Nokia బ్రాండ్ నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు CES 2022 ఈవెంట్ లో ప్రకటించారు!!
ప్రముఖ HMD గ్లోబల్ సంస్థ నోకియా ఇటీవలి కాలంలో బడ్జెట్ మరియు మిడ్- రెంజ్ విభాగంలో కొత్త రకమైన నోకియా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఇప్పుడు CES 2022లో నోకియా కంపెనీ నాలుగు కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించింది. అయితే వీటన్నింటి ధరలు $250 లోపు ఉన్నాయి. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.18,625. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు నాలుగు కూడా గూగుల్ యొక్క ఆండ్రాయిడ్12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి. CES 2022 ఈవెంట్ లో ప్రదర్శించబడిన స్మార్ట్‌ఫోన్‌లలో నోకియా C100, నోకియా C200, నోకియా G100 మరియు నోకియా G400 వంటివి ఉన్నాయి.

Nokia C100, Nokia C200, Nokia G100, Nokia G400 స్మార్ట్‌ఫోన్‌ల ధరలు
నోకియా C100 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర $99 (సుమారు రూ. 7,371). ఇది USలో Tracfone ద్వారా అందుబాటులో ఉంచబడుతుంది. అలాగే Nokia C200 ధర $119 (సుమారు రూ. 8,860) కాగా నోకియా G100 యొక్క ధర $149 (సుమారు రూ.11,097). ఇది US లో Tracfone మరియు Boost రెండింటి నుండి అందుబాటులోకి వస్తుంది. చివరిగా నోకియా G400 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర $239 (సుమారు రూ.17,800), ఇది Tracfone, Boost మరియు కన్స్యూమర్ సెల్యులార్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల గ్లోబల్ మరియు ఇండియా యొక్క లభ్యత వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

నోకియా C-సిరీస్ స్పెసిఫికేషన్స్
నోకియా C100 మరియు C200 స్మార్ట్‌ఫోన్‌లు రెండింటి యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇవి మీడియాటెక్ హీలియో A22 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఇందులో C200 వేరియంట్ 6.1-అంగుళాల పెద్ద డిస్ప్లేతో వస్తుంది. ఈ రెండు డివైజ్‌లు 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి ఉండి 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తాయి.

నోకియా G-సిరీస్ స్పెసిఫికేషన్స్
నోకియా G-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలోని నోకియా G100 ఫోన్ 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉండడమే కాకుండా Qualcomm Snapdragon 615 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది వెనుకవైపున ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. పవర్ బటన్‌లో కెపాసిటివ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ చేయబడింది మరియు 5,000mAh బ్యాటరీతో బ్యాకప్ చేయబడింది.

నోకియా G400 స్మార్ట్‌ఫోన్ అనేది ప్రస్తుతం కంపెనీ యొక్క అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లలో ఒకటి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 480 5G SoC తో పాటుగా 6GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఇది సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు తృతీయ మాక్రో లెన్స్‌తో పాటు 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








