కార్డ్‌లెస్ విత్ డ్రా ఇకపై చాలా ఈజీ, ఇలా చేయండి
కోవిడ్ 19 నేపథ్యంలో ఇప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అలాంటి సమయంలో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ వంటివి అవసరం. ఈ పరిస్థితుల్లో ఏటీఎం మిషన్‌ను సాధ్యమైనన్ని తక్కువసార్లు తాకడానికి కార్డ్‌లెస్ విత్ డ్రా ఎంతో ఉపయోగపడుతుంది. కార్డు ద్వారా డబ్బు తీసుకోవాలంటే పలుమార్లు ఏటీఎం మిషన్‌లో నెంబర్లు టైప్ చేయాలి. కానీ డెబిట్ కార్డు లేదా ఏటీఎం కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించకుండానే ఏటీఎం మిషన్‌ను సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటును వివిధ బ్యాంకులు ఇస్తున్నాయి. బ్యాంకును బట్టి రోజుకు రూ.10,000 నుంచి రూ.20,000 తీసుకోవచ్చు. ఈ సౌకర్యం ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లో ఉన్నది.

కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ ఇలా..
ఏటీఎం నుండి కార్డు లేకుండానే మనీ విత్ డ్రా ప్రక్రియ బ్యాంకును బట్టి ఒక్కో విధంగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ బరోడా , ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు కార్డ్‌లెస్ విత్ డ్రా కోసం వారి బ్యాంకుల యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

బ్యాంకు యాప్ డౌన్ లోడ్
ఎస్బీఐ కోసం యోనో యాప్ డౌన్ లోడ్ చేయాలి. ఇందులో యోనో క్యాష్ ఆప్షన్ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ అయిదే ఐమొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మనీ తీసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా బీవోబీ ఎంకనెక్ట్ ప్లస్ డౌన్ లోడ్ చేసుకొని, ఇందులో క్యాష్ ఆన్ మొబైల్ ఆప్షన్ ఉపయోగించాలి. కస్టమర్లు ఈ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ప్రారంభించవచ్చు. కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ కోసం కస్టమర్ ఆయా బ్యాంకు యాప్స్‌కు వెళ్లిన తర్వాత తాము ఉపసంహరించుకోవాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యాప్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు ఓటీపీ లేదా పిన్ వస్తుంది. అయితే ఇది పరిమిత కాలం మాత్రమే ఉంటుంది.

యోనో క్యాష్
యోనో క్యాష్ సేవల కోసం వినియోగించే ఏటీఎంలను 'యోనో క్యాష్ పాయింట్లు'గా వ్యవహరించనున్నారు.వినియోగదారులు ఈ పాయింట్‌లోకి వెళ్లిన తర్వాత కార్డు రహిత విత్‌డ్రాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. అనంతరం ఖాతాదారుడి మొబైల్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరు అంకెల రిఫరెన్స్ నంబరును ఎంటర్ చేయడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ పని 30 నిమిషాల్లోగా పూర్తిచేయాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.కు ఆరు అంకెల రిఫరెన్స్ సంఖ్య ఎస్‌ఎంఎస్ ద్వారా వస్తుంది. పిన్, రిఫరెన్స్ సంఖ్య వచ్చిన 30 నిమిషాల్లోగా నగదు ఉపసంహరణ పూర్తి చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications