సీబీఐ అధికారికి వాట్సాప్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏం చెప్పి రూ.2 లక్షలు కొట్టేశారో తెలుసా??
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఆధారంగా చేసుకొని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అయితే సైబర్ నేరగాళ్ల వలలో పోలీస్ అధికారులు కూడా చిక్కుతున్నారు. సైబర్ నేరగాళ్లు (Cyber Crime) ఏకంగా సీబీఐ అధికారినే మోసం చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలో 59 సంవత్సరాల CBI (కేంద్ర దర్యాప్తు సంస్థ) అధికారి మోసపోయారు. ఏకంగా అధికారి దగ్గర నుంచి రూ.2 లక్షలు బదిలీ (CBI officer lost RS 2 lakh) చేయించుకున్నారు. దీనిపై ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే..

సీబీఐ ముంబై కార్యాలయంలో పనిచేస్తున్న అధికారికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ అధికారుల పేరుతో వాట్సాప్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు చెందిన ఆశిష్ శర్మగా పరిచయం చేసుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీబీఐ అధికారి పేరుతో పార్శిల్ వచ్చిందని తెలిపారు. అయితే పార్శిల్ డెలివరీని నిలిపివేసినట్లు తెలిపారు.
విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్న పార్శిల్‌లో ఎనిమిది పాస్‌పోర్టులు, ఐదు బ్యాంకు క్రెడిట్ కార్డులు, 170 గ్రాముల మెఫెడ్రోన్ మరియు కొంత నగదు ఉందని సదరు సీబీఐ అధికారికి వాట్సాప్ కాల్ చేసి వ్యక్తి తెలియజేశాడు. దీంతో అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. అలా సుమారు 49 నిమిషాల పాటు ఆ వాట్సాప్ కాల్ సాగినట్లు సమాచారం.
ఆ తర్వాత రోజు అదే సీబీఐ అధికారికి ఢిల్లీ పోలీసుల పేరిట మరో ఫోన్ కాల్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ధ్రువీకరణ ప్రక్రియలో పాల్గొనాలని సీబీఐ అధికారికి తెలిపారు. ఇందుకు రూ.2 లక్షలు చెల్లించాలని సూచించారు. ఈ నగదు తిరిగి చెల్లిస్తారని చెప్పి సీబీఐ అధికారి నుంచి తమ ఖాతాకు నేరగాళ్లు బదిలీ చేయించుకున్నారు.
అయితే అనంతరం మోసపోయినట్లు గుర్తించిన ముంబైకి చెందిన సీబీఐ అధికారి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనలో సదరు సీబీఐ అధికారిని ఆందోళనకు గురిచేసి నగదును తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. సీబీఐ అధికారి సైతం ఎలాంటి ధ్రువీకరణ లేకుండా నగదును బదిలీ చేశారు.
ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. నేరగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురిచేసి నగదు కాజేసేందుకు ప్రయత్నం చేస్తారు. దీంతోపాటు ఆఫర్లు, బహుమతులు పేరిట మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ధ్రువీకరణ చేసుకోవాలి.
క్రెడిట్ కార్డు లేదా ఇతర సంస్థల నుంచి క్లెయిమ్‌ల పేరిట కాల్స్ వచ్చినప్పుడు ఆయా సంస్థల అధికారిక ఫోన్ నంబర్లు మరియు వెబ్‌సైట్ ద్వారా ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎటువంటి పరిస్థితుల్లోనూ OTP ని షేర్ చేయవద్దు మరియు సున్నితమైన సమాచారాన్ని వెల్లడించవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








