Lenovo లెజియన్ సిరీస్ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ ఫీచర్లపై ఓ లుక్ వేయండి...

|

2021లో గ్రాండ్ గా మొదలైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో ప్రముఖ బ్యాండ్లు తమ కొత్త కొత్త ప్రొడెక్టులను విడుదల చేసారు. ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ లెనోవా ఈ ఈవెంట్ లో లెజియన్ ల్యాప్‌టాప్ సిరీస్‌ను 2021 విడుదల చేసింది. లెనోవా కంపెనీ యొక్క విస్తరణలో భాగంగా కొత్తగా లెనోవా లెజియన్ 7, లెనోవా లెజియన్ స్లిమ్ 7, లెనోవా లెజియన్ 5 ప్రో మరియు లెనోవా లెజియన్ 5 ల్యాప్‌టాప్‌లను ప్రకటించింది. ఈ కొత్త మోడళ్లు ఫిబ్రవరి 2021 నుండి అందుబాటులోకి రానున్నాయి. ఒక నెల ఉచిత మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్‌తో ప్రతి లెనోవా లెజియన్ గేమింగ్ ల్యాప్‌టాప్ PC వస్తుంది.

లెనోవా లెజియన్ 7 ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్

లెనోవా లెజియన్ 7 ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్

లెనోవా లెజియన్ 7 ల్యాప్‌టాప్ AMD రైజెన్ 9 5900H మొబైల్ ప్రాసెసర్‌లతో రన్ అవుతూ ఎన్విడియా జిఫోర్స్ ఆర్టిఎక్స్ 3080 GPU లను కలిగి ఉంది. ఇది 16 అంగుళాల స్క్రీన్‌ డిస్ప్లే 2500x1600 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 16:10 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో మరియు డాల్బీ విజన్ మద్దతును కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో లెజియన్ ట్రూస్ట్రైక్ కీబోర్డ్ అమర్చబడి ఉంటుంది. అదనంగా వేడిని వెదజల్లడానికి కోల్డ్‌ఫ్రంట్ 3.0 థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో లభించే ఇతర ఫీచర్లలో వై-ఫై 6 కిల్లర్ AX1650 టెక్నాలజీ మరియు ఇ-షట్టర్‌తో 720p ఇంటిగ్రేటెడ్ వెబ్‌క్యామ్ వంటివి ఉన్నాయి.

లెనోవా లెజియన్ స్లిమ్ 7 స్పెసిఫికేషన్స్
 

లెనోవా లెజియన్ స్లిమ్ 7 స్పెసిఫికేషన్స్

లెనోవా లెజియన్ స్లిమ్ 7 ల్యాప్‌టాప్ డాల్బీ విజన్‌ టెక్నాలజీతో 15.6-అంగుళాల IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది AMD రైజెన్ 9 5900H మొబైల్ ప్రాసెసర్లు మరియు మాక్స్-క్యూ డిజైన్ GPUలతో ఎన్విడియా జిఫోర్స్ RTX3060 వరకు పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో డైనమిక్ సిపియు మరియు జిపియు విద్యుత్ పంపిణీ కోసం లెనోవా AI ఇంజన్ అమర్చారు. ఇది నహిమిక్ ఆడియో సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉండి పవర్ బటన్‌లో విలీనం చేసిన ఫింగర్ ప్రింట్ రీడర్‌ను అందిస్తుంది.

లెనోవా లెజియన్ 5 ప్రో స్పెసిఫికేషన్స్

లెనోవా లెజియన్ 5 ప్రో స్పెసిఫికేషన్స్

లెనోవా లెజియన్ 5 ప్రో ల్యాప్‌టాప్ యొక్క స్పెసిఫికేషన్ లలో AMD రైజెన్ 9 5800H మొబైల్ ప్రాసెసర్లు మరియు ఎన్విడియా జిఫోర్స్ RTX3070 జిపియుల ద్వారా ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ యొక్క 16 అంగుళాల క్యూహెచ్‌డి డిస్‌ప్లే 16:10 కారక నిష్పత్తి మరియు 2560x1600 పిక్సెల్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఇందులో లెనోవా వాంటేజ్ సాఫ్ట్‌వేర్ మరియు ఇన్స్టెంట్ విద్యుత్ నిర్వహణ కోసం Fn + Qను కలిగి ఉంటుంది. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ వై-ఫై 6 ను అందిస్తుంది.

లెనోవా లెజియన్ 5 స్పెసిఫికేషన్స్

లెనోవా లెజియన్ 5 స్పెసిఫికేషన్స్

లెనోవా లెజియన్ 5 ల్యాప్‌టాప్ రెండు స్క్రీన్ మోడళ్లతో వస్తుంది. వీటిలో 15.6-అంగుళాలు మరియు 17-అంగుళాల IPS డిస్ప్లేలు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ AMD రైజెన్ 9 5800H మొబైల్ ప్రాసెసర్లు మరియు ఎన్విడియా జిఫోర్స్ RTX 3070 GPU లతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఫాంటమ్ బ్లూ మరియు స్టింగ్రే వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
CES 2021: Lenovo Brand Announced New Legion series laptops

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X