో ఉన్నాయి. వీడియోలను 60 పిక్సల్ ఫుల్ హెచ్‌డి క్వాలిటీలో రికార్డ్ చేసుకునే వీలుంటుంది. హెచ్‌డీఆర్ బ్యాక్ లైట్ కంట్రోల్ మోడ్, టైమ్-ల్యాప్స్ మూవీ ఫంక్షన్ వంటి అదనపు ఫీచర్లను ఈ కెమెరా క్యారీ చేస్తోంది.

కానన్ ఇమేజ్ గేట్‌వే యాప్ ద్వారా కెమెరాను ఇతర స్మార్ట్ డివైస్‌లతో పెయిర్ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతానికి కానన్ ఇఓఎస్ ఎమ్100 కెమెరా సింగిల్ కిట్ ఆప్షన్ (ఇఎఫ్-ఎమ్15-45ఎమ్ఎమ్ ఎఫ్/3.5-6.3 ఐఎస్ సిమ్ కిట్)తో లభ్యమవుతోంది. ఈ కెమెరాను TS-E సిరీస్ లెన్సులతో పెయిర్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Canon has now launched the EOS M100 camera in the Indian market.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X