Home
News

తొలిసారిగా ఇండియన్‌ రైల్వేలో ATM సేవలు.. ఎక్కడ ఏర్పాటు చేశారో తెలుసా..?

భారత్‌లో ఎక్కువ మంది ప్రజలు దూర ప్రాంత ప్రయాణాల కోసం రైల్వే నెట్‌వర్క్‌ను ఎంచుకుంటారు. తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా అధిక శాతం రైలు ప్రయాణాలు చేస్తారు. డిజిటల్‌ పేమెంట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేని కాలంలో ప్రయాణికులు.. రైలు బయలుదేరే కంటే ముందే బ్యాంకులు లేదా ATM ల నుంచి నగదు తీసుకొనే వాళ్లు. అయితే UPI సహా డిజిటల్ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాక.. సులభంగా ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నారు.

కొన్ని కారణాలతో :
అయితే ఇప్పటికీ కొంత మంది ప్రయాణికులు నగదు ను తమ వెంట తీసుకెళ్తుంటారు. రైలు ప్రయాణం మధ్యలో సిగ్నల్‌ సమస్య తోపాటు ఇతర కారణాలతో అవసరం అయిన నగదును ముందే విత్‌డ్రా చేసుకుంటారు. ఇలాంటి ప్రయాణికుల కోసం రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఏకంగా రైళ్లలోనే ATM ను (ATMs in Train) ఏర్పాటు చేసింది

Central railway installed ATM in panchavati express

రైలులో ATM ఏర్పాటు :
ప్రముఖ సంస్థల కార్యాలయాలు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో సహజంగా ATM లను ఏర్పాటు చేస్తుంటారు. ఉద్యోగాలు, విద్యార్థుల సౌకర్యం కోసం బ్యాంకుల సాయంలో ఏర్పాటు చేస్తుంటారు. అయితే సెంట్రల్‌ రైల్వే తొలిసారిగా రైలులో ATM ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది.

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సాయంతో :
సెంట్రల్‌ రైల్వే అధికారులు.. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సాయంతో పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ATM ను (Panchavati Express ATM) ఏర్పాటు చేశారు. ఈ రైలు ముంబై నుంచి మన్మాడ్‌ మధ్య నడుస్తుంది. రైలులోని AC కోచ్‌లో ఈ ATM ను అమర్చింది. గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ATM ను ఏర్పాటు చేసింది.

భద్రతా ఏర్పాట్లు :
త్వరలో పూర్తి స్థాయిలో ATM సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ATM ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఎలాంటి భద్రత సమస్యలు లేకుండా ఉండేందుకు షట్టర్‌ డోర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌ నుంచి నాసిక్ జిల్లాలోని మన్మాడ్‌ జంక్షన్‌ మధ్య పంచవటీ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. 4.35 నిమిషాల్లో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇంటర్‌సిటీ ప్రయాణికులకు ఈ ట్రైయిన్‌ అనుకూలంగా ఉంటుంది. ఈ రైలులో ATM ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుందని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.

గతంలో పోలిస్తే రైల్వేలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రయాణికులకు సౌకర్యం, భద్రత కోసం రైల్వే అనేక ఏర్పాటు చేస్తోంది. టికెటింగ్ సిస్టమ్‌లోనూ కీలక మార్పులు చేసింది. ప్రయాణికుల సౌకర్యం కోసం స్వరైల్‌ పేరుతో ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాప్‌ టెస్టింగ్‌ దశలో ఉంది.

ప్రస్తుతం రైల్వేలో వివిధ అవసరాల కోసం అనేక యాప్స్‌, వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటిని స్వరైల్‌ యాప్‌తో ఇంటిగ్రేట్‌ చేశారు. ఈ యాప్‌ ద్వారా టికెట్‌ బుకింగ్, ప్లాట్‌ఫాం టికెట్ల, ఫిర్యాదులు, ఫుడ్‌ ఆర్డర్‌, ట్రైయిన్‌ ట్రాకింగ్‌ వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Central railway installed ATM in panchavati express for the first time in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X