BSNL అభివృద్ధికి రూ.1.67 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర క్యాబినెట్

|

ఇండియాలోని టెలికాం రంగంలో గల ఏకైక ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) వెనుకబడి ఉన్న విషయం అందరికి తెలిసిన విషయమే. ప్రైవేట్ టెల్కోలు 5G కోసం స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటూ ఉంటే బిఎస్‌ఎన్‌ఎల్ ఇంకా 4G నెట్‌వర్క్ ని అందుబాటులోకి తీసుకొనిరావడానికి ప్రయత్నాలను చేస్తోంది. ఒకరకంగా చూసుకున్న కూడా ఇది కూడా ఉత్తమ మార్గంగా అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ కోసం సుమారు 1.67 లక్షల కోట్ల రూపాయల సహాయ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.

 

BSNL మార్కెట్

టెలికాం రంగంలో BSNL ఉనికి మార్కెట్ బ్యాలెన్సర్‌గా పనిచేయడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బిఎస్‌ఎన్‌ఎల్ ని తిరిగి పాత వైభవం తీసుకొనిరావడానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 1.67 లక్షల కోట్ల రూపాయల BSNL పునరుద్ధరణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ పునరుద్ధరణ చర్యలలో ముఖ్యంగా BSNL సేవలను అప్‌గ్రేడ్ చేయడం, బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడం, స్పెక్ట్రమ్‌ను కేటాయించడం మరియు BBNL (భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్)తో విలీనం చేయడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టెల్కోకు అందించిన పునరుద్ధరణ ప్యాకేజీతో కంపెనీ రానున్న రోజులలో ఎటువంటి మార్పులను తీసుకొని రానున్నదో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL అప్‌గ్రేడ్ సర్వీసులు
 

BSNL అప్‌గ్రేడ్ సర్వీసులు

** BSNL టెలికాం సంస్థ భారతదేశంలో ముందుగా 4G సేవలను అందించడానికి 900 MHz మరియు 1800 MHz బ్యాండ్‌లలో 4G స్పెక్ట్రమ్‌ను కేటాయించబడుతుంది. దీనికి సుమారు రూ.44,993 కోట్లు ఖర్చుచేయనున్నది.

** BSNL దేశీయంగా అభివృద్ధి చేసిన 4G స్టాక్‌ను అమలు చేస్తున్నందున రాబోయే నాలుగేళ్లలో వాటి కాపెక్స్ అవసరాల కోసం సుమారు రూ.22,471 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం సమకూర్చనున్నది.

** మూడవది వాణిజ్యపరంగా అధిక ఆసక్తి లేని ప్రాంతాల్లో సేవలను అందించడం కోసం భారత ప్రభుత్వం నుండి BSNL రూ.13,789 కోట్లను వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో అందుకుంటుంది. ఇందుకోసం బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం రూ.13,789 కోట్లు ఇవ్వనుంది.

** నాలుగవది AGR బకాయిలు, స్పెక్ట్రమ్ కేటాయింపు మరియు కాపెక్స్ కేటాయింపులకు బదులుగా ప్రభుత్వం BSNL యొక్క అధీకృత మూలధనాన్ని రూ. 40,000 కోట్ల నుండి రూ. 1,50,000 కోట్లకు పెంచింది.

 

డి-స్ట్రెస్సింగ్ BSNL బ్యాలెన్స్ షీట్

డి-స్ట్రెస్సింగ్ BSNL బ్యాలెన్స్ షీట్

** ప్రభుత్వం అందించే BSNL పునరుద్ధరణ ప్యాకేజీ యొక్క ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి బ్యాలెన్స్ షీట్‌పై ఒత్తిడిని తగ్గించడం. కావున ప్రభుత్వం చేసే ఐదవ విషయం దీర్ఘకాలిక రుణాల సేకరణకు గ్యారంటీని అందించడం. PSUలు రూ. 40,399 కోట్ల మొత్తానికి దీర్ఘకాలిక బాండ్లను సేకరించగలవు మరియు ఇది ఇప్పటికే ఉన్న రుణాలను పునర్వ్యవస్థీకరించడంలో సహాయపడుతుంది.

** ఆరవ విషయం ఏమిటంట BSNL యొక్క రూ.33,404 కోట్ల విలువైన AGR బకాయిలను ప్రభుత్వం తనకు తానుగా ఈక్విటీగా మార్చుకోవడమే కాకుండా ఆ మొత్తాన్ని సెటిల్ చేస్తుంది. AGR/GST బకాయిలను తీర్చడానికి BSNL నుండి నిధులను పొందుతుంది.

