బిజినెస్ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళగా కొచ్చర్

Posted By: Super

బిజినెస్ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళగా కొచ్చర్

న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపార రంగానికి సంబంధించి శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ టాప్‌లో నిలిచారు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ టాప్-50 లిస్ట్‌లో చందా కొచర్ తొలి స్థానాన్ని సంపాదించుకున్నట్లు మేగజైన్‌ వెల్లడించింది. ఆ తర్వాత సన్‌ టివి నెట్‌వర్క్‌ సంయుక్త ఎండి కావేరీ కళానిధి అత్యధిక వేతనం తీసుకుంటున్న మహిళగా పేర్కొంది. ఆమెకు (వార్షికంగా 1.30 కోట్ల డాలర్లు) వేతనంగా లభిస్తోందని వెల్లడించింది.

ఫోర్చ్యూన్‌ ప్రకటించిన 50 మోస్ట్‌ పవర్‌ఫుల్‌ వ్యాపార మహిళల జాబితాలో కొచ్చర్‌ తరువాత యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండి షికా శర్మ, టఫే చైర్‌పర్సన్‌ మల్లికా శ్రీనివాసన్‌, కాప్‌జెమినీ ఇండియా సిఇఒ అరుయన్‌ జయంతి, ఎజడ్‌బి పార్ట్‌నర్స్‌ కో-ఫౌండర్‌ జియా మోడి, మ్రిటానియా ఎండి వినీతా బాలీ, హెచ్‌టి మీడియా ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ శోభనా భార్తియా, ఎన్‌ఎస్‌ఇ ఎండి చిత్రా రామకృష్ణ, బయోకాన్‌ చైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌, రిమ్‌ ఇండియా మాజీ ఎండి ఫ్రెన్నీ బావాలు టాప్‌ 10లో నిలిచారు.

గతంలో ఐసిఐసిఐ మాజీ అధికారిణుల్లో కల్పనా మోర్పారియా (జెపి మోర్గాన్‌ ఇండియా చీఫ్‌) 16వ స్థానంలో, రేణుకా రామనాథ్‌ (ఆల్టర్నేట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థాపకురాలు) 20వ స్థానంలో నిలిచారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot