మామకు దగ్గరగా చంద్రయాన్ 2,ఫస్ట్ ఫోటోపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

By Gizbot Bureau
|

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్.. ప్రయోగించినప్పటి నుంచీ ఇప్పటిదాకా భూ కక్ష్యలోనే పరిభ్రమిస్తోన్న విక్రమ్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇస్రో శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించడానికి అవసరమైన ద్రవరూపంలో ఉన్న ఇంధనాన్ని 1738 సెకన్ల వరకు మండించడం వల్ల దాని స్పేస్ క్రాఫ్ట్ వేగం పెంచారు.

CHANDRAYAAN 2 EDGES CLOSER TO MOONS SURFACE AFTER COMPLETING SECOND ORBITAL MANOEUVRE

భూకక్ష్యను దాటుకుని చంద్రుని కక్ష్యలోనికి ప్రవేశించడానికి అవసరమైన వేగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఈ స్పేస్ క్రాఫ్ట్ కు కల్పించారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో కిందటి నెల 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఇది పంపిన భూమి చిత్రాలు చూసి యావత్ భారతావని మురిసిపోయింది. తాజాగా ఇస్రో మరో అద్భుత చిత్రాన్ని భారతీయులతో పంచుకుంది. 'చంద్రయాన్-2’ పంపిన చంద్రుడి ఫోటో విడుదల చేసింది.

2,650 అడుగుల ఎత్తు నుంచి ఫొటో

2,650 అడుగుల ఎత్తు నుంచి ఫొటో

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జులై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 నింగిలోకి పంపింది. ఇప్పుడని భూకక్ష్యను విడిచి చంద్రుడి కక్ష్యలోకి చేరింది. గురువారం చంద్రుడికి 2,650 అడుగుల ఎత్తు నుంచి ఫొటో తీసి ఇస్రోకి పంపింది. ‘చంద్రయాన్-2'లో ఉన్న ల్యాండర్ (విక్రమ్) ఆగస్టు 21న ఈ ఫొటో తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఫొటోలో చంద్రుడిపై ఉన్న అపోలో క్రేటర్స్‌ బిలం, మేర్‌ ఓరియంటేల్‌ బిలాన్ని స్పష్టంగా చూడవచ్చు.

మూడు దశల్లో చంద్రయాన్-2

మూడు దశల్లో చంద్రయాన్-2

చంద్రయాన్-2 ప్రస్తుతం చంద్రుడి క్షక్ష్యలో దీర్ఘవృత్తాకారంలో 118 X 4412 కిమీలు పరిభ్రమిస్తోంది. అంటే చంద్రుడికి అత్యంత సమీపంగా 118 కిమీల దూరం వరకు చేరుతూ, తిరిగి 4412 కిమీల దూరానికి వెళ్లిపోతూ తిరుగుతోంది. చివరికి ఇది సెప్టెంబర్‌ 7 మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. కాగా మూడు దశల్లో ఈ చంద్రయాన్-2 కొనసాగుతోంది.

నాలుగు దశలను పూర్తి చేసుకున్న తరువాతే
 

నాలుగు దశలను పూర్తి చేసుకున్న తరువాతే

చంద్రుడి కక్షలోకి ప్రవేశించే చివరిదశ మాత్రమే మిగిలి ఉంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత కూడా నాలుగు దశలను పూర్తి చేసుకున్న తరువాతే చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై దిగగలుగుతుంది. క్రమంగా చంద్రుడి ధృవాల వైపు ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల దూరంలోకి చేరుకుంటుంది. అదే చివరి దశ. వచ్చేనెల 7వ తేదీ నాటికి చివరి దశ పరిభ్రమణానికి చేరుకుంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు.

 కొత్త విషయమేంటంటే...

కొత్త విషయమేంటంటే...

చంద్రయాన్ 2 పంపిన ఫొటోపై ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే... ఈ ఫొటోలో... చందమామపై అపోలో పగులు లోయలతో పాటూ... ఓ చోట చందమామపై 380కోట్ల సంవత్సరాల కిందట సముద్రం ఉండేదట. దాన్నే "మేర్ ఓరియంటేల్" అంటున్నారు.

Best Mobiles in India

English summary
CHANDRAYAAN 2 EDGES CLOSER TO MOON'S SURFACE AFTER COMPLETING SECOND ORBITAL MANOEUVRE

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X