** 7,500 కోట్ల రూపాయల విలువైన ప్రిఫరెన్స్ షేర్లను బిఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వానికి తిరిగి జారీ చేయనున్నది.

 

BSNL మరియు BBNL విలీనం

BSNL మరియు BBNL విలీనం

BBNLని BSNLలో విలీనం చేయడం అనేది పునరుద్ధరణ ప్యాకేజీలో చివరి విషయం. భారతదేశంలో BBNL ఇప్పటికే మొత్తం అంతా విస్తరించి ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. భారత్‌నెట్ ప్రాజెక్ట్ ఇప్పటికీ జాతీయ ఆస్తిగా ఉండబోతోంది మరియు భారతీయులకు వివక్షత లేని సేవలను అందించడానికి TSPలను (టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు) పరపతిని అనుమతించడం గమనించదగ్గ విషయం.

పునరుద్ధరణ ప్లాన్ అమలు

పైన తెలిపిన ఈ చర్యలతో BSNL ఇప్పటికే ఉన్న తమ యొక్క సేవల నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా 4G సేవలను అందుబాటులోకి తీసుకురాగలదు మరియు ఆర్థికంగా లాభదాయకంగా కూడా మారుతుంది. ఈ పునరుద్ధరణ ప్లాన్ అమలుతో 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి BSNL ప్రైవేట్ టెల్కోలకు దీటుగా లాభాలను ఆర్జించవచ్చని భావిస్తున్నట్లు క్యాబినెట్ నుండి విడుదలైన ఒక ప్రకటన తెలిపింది.

NSA టెక్నాలజీతో BSNL 5G సర్వీస్

NSA టెక్నాలజీతో BSNL 5G సర్వీస్

BSNL టెలికాం సంస్థ తన యొక్క 5G సర్వీసులను NSA (నాన్-స్టాండలోన్) నెట్‌వర్క్‌ల విడుదలతో ప్రారంభించనున్నది. బేస్ 4G కోర్ నెట్‌వర్క్‌ నిర్మాణంతో దీనికి నాంది పలకవచ్చు. 5G NSA BSNL కోసం తక్కువ బడ్జెట్ ధరలోనే స్నేహపూర్వకంగా లభిస్తుంది. అయితే 5G SAకి కోసం పూర్తి స్థాయిలో కొత్త వ్యవస్థను సెటప్ చేయవలసి ఉంటుంది. దీని కోసం BSNL వద్ద తగినంత డబ్బు లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇంతకుముందు గల స్వదేశీ పరికరాలు మరియు టెక్నాలజీను ఉపయోగించి బిఎస్‌ఎన్‌ఎల్ 5G పై పని చేస్తున్నట్లు C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) అధికారి తెలిపారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో 5G నెట్‌వర్క్‌లను ఆశించవచ్చు.

మెగా 5G స్పెక్ట్రమ్ వేలం

మెగా 5G స్పెక్ట్రమ్ వేలం

భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించే మెగా 5G స్పెక్ట్రమ్ వేలం జూలై 26 నుండి ప్రారంభం అయింది. భారతదేశంలో కొత్త 5G యుగానికి సిద్ధం కానున్నది. ముందు జరిగిన వేలాన్ని దృష్టిలో ఉంచుకుంటే కనుక మెగా బిడ్ దాదాపు రూ. 1.5 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. 5G నెట్‌వర్క్‌లు 4G కంటే 10 రెట్లు మరియు 3G కంటే 30 రెట్లు వేగంగా అందుబాటులో ఉండనున్నాయి. వేలంలో పాల్గొనే టాప్ క్యారియర్‌లలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు ఉన్నాయి. ఎయిర్‌వేవ్‌లలోకి కొత్తగా ప్రవేశించిన అదానీ గ్రూప్ కూడా డేటా నెట్‌వర్క్‌ల కోసం కొన్ని 5G ఎయిర్‌వేవ్‌ల కోసం పిచ్ చేయనున్నది. అదానీ గ్రూప్ ఇప్పటివరకు కూడా 100 కోట్ల రూపాయల EMD (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) మాత్రమే సమర్పించింది. స్పెక్ట్రమ్ వేలంలో వారి ఖర్చు చాలా పరిమితంగా ఉంటుందని దీని అర్థం. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యాజమాన్యంలోని రిలయన్స్ జియో టెలికాం సంస్థ మాత్రం ఎవరు ఊహించని విధంగా అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని నిఘా వర్గాల యొక్క ఊహాగానాలు.

Best Mobiles in India

English summary
Central Union Cabinet Announced Rs.1.67 Lakh Crore Relief Package For The Development of BSNL

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X