Home
News

ఆండ్రాయిడ్‌ యూజర్లకు కీలక హెచ్చరిక.. వెంటనే మీ ఫోన్‌లు అప్‌డేట్‌ చేసుకోండి..!

కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT-in) హై సెక్యూరిటీ అలెర్ట్‌ ను జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లపై సెక్యూరిటీ లోపాలను గుర్తించినట్లు తెలిపిన సెక్యూరిటీ ఏజెన్సీ, కీలక సూచనలు చేసింది.

ఈ ఫోన్‌లకు అలెర్ట్‌ :
కేంద్ర ప్రభుత్వ సైబర్‌ వాచ్ డాగ్‌ గా వ్యవహరించే CERT-in హ్యాంకింగ్ ప్రమాదంపై ఆండ్రాయిడ్‌ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15, ఆండ్రాయిడ్‌ 16 OS వెర్షన్‌లలో అనేక లోపాలు ఉన్నాయని తెలిపింది. దీని వల్ల ఆయా OS యూజర్లు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.

CERT in warnings to android smartphones1

హ్యాంకింగ్ ప్రమాదం :
ఇందులోని భద్రతా లోపాల కారణంగా హ్యాకర్లు ఆయా డివైజ్‌ లను హ్యాకింగ్‌ చేసేందుకు, స్మార్ట్‌ఫోన్‌ డేటాను యాక్సెస్‌ చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. దీంతో డివైజ్‌ పూర్తిగా క్రాష్‌ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అనేక మంది యూజర్లకు ఈ ప్రమాదం పొంచి ఉందని తెలిపింది.

వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి :
ఈ OS వెర్షన్‌ లను ఉపయోగిస్తున్న యూజర్లు గూగుల్‌ విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్‌ ను వెంటనే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని CERT-In సూచించింది. ఈ అప్‌డేట్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా హ్యాంకింగ్‌ సహా ఇతర సమస్యల నుంచి సురక్షితంగా బయటపడవచ్చని చెబుతోంది.

ఇలా అప్‌డేట్‌ చేసుకోవచ్చు :
ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ ఫోన్ సెట్టింగ్స్‌ లోకి వెళ్లి, ఈ సెక్యూరిటీ ప్యాచ్‌ ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్‌ ఫోన్‌ సెట్టింగ్స్‌ లోకి వెళ్లాలి. అనంతరం About Phone పైన క్లిక్‌ చేయాలి. తర్వాత సిస్టమ్‌ అప్‌డేట్‌ పై క్లిక్‌ చేసి, అక్కడ మీకు వచ్చిన అప్‌డేట్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొన్ని సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను విడుదల చేస్తుంటాయి. వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా భద్రతా లోపాలు సహా ఇతర సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ అప్‌డేట్స్‌ ను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

ఆండ్రాయిడ్ కోర్ సిస్టమ్‌ :
ఆండ్రాయిడ్‌ కోర్‌ సిస్టమ్‌తోపాటు ఇతర చిప్‌లలో ఈ లోపాలు గుర్తించినట్లు తెలిపింది. శాంసంగ్, వన్‌ప్లస్‌, మోటోరోలా, వివో, గూగుల్‌, ఒప్పో, రియల్‌మి, షియోమీ వంటి మోడల్స్‌ ఈ లోపాల కారణంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ యూజర్లు అంతా వెంటనే తమ ఫోన్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

స్మార్ట్‌ఫోన్ లో ఈ తరహా సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్‌ అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు యాంటీ మాల్‌వేర్‌ సాఫ్ట్‌వేర్‌ ను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దీంతో బ్రౌజింగ్‌ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

అనుమానాస్పద లింక్స్‌ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయకూడదు. ఎక్కడైనా అనుమానాస్పదంగా అనిపిస్తే, వెంటనే సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మోసపోయినట్లు భావిస్తే, సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించాలి.

Best Mobiles in India

English summary
CERT in issued high security warnings to android smartphones, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X