వావ్, మైండ్ రీడ్ చేసే వేరబుల్ 'ఓమి' వచ్చేస్తోంది.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..
AI ప్రపంచం సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. CES 2025 వేదికగా జనవరి 7 నుంచి ఎన్నో విప్లవాత్మకమైన గ్యాడ్జెట్లు రిలీజ్ అవుతున్నాయి. వాటన్నిటిలో మనల్ని ప్రత్యేకంగా ఆకర్షించేది మాత్రం ఓమి (Omi).
ఇది ఒక వేరబుల్ AI డివైజ్. మన రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేయడానికి దీన్ని రూపొందించారు. దీని ఫ్యూచర్ వెర్షన్ అయితే ఏకంగా మన ఆలోచనలే చదివేస్తుంది. ఈ బ్రెయిన్ రీడింగ్ ఫీచర్ ఉన్న వెర్షన్ ఫ్యూచర్‌లో విడుదల కానుంది. కచ్చితమైన రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ ఇది మాత్రం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

ఓమి చూడటానికి గుండ్రంగా, చిన్నగా ఉండే ఒక బంతిలా ఉంటుంది. ఇది దాన్ని ధరించిన వారి మాటలను వింటుంది. అంతేకాదు, యూజర్ జరిపే సంభాషణలను సమ్మరీ రూపంలో చెప్పడం లేదా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అందించడంలో హెల్ప్ చేస్తుంది.
* రిలీజ్ డేట్
చాలా తేలికగా, ఎక్కడికైనా తీసుకెళ్లడానికి వీలుగా ఉండే ఈ డివైజ్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు పనిచేస్తుంది. ప్రస్తుతానికైతే ఇది ఆడియో-బేస్డ్ డివైజ్‌గా 2025 రెండవ త్రైమాసికంలో (Q2 2025) రిలీజ్‌కి సిద్ధం అయ్యింది. అంటే మాట్లాడే మాటలను మాత్రమే విశ్లేషిస్తుంది.
* బ్రెయిన్ రీడింగ్ ఫీచర్
భవిష్యత్తులో విడుదల కానున్న దీని తర్వాతి వెర్షన్‌లో బ్రెయిన్-ఇంటర్‌ఫేస్ మాడ్యూల్ రానుంది. ఈ మాడ్యూల్ సహాయంతో ఓమి యూజర్ మెదడు సంకేతాలను సింగిల్ ఎలక్ట్రోడ్ ద్వారా చదవగలుగుతుంది.
దీన్ని నుదుటిపై పెట్టుకుంటే, బటన్లు నొక్కకుండా లేదా "వేక్ వర్డ్" పలకకుండానే యూజర్ ఆలోచనలను గుర్తించగలదు. ఉదాహరణకు, యూజర్ తనకు కావాల్సిన ఒక వస్తువు గురించి ఆలోచిస్తుంటే, ఓమి వెంటనే ఆ వస్తువు గురించిన పూర్తి సమాచారాన్ని వారికి నోటిఫికేషన్ ద్వారా పంపుతుంది, ఇది నిజంగా అబ్బురపరిచే విషయం కదూ..
* మరిన్ని ప్రత్యేకతలు
ఇంకా చెప్పాలంటే, ఈ పరికరం కన్వర్జేషన్లను చాలా ఈజీగా ట్రాన్సలేట్ చేస్తుంది. అంతేకాకుండా, యూజర్ ఎలా సమాధానం చెప్పాలో సూచనలు కూడా ఇస్తుంది. ఉదాహరణకి ఎవరైనా చైనా వ్యక్తి మనతో చైనీస్ భాషలో మాట్లాడుతుంటే వారు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలిపి మళ్లీ చైనా భాషలో ఎలా రిప్లై ఇవ్వాలో కూడా చెబుతుంది. దీనివల్ల ఇతరులతో కమ్యూనికేషన్ మరింత సులభమవుతుంది.
అంతేకాదు దీని ధరించి మీరు ఒక హెడ్‌ఫోన్స్ గురించి మాట్లాడుతున్నారనుకోండి. వెంటనే ఓమి ఆ హెడ్‌ఫోన్స్ గురించిన రివ్యూలను సేకరించి, అది కొనడానికి మంచిదా కాదా అనే సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఎంత ఉపయోగకరంగా ఉందో కదా.
* రెండేళ్ల తర్వాత బ్రెయిన్ రీడ్ చేస్తుంది
ఓమి క్రియేటర్ నిక్ షెవ్చెంకో ఈ పరికరం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. న్యూరాలింక్ చిప్ ఇంప్లాంట్‌ల వలె కాకుండా, ఓమి తలపై చర్మంపై అమర్చే ఎక్స్‌టర్నల్ ఎలక్ట్రోడ్లపై ఆధారపడుతుంది. ఈ విధానం తక్కువ ప్రమాదకరమైనది.
ఇంకా దీనిలో ఎలక్ట్రోడ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా మరింత కచ్చితత్వాన్ని సాధించడంపై దృష్టి సారించారు. ఈ ఫీచర్ రావడానికి మరో రెండేళ్లు పట్టవచ్చని నిక్ భావిస్తున్నారు. ఓమి చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. లోపల GPT-4o అనే అడ్వాన్స్‌డ్ AI మోడల్‌ను ఉపయోగించి సంభాషణలను విశ్లేషిస్తుంది, సందర్భాన్ని గుర్తుంచుకుంటుంది.
* ప్రైవసీకి పెద్దపీట
అంతేకాదు, యూజర్ ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నిక్ ఓమిని ఓపెన్-సోర్స్ చేశారు. దీనివల్ల వినియోగదారులు తమ డేటాను ఎక్స్‌టర్నల్ సర్వర్లలో కాకుండా లోకల్‌గానే స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిజంగా గొప్ప విషయం.
ఈ పరికరం ధర కేవలం 89 డాలర్లు మాత్రమే. ఇది 2025 రెండవ త్రైమాసికంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








