Home
News

విక్రమ్ నీకు ఫైన్ వేయం, వైరల్‌గా మారిన పోలీస్ ట్వీట్

By Gizbot Bureau

Chandrayaan-2 ద్వారా పంపిన విక్రమ్ ల్యాండర్ జాడ కానరాక ఇప్పటికే మూడు రోజులైంది. చంద్రమామపై ఉన్న విక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆర్బిటర్‌కి ల్యాండర్ విక్రమ్ ఆచూకీ దొరికినా అక్కడి నుంచి మాత్రం ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదు. కాగా విక్రమ్ ధ్వంసం కాలేదని చందమామ చుట్లూ తిరుగుతోందని ఇస్రో ప్రకటించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విక్రమ్‌ నుంచి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. దాంతో విక్రమ్ తిరిగి కాంటాక్ట్‌లోకి రావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విక్రమ్‌పై నాగపూర్ సిటీ పోలీసులు చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల హృదయాలను గెలిచింది.

నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు చేసిన ట్వీట్‌

నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు చేసిన ట్వీట్‌

ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్‌ వాహన సవరణ చట్టం-2019 అనుసరించి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహనదారులకు అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్‌ ల్యాండర్‌కు, ట్రాఫిక్‌ చలాన్లకు జత చేసి నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు చేసిన ట్వీట్‌ పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 

ట్వీట్‌ వైరల్‌

ట్వీట్‌ వైరల్‌

‘ప్రియమైన విక్రమ్‌.. దయచేసి స్పందించు. నువ్వు సిగ్నల్‌ బ్రేక్‌ చేసినందుకు మేము చలాన్‌ విధించం' అంటూ నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు ట్వీట్‌ చేశారు. నాగ్‌పూర్‌ సిటీ పోలీసుల ట్వీట్‌కు విపరీతమైన పైగా లైకులు వచ్చాయి. కొద్దిసేపటికే ఈ ట్వీట్‌ వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు కూడా దీనిపై ఫన్నీగా కామెంట్‌లు చేస్తున్నారు.

నెటిజన్ల కామెంట్‌లు

నెటిజన్ల కామెంట్‌లు

ఒకవేళ విక్రమ్‌ స్పందిస్తే.. అది సిగ్నల్‌ బ్రేక్‌ చేసినందుకు ఆ చలాన్‌ నాకు పంపించండి. ఆ జరిమానాను నేను కడతాను. అని ఒకరు రిప్లయి ఇవ్వగా, ఈ కేసు బెంగళూరు పోలీసుల పరిధిలోకి వస్తుందని మరొకరు బదులిచ్చారు. ఇంకొకరు నాకు తెలుసు నాగ్‌పూర్‌ పోలీసులు చంద్రునిపై కూడా ఉన్నారని కూడా తెలిపారు. ఓవర్‌ స్పీడింగ్‌ పరిస్థితి? ఏంటని మరొకరు సరదాగా బదులిచ్చారు. 

#ISROSpotsVikram  ట్యాగ్‌

#ISROSpotsVikram ట్యాగ్‌

పోలీసులు చలానా వేయరంట.. స్పందించు విక్రమ్. కనీసం ఈమెసేజ్ చూసైనా విక్రమ్ మేల్కోవాలని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదుర్స్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయి ఇస్రో శాస్త్రవేత్తలు బాధలో ఉంటే.. మీరు జోకులు వేస్తారా అని విమర్శిస్తున్నారు. కాగా ట్విటర్‌లో #ISROSpotsVikram హ్యాష్‌ ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయింది.

Best Mobiles in India

English summary
Chandrayaan 2: Nagpur Police has a message for ISRO’s Vikram lander
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X