సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

|

లక్షలాది మంది మొబైల్ యూజర్లను వేధిస్తున్న సమస్య ‘రేడియేషన్', కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యవసరమైన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ‘బ్టూటూత్ హెడ్ సెట్లు' ఆవిర్భవించినప్పటికి పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు. వైర్లతో పనిచేసే హెడ్‌సెట్‌లు రేడియేషన్ నిర్మూలనకు దోహదపడుతున్నప్పటికి ప్రస్తుత తరానికి పొసగటం లేదు. సెల్ ఫోన్ వినియోగం వల్ల వెలువడే రేడియోధార్మికత కారణంగా తలనొప్పి, వినికిడి లోపం, కండరాల లోపం, మానసిక ఒత్తడి ఇంకా ఏకగ్రాత లోపాలు తలెత్తే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో సెల్ ఫోన్ యూజర్లు పాటించవల్సిన జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

1.) హెడ్‌సెట్‌ వాడడం

రేడియేషన్‌ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్‌ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్‌ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

2.) మెసేజ్‌లు పంపడం

వీలైనప్పుడల్లా లిఖిత సందేశాలు పంపటమూ మంచిదే. ఈ సమయంలో సెల్‌ఫోన్‌ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్‌ ప్రభావమూ దానిపై పడదు.

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!
 
సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

3.) అలారం గడియారంలా వద్దు

మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. దీంతో సెల్‌ఫోన్‌ విద్యుదస్కాంత క్షేత్ర ప్రభావం నుంచి మెదడును కాపాడుకోవచ్చు.

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

4.) జేబులో మొబైల్ పెట్టుకోవద్దు

సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని కొందరు వైద్యుల అభిప్రాయం. ఇది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్నీ తెచ్చిపెట్టొచ్చనీ వివరిస్తున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్‌ని దూరంగా ఉంచటం మేలు. బయటకు వెళ్లినపుడు ప్యాంటు, చొక్కా జేబుల్లో కన్నా సంచీలో వేసుకోవటం మంచిది.

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

5.) సిగ్నల్స్ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడటం మానుకోండి.

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

6.) నిద్రపోతున్న సమయంలో సెల్‌ఫోన్‌ను పక్కన పెట్టుకోవద్దు.

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

7.) ముఖ్యంగా గర్భవతులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది.

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

8.) సెల్‌ఫోన్‌లను చిన్నారులకు దూరంగా ఉంచాలి.

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

సెల్‌ఫోన్ వాడుతున్నారా..?, వీటిని ఖచ్చితంగా పాటించండి!

9.) ల్యాండ్‌లైన్ వినియోగం క్షేమదాయకం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X