Home
News

చంద్రయాన్ 3 ల్యాండింగ్ కు మొత్తం సిద్ధం! లైవ్, టైమింగ్ వివరాలు

By Maheswara

భారతదేశం యొక్క తాజా చంద్రయాన్ మిషన్ చంద్రయాన్-3 ఆగస్టు 23న అంటే ఈరోజు చంద్రుని దక్షిణ ధృవం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయనుందని భావిస్తున్నారు. ఈ వ్యోమనౌకను జూలై 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. దాదాపు 40 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత, చంద్రయాన్-3 మిషన్ చివరకు బుధవారం చంద్రునిపై ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఈ ల్యాండింగ్ విజయవంతంగా పూర్తి అయితే, చంద్రునిపై దిగిన నాల్గవ దేశంగా భారత్‌ రికార్డు సృష్టిస్తుంది. అలాగే,చంద్రుని దక్షిణ ధృవం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదట దేశంగా గా కూడా అవతరిస్తుంది. ఈ మిషన్ ల్యాండింగ్‌కు ఒక రోజు ముందే, మిషన్ షెడ్యూల్ ప్రకారం అనుకున్నట్లుగానే ఉందని మరియు ప్రణాళిక ప్రకారం ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుందని ఇస్రో ధృవీకరించింది.

Chandrayaan 3 News : Lunar Landing Countdown Begins, How To Watch Live Stream And Timing Details.

చంద్రయాన్-3 మిషన్‌పై భారతదేశం చాలా అంచనాలు పెట్టుకుంది, ముఖ్యంగా ఇంతకు ముందు జరిగిన చంద్రయాన్-2 తో పాక్షిక విజయం సాధించిన తర్వాత. ఇప్పుడు చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైనందున, ఈ రోజు ఆగస్టు 23న దాదాపు 5:20 PM ISTకి ప్రారంభమయ్యే చారిత్రాత్మక సంఘటనను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ISRO ఇప్పటికే ప్రకటించింది. ఈ ల్యాండింగ్ సమయం 6:04 PM ISTగా ఉండనున్నట్లు అంచనా వేయబడింది.

చంద్రయాన్-3 ల్యాండింగ్: ప్రత్యక్ష ప్రసారాన్ని ఎప్పుడు, ఎక్కడ చూడాలి
చంద్రయాన్-3 చంద్రుని ల్యాండింగ్‌ను ఇస్రో వివిధ సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ ఈవెంట్‌ను ISRO తన అధికారిక వెబ్‌సైట్, ISRO యూట్యూబ్ ఛానెల్ మరియు సంస్థ యొక్క ఫేస్‌బుక్ పేజీలో చూడవచ్చు. ఈ ల్యాండింగ్ సమయానికి దాదాపు 30 నిమిషాలకు ముందు, 5:20 PM ISTకి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.

ఇంకా, చంద్రయాన్ 3 ల్యాండింగ్ యొక్క ప్రత్యక్ష ప్రసారం DD నేషనల్ టీవీలో అందుబాటులో ఉంటుంది. వీక్షకులు చంద్రయాన్-3 లూనార్ ల్యాండింగ్ యొక్క ప్రత్యక్ష ప్రసారం కోసం క్రింది లింక్ కూడా చూడవచ్చు.

చంద్రయాన్-3 ని జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుండి లాంచ్ వెహికల్ మార్క్-III (LVM-3) రాకెట్‌లో ప్రయోగించారు. అనుకున్న విధంగా విజయవంతంగా ల్యాండ్ అయినట్లయితే, చంద్రుని యొక్క అపరిచిత దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశం భారతదేశం అవుతుంది.

చంద్రయాన్-3 ల్యాండర్ యొక్క మిషన్ జీవితం చంద్రునిపై ఒకరోజు, ఇది 14 భూమి రోజులకు సమానమని ఇస్రో అధికారులు గతంలో గుర్తించారు. ప్రయాణంలో, చంద్రయాన్-3 ద్వారా బంధించబడిన చంద్రుని యొక్క అనేక చిత్రాలను కూడా ఇస్రో విడుదల చేసింది.

భారతదేశం యొక్క చంద్రయాన్-3 యొక్క లక్ష్యాలు గమనిస్తే, చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన మరియు మృదువైన ల్యాండింగ్, చంద్రుని ఉపరితలంపై కదులుతున్న రోవర్ మరియు ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలవనుంది, అయితే చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశం భారత్ మాత్రమే అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Chandrayaan 3 News: Lunar Landing Countdown Begins, How To Watch Live Stream And Timing Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X