ప్రపంచంలోనే అతి చిన్న స్టోరేజ్ డ్రైవ్, పపర్ బ్యాంక్‌లా కూడా వాడుకోచ్చు.

By: BOMMU SIVANJANEYULU

లాస్‌వేగాస్ వేదికగా జరుగుతోన్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2018లో భాగంగా ప్రముఖ కంప్యూటర్ డేటా స్టోరేజ్ కంపెనీ వెస్ట్రన్ డిజిటల్ (డబ్ల్యూడీ) ప్రపంచపు అతిచిన్న ఫ్లాష్‌ డ్రైవ్‌ను అనౌన్స్ చేసింది. దీంతో పాటు మరికొన్ని స్టోరేజ్ డివైస్ లను కూడా ఈ బ్రాండ్ ఆవిష్కరించింది. వీటిలో వైర్‌లెస్ ఎస్ఎస్‌డి (సాలిడ్ - స్టేట్ డివైస్‌లతో పాటు హై కెపాసిటీ యూఎస్బీ డ్రైవ్స్ ఇంకా కాంపాక్ట్ రగ్గుడ్ ఎస్ఎస్‌డి (సాలిడ్-స్టేట్ డ్రైవ్)లు ఉన్నాయి.

ప్రపంచంలోనే అతి చిన్న స్టోరేజ్ డ్రైవ్, పపర్ బ్యాంక్‌లా కూడా వాడుకోచ్చు

వీటిలో కంపెనీ లాంచ్ చేసిన అల్ట్రా ఫిట్ ఫ్లాష్‌డ్రైప్ ప్రపంచపు అతిచిన్న స్టోరేజ్ డివైస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 256జీబి స్టోరేజ్ సామర్థ్యంతో లాంచ్ అయిన ఈ స్టోరేజ్ డ్రైవ్ సెకను 130MB స్పీడును అందుకోగలదట. యూఎస్బీ 2.0తో పాటు యూఎస్బీ 3.0 పోర్టులను కూడా ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కో స్టోరేజ్ యూనిట్ ధర రూ.9,600. ఇదే ఈవెంట్‌లో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న 1TB టైప్-సీ మోడల్ అల్ట్రా ఫిట్ స్టోరేజ్ డివైస్‌లను వెస్ట్రన్ డిజిటల్ ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే ఇవి ఎప్పుటి నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయన్నది తెలియాల్సి ఉంది.

SanDisk నుంచి రెండు కొత్త డ్రైవ్‌లు..

సీఈఎస్ 2018లో భాగంగా వెస్ట్రన్ డిజిటల్ నేతృత్వంలోని SanDisk, రెండు సరికొత్త ఎస్ఎస్‌డి (సాలిడ్-స్టేట్ డ్రైవ్)లను ప్రదర్శించింది. మై పాస్‌పోర్ట్ వైర్‌లెస్ ఎస్ఎస్‌డి, శాన్‌డిస్క్ ఎక్స్‌ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్‌డి

మోడల్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. మై పాస్‌పోర్ట్ వైర్‌లెస్ ఎస్ఎస్‌డిలోని వన్-టచ్ కార్డ్ కాపీ ఫీచర్ ద్వారా కంటెంట్ ఎడిటింగ్‌తో పాటు షేరింగ్ సూపర్ ఫాస్టుగా జరిగిపోతుంది. ఫిల్‌మైక్ ప్రో, లుమాఫ్యూజన్ వంటి థర్డ్ పార్టీ మొబైల్స్ అప్లికేషన్‌లను ఈ డ్రైవ్ నేరుగా యాక్సెస్ చేసుకోగలుగుతుంది.

శాన్‌డిస్క్ ఎక్స్‌ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్‌డి ద్వారా హైరిసల్యూషన్ ఫోటోలతో పాటు వీడియోలను ఆన్-ద-గోలో సేవ్ చేసుకుని ఎడిట్ చేసుకునే వీలుంటుందని శాన్‌డిస్క్ తెలిపింది. మై పాస్‌పోర్ట్ వైర్‌లెస్ ఎస్ఎస్‌డి స్టోరేజ్ డివైస్ సెకనుకు 65ఎంబి డేటాను రీడ్ చేయగలగుతుందట. ఈ ఎస్ఎస్‌డిలో ఎంబెడ్ చేసిన యూఎస్బీ 3.0 కనెక్టువిటీ పోర్ట్ ద్వారా డివస్‌ను పవర్ బ్యాంక్ అలానే 6,700ఎమ్ఏహెచ్ బ్యాటరీలా ఉపయోగించుకోవచ్చని వెస్ట్రన్ డిజిటల్ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ వీక్ పేరిట భారీ డిస్కౌంట్లు, ఈ ఫోన్ల పైనే..

పూర్తిగా ఛార్జ్ చేయబడిన ఈ బ్యాటరీ 10 గంటల కంటిన్యూస్ బ్యాటరీ లైఫ్‌ను అందించగలుగుతుందట. వై-ఫై కనెక్టువిటీ పై స్పందించగలిగే మై పాస్‌పోర్ట్ వైర్‌లెస్ ఎస్ఎస్‌డికి సంబంధించి 250జీబి మోడల్ ధర రూ.15,000గాను, 2TB మోడల్ ధర రూ.51,000గాను ఉంటుందట.

వెస్ట్రన్ డిజిటల్ అనౌన్స్ చేసిన మరో స్టోరేజ్ డివైస్, యూఎస్బీ టైప్ సీ శాన్‌డిస్క్ ఎక్స్‌ట్రీమ్ పోర్టబుల్
ఎస్ఎస్‌డి. ఐపీ55 సర్టిఫికేషన్‌తో ఈ స్టోరేజ్ డ్రైవ్ లభ్యమవుతుంది. ఈ డ్రైవ్ 250జీబి నుంచి 2TB వరకు వివిధ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. సెకనుకు 550ఎంబి డేటాను ఈ డివైస్ రీడ్ చేయగలుగుతుంది. 250జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,300గాను 2TB స్టోరేజ్ వేరియంట్ దర రూ.45,000గాను ఉంటుంది.

English summary
Western Digial(WD) unveils worlds smallest Flash Drive with 256 GB storage memory. WD also announced USB Type C Extreme portable SSD along with Mypassport wireless SSD
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot