Home
News

CERT-in స్మార్ట్‌ఫోన్లు అప్‌డేట్‌ చేసుకోండి.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు కేంద్రం కీలక హెచ్చరిక..!!

భారత ప్రభుత్వానికి చెందిన సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-in) కీలక హెచ్చరికలు జారీచేసింది. ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్‌లపై పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్లలో అనేక భద్రతా లోపాలపై కీలక నోట్‌ను జారీచేసింది. ఈ నెల జారీ చేసిన ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ బులిటెన్‌లో (Android Security Bulletin) గూగుల్‌, క్వాల్‌కాం, మీడియాటెక్‌ వంటి స్మార్ట్‌ఫోన్ కాంపోనెంట్‌లలో ఇటీవల వచ్చిన సెక్యురిటీ లోపాలపై హెచ్చరించింది.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవల గుర్తించిన 9 భద్రతా లోపాలపై సెక్యూరిటీ ప్యాచ్‌ (అప్‌డేట్)లు విడుదల చేసింది. అయితే ఈ ఆండ్రాయిడ్‌ భద్రతా లోపాలపై సైబర్‌ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌గా పిలుచుకొనే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం CERT-in కీలక సలహాలతో కూడిన నోట్‌ను విడుదల చేసింది.

CERT-in Issued high level security warning to android users 2024

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని ఫ్రేమ్‌ వర్క్‌, సిస్టమ్‌, AMLogic, ARM కాంపోనెంట్స్‌, మీడియాటెక్‌ కాంపోనెంట్లు, క్వాల్‌కాం కాంపోనెంట్స్‌లో లోపాలను గుర్తించిట్లు పేర్కొంది. ఈ లోపాలను ఎక్కువ ప్రమాదం కలిగించే జాబితాలో ఉంచినట్లు తెలిపింది. ఈ లోపాల కారణంగా ఆండ్రాయిడ్‌ 12, ఆండ్రాయిడ్‌ 13, ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

గూగుల్‌ ఇప్పటికే తన ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌లో లోపాలను గుర్తించిందని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ సిస్టమ్‌ తెలిపింది. ఈ లోపాలతో సైబర్‌ నేరగాళ్లు ఆండ్రాయిడ్ డివైజ్‌లపై దాడిచేసి వ్యక్తిగత సమాచారం యాక్సెస్‌ చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రమాదకర కోడ్‌లను రన్‌ చేసి డివైజ్‌ పనిచేయకుండా చేసే అవకాశం ఉందని పేర్కొంది.

గూగుల్‌ సైతం (Google) దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ బులిటెన్‌లో షేర్‌ చేసింది. బూట్‌లోడర్‌లో AMLogic కాంపొనెట్లు, Mali Arm కాంపొనెట్లు లోపాలను గుర్తించింది. మరియు వైఫై సహా క్వాల్‌కాంలోని కెర్నల్‌లోని భద్రతా లోపాలను గురించి పేర్కొంది.

శాంసంగ్‌ కూడా తాము గుర్తించిన 9 భద్రతా లోపాలపై సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో వైఫై, యాప్‌లాక్‌ సహా ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన అనేక భాగాలు సహా బూట్‌లోడర్‌ లోని లోపాలను ఈ అప్‌డేట్‌ ద్వారా సవరించినట్లు తెలిపింది. ఇతర లోపాలను గుర్తించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వంలోని ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ - కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-in) ఆండ్రాయిడ్‌ యూజర్లు వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. తాము విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్‌ల ద్వారా సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించిన లోపాలను నుంచి బయటపడవచ్చని గూగుల్‌ స్పష్టం చేసింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
indian cyber security agency CERT-in warns android users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X