ప్రపంచ జనాభాను మించిపోనున్న సెల్‌ఫోన్‌లు

Posted By:

కమ్యూనికేషన్ ప్రపంచంలో క్రియాశీలక పాత్ర పోషిసోన్న సెల్‌ఫోన్‌ల సంఖ్య 2014 డిసెంబర్ నాటికి 730 కోట్లకు చేరుకోనుందని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ తన తాజా నివేదికలో పేర్కొన్నట్లు సిలికాన్ ఇండియా పేర్కొంది.

ప్రపంచ జనాభాను మించిపోనున్న సెల్‌ఫోన్‌లు

అధికారిక లెక్కల ప్రకారం భూమండలం పై నివశిస్తున్న వారి సంఖ్య 700 కోట్లుగా ఉంది. అంటే, ఈ ఏడాది చివరకు ప్రపంచ జనాభా కంటే మొబైల్ ఫోన్‌ల సంఖ్యే అధికం కానుంది. దేశాల వారీగా సెల్‌ఫోన్‌ల వినియోగానికి సంబంధించి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఆసక్తికర వివరాలను వెల్లడించింది...

రష్యాలో 25 కోట్ల సెల్‌ఫోన్ అకౌంట్లు ఉన్నాయి. ఈ సంఖ్య అక్కడి జనాభాతో పోలిస్తే 1.8 రెట్లు అధికం. బ్రెజిల్‌లో కూడా ఇదే పరిస్థితి, ఇక్కడ 24 కోట్ల సెల్‌ఫోన్ అకౌంట్లు ఉన్నాయి. ఈ సంఖ్య అక్కడి జనాభాతో పోలిస్తే 1.2 రెట్లు అధికం.

అభివృద్థి చెందుతోన్న దేశాల్లో 60 శాతం మంది ప్రజల దినసరి సంపాదన రెండు డాలర్లు కంటే తక్కువే ఉన్నప్పటికి, వారిలో అత్యధికలు మొబైల్ ఫోన్‌లను కలిగి ఉన్నట్లు సదరు నివేదిక తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Cell phones likely to overtake human population across the world. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot