సీఈఎస్ 2013 (టెక్నాలజీ ఎగ్జిబిషన్, 8నుంచి ప్రారంభం)

Posted By: Prashanth

సీఈఎస్ 2013 (టెక్నాలజీ ఎగ్జిబిషన్, 8నుంచి ప్రారంభం)

 

అతిపెద్ద టెక్నాలజీ ఉత్పత్తుల ప్రదర్శన ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’ (సీఈఎస్) 2013, ఈ నెల 8 నుంచి 11 వరకు అమెరికాలోని లాస్‌వేగాస్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ వేదికలో చోటుచేసుకోబోయే పలు కీలక అంశాలను మీ ముందుంచుతున్నాం..

నమ్మశక్యం కాని వింతలు!

మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఆమోజన్ పాల్గొనటం లేదు....

ఈ అతిపెద్ద ట్రేడ్ షో ఎగ్జిబిషన్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఆమోజన్ వంటి దిగ్గజం శ్రేణి టెక్ కంపెనీలు పాల్గొనటం లేదు. అయినప్పటికి 20,000 కొత్త ఉత్పత్తులను ఈ షోలో

ప్రదర్శించనున్నారు.

స్మార్ట్‌టీవీలకు పెద్దపీట....

సీఈఎస్ 2013, స్మార్ట్‌టీవీల ప్రదర్శనకు వేదికగా నిలవనుంది. సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు సరికొత్త శ్రేణి

స్మార్ట్‌టీవీలను పరిచయం చేయనున్నాయి. ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఫీచర్లను ఈ స్మార్ట్‌టీవీలు కలిగి ఉండటం విశేషం.

సీఈఎస్ వేదిక పై సామ్‌సంగ్ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే!

టెక్నాలజీ ప్రపంచాన్ని కనవిందుచేసేందుకు ముస్తాబవుతున్న ‘కన్స్యూమర్ ఎలక్ట్ర్రానిక్స్ షో – 2013’ ఎన్నో సాంకేతిక ఆవిష్కరణలను వేదికగా నిలవనుంది. జనవరి 8 నుంచి 11 వరకు లాస్ వేగాస్ నగరంలో అట్టహాసంగా నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ ‘షో’లో భాగంగా సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్, తన రేపటితరం 5.5 అంగుళాల ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేను ప్రదర్శించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వొంపులు తిరిగి ఉండే ఈ ఫ్లెక్సిబుల్ స్మార్ట్‌ఫోన్

డిస్‌ప్లే 1280 x 720పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్ సామర్ద్యాన్ని కలిగి ఉంటుంది. కొత్త తరహా మొబైలింగ్ అనుభూతులకు లోను చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot