CES 2020: మిడి-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం 5G-ఎనేబుల్డ్ SoC చిప్‌లను ప్రకటించిన మీడియాటెక్

|

తైవానీస్ ఫ్యాబ్లెస్ సెమీకండక్టర్ కంపెనీ మీడియాటెక్ ప్రీమియం మరియు మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్‌ల కోసం డైమెన్సిటీ 800 సిరీస్ చిప్‌లను విడుదల చేసింది. డైమెన్సిటీ 800 5G చిప్‌సెట్ ఫ్యామిలీ ఇంటిగ్రేటెడ్ 5G మోడెమ్‌లతో శక్తివంతమైన సిస్టమ్-ఆన్-చిప్స్ (SoCs) ను అందిస్తుంది.

 

మీడియాటెక్

ఈ చిప్‌లను మీడియాటెక్ సంస్థ CES 2020 లో ప్రకటించింది. డైమెన్సిటీ 800 సిరీస్ SoC చిప్‌లను కలిగి ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్‌లు ఈ సంవత్సరం మొదటి భాగంలో ప్రారంభమవుతాయని అందరు భావిస్తున్నారు.

 

సెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టివిసెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టివి

ఫ్లాగ్‌షిప్ 5G

మీడియాటెక్ సంస్థ ఇప్పటికే తన ఫ్లాగ్‌షిప్ 5G స్మార్ట్‌ఫోన్ సొల్యూషన్, డైమెన్సిటీ 1000 ను విడుదల చేసింది. అలాగే ఇప్పుడు డైమెన్సిటీ 800 సిరీస్ 5G చిప్‌సెట్ ఫ్యామిలీతో 5Gని మిడ్-టైర్ మార్కెట్‌కు తీసుకువస్తున్నాము అని మీడియా టెక్ యొక్క వైర్‌లెస్ బిజినెస్ యూనిట్ హెడ్ టిఎల్ లీ ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్‌ ఫ్రీగా అందిస్తున్న ఆఫర్స్ ఏమిటో తెలుసా?టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్‌ ఫ్రీగా అందిస్తున్న ఆఫర్స్ ఏమిటో తెలుసా?

డైమెన్సిటీ 800 సిరీస్ 5G చిప్‌లు
 

డైమెన్సిటీ 800 సిరీస్ 5G చిప్‌లు

డైమెన్సిటీ 800 సిరీస్ 5G చిప్‌లు కొత్త ప్రీమియం విభాగానికి శక్తినిస్థాయి. వినియోగదారులకు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మరియు మెరుగైన పనితీరు గల ఫోన్లను మిడ్‌రేంజ్ ధరల వద్ద తీసుకువస్తుంది అని లీ తెలిపారు. సింగిల్ చిప్ సొల్యూషన్స్ కనెక్టివిటీ, మల్టీమీడియా, AI మరియు ఇమేజింగ్ ఆవిష్కరణల యొక్క అపూర్వమైన కలయికను అల్ట్రా-ఎఫెక్టివ్ 7nm చిప్‌లో ప్యాక్ చేయబడి ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు.

 

 

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌లతో నోకియా 7 ప్లస్ , మోటరోలా వన్ విజన్ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌లతో నోకియా 7 ప్లస్ , మోటరోలా వన్ విజన్

డైమెన్సిటీ 800 సిరీస్

సంస్థ ప్రకారం డైమెన్సిటీ 800 సిరీస్ మీడియాటెక్ యొక్క 5G మోడెమ్‌ను ఒక కాంపాక్ట్ డిజైన్‌లో అనుసంధానించబడి వస్తుంది. ఇంతకు మునుపు గల రెండు-చిప్ ప్రత్యామ్నాయాలతో పోలిస్తే ఈ ప్లాట్‌ఫాంలో గణనీయమైన విద్యుత్ పొదుపులను అందిస్తుంది. రెండు క్యారియర్ అగ్రిగేషన్ (2CC CA) మరియు డైనమిక్ స్పెక్ట్రమ్ షేరింగ్ (DSS) కాకుండా స్వతంత్ర మరియు నాన్-స్టాండలోన్ సబ్ -6 GHz నెట్‌వర్క్‌లకు మద్దతు ఇవ్వడానికి ఇది రూపొందించబడింది.

 

 

RS.200 లోపు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న జియో,ఎయిర్‌టెల్, వొడాఫోన్RS.200 లోపు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న జియో,ఎయిర్‌టెల్, వొడాఫోన్

5G చిప్‌సెట్ ఫీచర్స్

5G చిప్‌సెట్ ఫీచర్స్

మీడియాటెక్ డైమెన్సిటీ 800 సిరీస్ అనేది ఆక్టా-కోర్ SoC. ఇందులో 2GHz వరకు క్లాక్ చేయబడిన నాలుగు ARM కార్టెక్స్- A76 కోర్లు ఉన్నాయి. అంతేకాకుండా నాలుగు ARM కార్టెక్స్- A55 కోర్లు ఒకే ఫ్రీక్వెన్సీ వరకు క్లాక్ చేయబడ్డాయి. ఇది సంస్థ యొక్క హైపర్‌ఇంజైన్ గేమింగ్ టెక్‌తో కలిపి నాలుగు డైమెన్సిటీ 1000-క్లాస్ GPU IP కోర్లను కలిగి ఉంది. బోర్డులోని APU 3.0 యూనిట్ AI- నిర్దిష్ట పనులను ప్రాసెస్ చేయడానికి ఉద్దేశించబడింది.

 

లెనోవా మొట్టమొదటి ఫోల్డబుల్ PC!!! ధర కొంచెం భారీగానే.....లెనోవా మొట్టమొదటి ఫోల్డబుల్ PC!!! ధర కొంచెం భారీగానే.....

సెన్సార్

అయితే ఇందులోని SoC 64-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్లకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా 32-మెగాపిక్సెల్ + 16-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాల వంటి పెద్ద మల్టీ-కెమెరా ఎంపికలకు కూడా మద్దతు ఇస్తుంది. మీడియాటెక్ మల్టీ-ఫ్రేమ్ 4K వీడియో హెచ్‌డిఆర్ సామర్థ్యాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఇది 90HZ వరకు ఫుల్-హెచ్‌డి రిజల్యూషన్ డిస్ప్లేలకు మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
CES 2020: MediaTek Launched 5G-Enabled SoCs Chipsets For Mid-Range Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X