ఆరోగ్యవంతమైన నిద్ర కోసం ‘నోకియా స్లీప్ సెన్సార్’

Posted By: BOMMU SIVANJANEYULU

లాస్‌వేగాస్ వేదికగా జరుగుతోన్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2018లో భాగంగా ఫిన్‌ల్యాండ్ దిగ్గజం నోకియా విప్లవాత్మక స్లీప్ సెన్సార్‌తో పాటు ఓ ఆరోగ్య సంబంధిత యాప్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.

ఆరోగ్యవంతమైన నిద్ర కోసం ‘నోకియా స్లీప్ సెన్సార్’

నోకియా స్లీప్ (Nokia Sleep) పేరుతో అనౌన్స్ అయిన ఈ అడ్వాన్సుడ్ సెన్సార్ IFTTT ఇంటగ్రేషన్ ద్వారా వ్యక్తిగత స్లీప్ అనాలిసిస్‌తో పాటు పూర్తిస్థాయి స్మార్ట్‌హోమ్ కంట్రోలింగ్‌ను ప్రొవైడ్ చేస్తుంది. వై-ఫై కనెక్టువిటీతో స్పందించగలిగే ఈ సెన్సార్‌ను పరుపులో ఫిట్ చేయటం ద్వారా దాని పై నిద్రించే వారి స్లీప్ క్వాలిటీకి సంబంధించి పూర్తి ఇన్‌సైట్స్‌ను తెలుసుకునే వీలుంటుంది.

ఇదే ఈవెంట్‌లో భాగంగా హెల్త్ మేట్ పేరుతో సరికొత్త యాప్‌ను నోకియా అనౌన్స్ చేసింది. అమెజాన్ క్లౌడ్ ఆధారిత వాయిస్ సర్వీస్, Alexaతో కలిసి పనిచేయగలిగే ఈ యాప్ ద్వారా యూజర్లు తమ రొటీన్ యాక్టివిటీస్‌‌‌కు సంబంధించి రెగ్యులర్ డేటా అలానే ఇన్‌సైట్స్‌ను పొందే వీలుంటుంది. తన పాపులర్ స్టీల్ హెచ్ఆర్ యాక్టివిటీ ట్రాకింగ్ వాచ్‌కు సంబంధించి రోజ్ గోల్డ్ వేరియంట్‌ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు నోకియా తెలిపింది.

నోకియా స్లీప్ సెన్సార్ ప్రత్యేకతలు :

నోకియా స్లీప్ సెన్సార్, యూజర్లు నిద్రించే సమయంతో పాటు మధ్యలో చోటుచేసుకునే ఇంటరప్షన్స్, లైట్, డీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్స్ ఇంకా వారి స్నూరింగ్ శాతాన్ని ట్రాక్ చేసి వ్యక్తిగత స్లీప్ స్కోర్లను ప్రొవైడ్ చేయగలుగుతుంది.

మంచి నిద్రకు అవసరమైన ముఖ్యమైన సలహాలు, సూచనలను ఈ సెన్సార్ ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తుంటుంది. యూజర్ నిద్రించిన వెంటనే లైట్లను ఈ సెన్సార్ డిమ్ చేసేస్తుంది. నోకియా స్లీప్ సెన్సార్ ఎప్పటికప్పుడు హెల్త్ మేట్ అప్లికేషన్‌తో సింక్రనైజ్ అవుతూ యూజర్ హెల్త్ డేటాను అర్థవంతమైన రీతిలో అందించగలుగుతుంది.

ట్రెండ్ సెట్ చేసిన షియోమి, రెడ్‌మి 5A న్యూ రికార్డ్ సేల్స్ !

రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, బ్యాలెన్సుడ్ డైట్ మాదిరిగానే మనిషికి ఆరోగ్యకరమైన నిద్ర అనేది ఎంతో అవసరం. ఈ క్రమంలో ప్రపంచం మొత్తాన్ని ఆరోగ్యకర లైఫ్‌స్టైల్ వైపు నడపించాలనే విజన్‌తో నోకియా స్లీప్ సెన్సార్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నోకియా డిజిటల్ హెల్త్ బిజినెస్ హెడ్ రాబ్ లీ బ్రాస్ బ్రౌన్ తెలిపారు. రాత్రి నిద్రను మ్యాగ్జిమైజ్ చేయటంలో నోకియా స్లీప్ కీలక పాత్ర పోషించబోతోందని ఆయన తెలిపారు.

హెల్త్ మేట్ యాప్ క్రింద స్లీప్ స్మార్టర్ పేరుతో ఓ ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ను నోకియా అభివృద్ధి చేసింది. లీడింగ్ స్లీప్ ఎక్స్‌పర్ట్స్‌తో డిజైన్ చేయబడిన ఈ ప్రోగ్రామ్ ఆరోగ్యకరమైన నిద్రకు సంబంధించి 8 వారాల గైడ్‌ను ప్రొవైడ్ చేస్తుంది. మార్కెట్లో నోకియా స్లీప్ అమ్మకాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయి. ధర 99 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.6,299), నోకియా అఫిషియల్ స్టోర్‌తో పాటు అమెజాన్‌లో ఈ ప్రొడక్ట్ అందుబాటులో ఉంటుంది.

English summary
Nokia has now introduced Nokia Sleep, an advanced sensor that seamlessly delivers personalized sleep analysis and offers smart home control through IFTTT integration.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot