ఢిల్లీ సామూహిక హత్యలు, సీసీటివీలో దిమ్మతిరిగే నిజాలు

|

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందిన విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని క‌లిచి వేస్తోంది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనై వారంతా మోక్షం కోసమే ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని కొంతమంది వాదిస్తుండగా.. వారి బంధువులు మాత్రం మృతులంతా ఉన్నత విద్యావంతులని, మూఢ నమ్మకాలను నమ్మే ప్రసక్తేలేదని ఎవరో కావాలనే ఈ హత్యలు చేశారని వాదిస్తున్నారు. తమ కుటుంబానికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేవని ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇవి హత్యలు అయి ఉంటాయని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఆత్మహత్యలు చేసుకుంటే ముఖాన్ని, నోటిని చేతులను కట్టేసుకునే వారు కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే వాదనలు ఎలా ఉన్నా సీసీటీవీలో కొన్ని కొత్త నిజాలు బయటకు వచ్చాయి.

 

జియో తరువాత ప్లాన్ ఏంటీ, ముఖేష్ అంబానీ ఏం చేయబోతున్నారు ?జియో తరువాత ప్లాన్ ఏంటీ, ముఖేష్ అంబానీ ఏం చేయబోతున్నారు ?

సీసీ ఫుటేజీలను..

సీసీ ఫుటేజీలను..

సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే కొన్ని షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. చుందావత్ ఇంటి ఎదురుగా కుటుంబానికి చెందిన ఒక మహిళ, ఆమె కుమార్తె, మరో ఇద్దరు పిల్లలు సామూహిక ఆత్మహత్య కోసం వైర్లు, స్టూళ్లు తీసుకెళ్లడం కనిపించింది.

లలిత్ చుందావత్ డైరీలో ..

లలిత్ చుందావత్ డైరీలో ..

లలిత్ చుందావత్ డైరీలో రాసిన క్రమాన్నే కుటుంబ సభ్యులు అంతా పాటించినట్లుగా తెలుస్తోంది. మరణించిన తన తండ్రి ఆవహించినట్లు ప్రవర్తించిన లలిత్ అందరికీ మోక్షం లభిస్తుందని చెప్పాడు.

ఒకవేళ మృతి చెందితే..

ఒకవేళ మృతి చెందితే..

డైరీలో ప్రియాంకా చుందావత్ కూడా ఇదే విషయాన్ని రాసినట్లు తెలుస్తోంది. ఒకవేళ మృతి చెందితే చనిపోయిన లలిత్ తండ్రి తమను కాపాడతారని ఆ కుటుంబం భావించి ఉండొచ్చు. అయితే డైరీ చివరి వాక్యాలు ఇలా ఉన్నాయి.

రంగు మారిన సమయంలో..
 

రంగు మారిన సమయంలో..

"కప్‌లో కొన్ని నీళ్లు ఉంచండి, రంగు మారిన సమయంలో నేను ప్రత్యక్షమై మిమ్మలను కాపాడతాను. పూజలు పూర్తయ్యాక ఒకరి కట్లు ఒకరు విప్పుకోవాలి" అని డైరీలో రాసి ఉంది.

దగ్గరలోని ఫర్నీచర్ షాపునకు వెళ్లి..

దగ్గరలోని ఫర్నీచర్ షాపునకు వెళ్లి..

కుటుంబంలోని 12 ఏళ్ల ధృవ, 15 ఏళ్ల శివంలు దగ్గరలోని ఫర్నీచర్ షాపునకు వెళ్లి వైర్లు తీసుకొచ్చారు. అనంతరం వారి చేతులను పిల్లల తల్లిదండ్రులు కట్టేశారు. ఇదంతా సీసీటీవీ ఫుటేజేలో ఉంది.

 కేసును ఇన్విస్టిగేట్ చేస్తున్న పోలీసులు

కేసును ఇన్విస్టిగేట్ చేస్తున్న పోలీసులు

ఇదిలా ఉంటే ఈ కేసును ఇన్విస్టిగేట్ చేస్తున్న పోలీసులు మరో విధంగా అభిప్రాయాలను చెబుతున్నారు.తమ కుటుంబంలో చాలా కాలం తర్వాత ప్రియాకు పెళ్లి కుదరడంతో పాటు మరికొన్ని శుభాలు జరగడం వల్ల వారు భగవంతుడికి ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలని భావించినట్లు పోలీసులు వెల్లడించారు.

గ్రిల్‌ దగ్గర 9మంది ఉరి వేసుకోవాలని..

గ్రిల్‌ దగ్గర 9మంది ఉరి వేసుకోవాలని..

గ్రిల్‌ దగ్గర 9మంది ఉరి వేసుకోవాలని, లలిత్ సోదరి, సోదరుడు భువనేష్‌లో ఇంట్లో ఉన్న చిన్న మందిరం దగ్గర ఉరివేసుకోవాలని స్పష్టంగా డైరీలో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

డైరీలో ఏమయితే రాసి ఉందో

డైరీలో ఏమయితే రాసి ఉందో

డైరీలో ఏమయితే రాసి ఉందో కుటుంబ సభ్యులు తూచా తప్పకుండా పాటించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.

ఏ సమయంలో ఏమి చేయాలో..

ఏ సమయంలో ఏమి చేయాలో..

ఏ సమయంలో ఏమి చేయాలో అందులో రాసి ఉందని... అలానే రాత్రి 10 గంటల సమయంలో భోజనం ఆర్డర్ ఇవ్వాలని రాసి ఉండటంతో అదే సమయానికి ఆర్డర్ ఇచ్చారని పోలీసులు తెలిపారు.

ఇంటి తలుపులు తెరిచి చూడగా..

ఇంటి తలుపులు తెరిచి చూడగా..

జూలై 1న ఉదయం వారి ఇంటి తలుపులు తెరిచి చూడగా మొత్తం 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారంతా కళ్లకు గంతలు కట్టుకున్నారు. లలిత్ భార్య టీనా చేతులకు మాత్రం ఎలాంటి కట్లు లేవు.

ముందుగా హత్యలుగా భావించినప్పటికీ ..

ముందుగా హత్యలుగా భావించినప్పటికీ ..

ముందుగా హత్యలుగా భావించినప్పటికీ పలు కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు అవి సామూహిక ఆత్మహత్యలే అన్న నిర్ధారణకు వచ్చారు.

మూఢనమ్మకాలే..

మూఢనమ్మకాలే..

మూఢనమ్మకాలే వారి ప్రాణాలు తీశాయని సీసీ ఫుటేజీ, దొరికిన డైరీల ఆధారంగా స్పష్టమవుతోందని పోలీసులు తెలిపారు.

దేశంలో మూఢనమ్మకాలు..

దేశంలో మూఢనమ్మకాలు..

ఏదేమైనా ఒకే కుటుంబంలోని 12 మంది ఇలా సామూహిక హత్యలకు పాల్పడటంతో దేశంలో మూఢనమ్మకాలు అనే అంశాన్ని మరోసారి గుర్తుచేసుకున్నట్లయిందని పలువురు భావిస్తున్నారు. 

Best Mobiles in India

English summary
CCTV shows how Delhi family organised hanging - like stools, last meal More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X