CES 2021: D-Link Wi-Fi 6 USB 3.0 అడాప్టర్ ఎటువంటి ఫీచర్స్ కలిగి ఉందొ ఓ లుక్ వేయండి

|

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2021 లో కొత్త రకం ఉత్పత్తులు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా డి-లింక్ కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి వై-ఫై 6 USB 3.0 అడాప్టర్ ను CES 2021 లో విడుదల చేసారు. ఇది 2.4GHz బ్యాండ్‌లో 574Mbps మరియు 5GHz బ్యాండ్‌లో 1,200Mbps వేగంతో డేటాను అందిస్తుంది. మెరుగైన పనితీరును పొందడానికి వినియోగదారులు తమ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లోని యుఎస్‌బి పోర్టులో అడాప్టర్‌ను ప్లగ్ చేయవలసి ఉంటుంది.

 

వై-ఫై 6 USB 3.0 అడాప్టర్

డి-లింక్ కంపెనీ యొక్క వై-ఫై 6 USB 3.0 అడాప్టర్ ఆర్తోగోనల్ ఫ్రీక్వెన్సీ-డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ (OFDMA)ను కలిగి ఉంటుంది కావున అనేక ఇన్పుట్ మరియు అనేక అవుట్పుట్ (MU-MIMO) టెక్నాలిజీలను కలిగి ఉంటుంది. ఇది వేగవంతమైన మరియు సమర్థవంతమైన Wi-Fi కనెక్షన్‌ను అందించగలదు. D- లింక్ AI M32 వై-ఫై 6 AI మెష్ రౌటర్లు మరియు DIR-LX1870 లను కూడా ప్రకటించింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

D-Link AX1800 Wi-Fi 6 USB 3.0 అడాప్టర్

D-Link AX1800 Wi-Fi 6 USB 3.0 అడాప్టర్

AX1800 Wi-Fi 6 USB 3.0 అడాప్టర్ (DWA-X1850) ను CES 2021 వద్ద D- లింక్ ద్వారా "మార్కెట్లో మొట్టమొదటి వై-ఫై 6 USB 3.0 అడాప్టర్" గా పరిచయం చేసింది. వై-ఫై 6 అడాప్టర్ వినియోగదారులకు తమ డెస్క్‌టాప్‌లు మరియు నోట్‌బుక్ కంప్యూటర్‌లను సరికొత్త 802.11ax టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేయడానికి మరియు సరసమైన ధర వద్ద ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేయడానికి వేగవంతమైన మరియు సులభమైన మార్గాన్ని అందిస్తుంది.

Wi-Fi 6 రౌటర్‌
 

2021 రెండవ త్రైమాసికంలో ఈ అడాప్టర్ $ 100 (సుమారు రూ.7,300) ధర వద్ద లభిస్తుంది. అధిక వేగంతో డేటా ప్రయోజనాలను పొందడానికి మీరు Wi-Fi 6 రౌటర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు అని కోన్ని నివేదికలు పేర్కొన్నాయి. Wi-Fi 6ను పరిగణనలోకి తీసుకుంటే ఇది రెండేళ్ల క్రితం మాత్రమే ప్రారంభమైంది. DWA-X1850 సరైన నెట్‌వర్క్ మరియు డివైస్ ప్రొటెక్షన్ కోసం WPA3 Wi-Fi ప్రైవసీను కలిగి ఉంది. స్ట్రీమింగ్ వీడియోలు లేదా ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం ఈ అడాప్టర్‌ను ఉపయోగించవచ్చు. ఇది విండోస్ 7 నుండి విండోస్ 10 వరకు ఆటో-ఇన్‌స్టాలేషన్ డ్రైవర్‌తో వస్తుంది.

డి-లింక్ AX3200 వై-ఫై 6 AI మెష్ రూటర్

డి-లింక్ AX3200 వై-ఫై 6 AI మెష్ రూటర్

డి-లింక్ యొక్క AX3200 వై-ఫై 6 AI మెష్ రూటర్ తో పాటుగా D- లింక్ AI M32 ను కూడా ప్రవేశపెట్టింది. ఇది AX3200 వేగంతో Wi-Fi 6 మరియు మెష్ టెక్నాలజీ రెండిటిని కూడా మిళితం చేస్తుంది. ఇది వాయిస్ కంట్రోల్ ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇది 2021 మూడవ త్రైమాసికంలో $ 250 (సుమారు రూ.18,300) ధర వద్ద అందుబాటులోకి రానున్నది.

Wi-Fi 6 అడాప్టర్ టెక్నాలజీ

Wi-Fi 6 అడాప్టర్ టెక్నాలజీ

వై-ఫై 6 టెక్నాలజీ విషయానికి వస్తే డి-లింక్ తెలిపిన వివరాల ప్రకారం ఇది అతి వేగవంతమైన డేటా స్పీడ్ ను, ఎక్కువ సామర్థ్యం మరియు తక్కువ నెట్‌వర్క్ రద్దీని అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ మెష్ సిస్టమ్ 3.2Gbps వరకు వేగాన్ని ఇస్తుంది. ఇది క్విక్ VPN, IPv6 6 వ, DS- లైట్, ట్రిపుల్-ప్లే VLAN మరియు QoS, OFDMA మరియు MU-MIMO టెక్నాలజీలను కలిగి ఉంది. D- లింక్ AI M32 మెష్ ఇతర అనుకూలమైన D- లింక్ Wi-Fi మెష్ పరికరాలను జోడించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మెష్ స్మార్ట్ రోమింగ్ టెక్నాలజీ మిమ్మల్ని స్వయంచాలకంగా బలమైన సిగ్నల్‌తో కలుపుతుంది అని కంపెనీ పేర్కొంది.

Best Mobiles in India

English summary
CES 2021: World’s First Wi-Fi 6 USB 3.0 Adapter and Wi-Fi 6 AI Mesh Routers D-Link Launched

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X