యాహు సిఈవో పదవి నుండి క్యారోల్ బర్త్జ్‌ తొలగింపు

Posted By: Super

యాహు సిఈవో పదవి నుండి క్యారోల్ బర్త్జ్‌ తొలగింపు

సాప్ట్‌వేర్ రంగంలో మరో టెక్నాలజీ దిగ్గజం అయిన యాహు కంపెనీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ క్యారోల్ బర్త్జ్‌ని మంగళవారం ఫైర్ చేయడం చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇంటర్నెట్ కంపెనీ అయిన యాహు క్యారోల్ బర్త్జ్‌ని కంపెనీ ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించి మూడు సంవత్సరాలు కాకముందే ఇలా సడన్‌గా ఫైర్ చేయడంతో ఒక్కసారిగా దిగ్బాంతికి గురి అయ్యారు క్యారోల్ బర్త్జ్.

యాహు ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా క్యారోల్ బర్త్జ్ తొలగించిన తర్వాత ఆమె స్దానంలో కొత్త సిఈవో వచ్చే వరకు 42సంవత్సరాలు వయసు కలిగిన ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ తిమోతి మోర్స్ ఆ పదవి భాద్యతలను చేపట్టనున్నారు. త్వరలో సిఈవో పదవికి ప్రకటించనున్న అభ్యర్ది పేరు చాలా కాన్ఫిడెన్సియల్‌గా ఉంచడమే కాకుండా కొన్ని స్ట్రాటజిక్ రివ్యూ ప్రకారం అభ్యర్దిని వేటాడనున్నట్లు కాలిఫోర్నియా ఆధారిత కంపెనీ ప్రకటించింది.

యాహు కంపెనీ ఛైర్మన్ రాయ్ బాస్టాక్ బోర్డ్ మీటింగ్‌లో బోర్డ్ సభ్యుల ముందు మాట్లాడుతూ ఇప్పటి వరకు యాహు కంపెనీకి చేసిన సేవలకు గాను క్యారోల్ బర్త్జ్‌కి మాధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. కంపెనీ హిస్టరీలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొవడం మొట్టమొదటి సారని అన్నారు. దీనితో పాటు ప్రస్తుతం యాహు కంపెనీ ప్రైమరీ గోల్ ఏమిటంటే కంపెనీకి మంచి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తితో పాటు, బిజినెస్ ప్లాట్ ఫామ్‌ అభివృద్ది చేసే వ్యక్తులు చాలా అవసరం అని అన్నారు. మా కంపెనీలో చాలా మంది టాలెంటెడ్ టీమ్స్, మంచి హుమన్ రిసోర్సెస్ వెనుక ఉండి, మరలా తిరిగి యాహు కంపెనీకి పూర్వ వైభవాన్ని తీసుకొనిరావడం మాత్రమే కాకుండా, ఇండస్ట్రీలో లీడింగ్ కంపెనీగా అవతరించడానికి దోహాదపడతారని తెలిపారు.

షేర్ హూల్డర్స్‌ మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి మా శ్రాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు. 62 సంవత్సరాల వయసు కలిగిన క్యారోల్ బర్త్జ్ గతంలో బిజినెస్ సాప్ట్ వేర్ కంపెనీ ఆటో డెస్క్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. యాహు కంపెనీ ఆమెని ఫైర్ చేశారని తెలియగానే కంపెనీ ఉద్యోగులు ఆమెకి ఉద్వేగభరితమైన హృదయాలతో మెయిల్స్ పంపించడం జరిగింది. టెక్నాలజీ బ్లాగ్ AllThingsDలో యాహు కంపెనీ ఛైర్మన్ తనని ఫైర్ చేశారన్న విషయాన్ని ఎంతో బాధతో క్యారోల్ బర్త్జ్ తెలియజేశారు. దీనితో పాటు మీ అందరితో కలిసి పని చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కంపెనీ మరింత అభివృద్ది చెందాలంటూ తన శుభాకాంక్షలను తెలియజేశారు.

ఇక ప్రస్తుతం సిఈవో భాద్యతలను అప్పగించిన తిమోతి మోర్స్ జులై 2009 నుండి ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా యాహు కంపెనీలో పని చేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot