Home
News

చంద్రయాన్‌-3 కీలక ఘట్టాలు పూర్తి.. ఇక విజయమే మిగిలి ఉంది..! మీరు లైవ్‌ చూడొచ్చు...!

140 కోట్ల భారతీయుల కలలను మోసుకెళ్లిన చంద్రయాన్‌-3.. విజయానికి అత్యంత చేరువలో ఉంది. ఇప్పటికే కీలక ప్రక్రియలను పూర్తిచేసుకొని, చంద్రుని చుట్టు నిర్దే కక్ష్యలో విక్రమ్‌ ల్యాండర్‌ పరిభ్రమిస్తోంది. ల్యాండర్‌కు అమర్చిన కెమెరాలు చంద్రుని ఉపరితలం ఫోటోలను తీసి ఇస్రోకు పంపిస్తున్నాయి.

ఆగస్టు 20న విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ చివరి డీ బూస్టింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఫలితంగా చంద్రునికి మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్‌ 25*134 కి.మీ కక్ష్యలో తిరుగుతోంది. అయితే ఇస్రో సైతం చంద్రయాన్‌-3లో కీలక ఘట్టాలను సోషల్‌మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. ల్యాండర్‌ మాడ్యూల్‌లో అంతర్గత తనిఖీలు జరుగుతున్నాయి. చంద్రుని ఉపరితలంపై తాము ఎంచుకున్న ప్రాంతంలో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నామని ఇస్రో వెల్లడించింది.

chandrayaan 3

చంద్రయాన్‌-3 ప్రయోగంచిన నుంచి ఇప్పటి వరకు అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కానుంది. ఇప్పటి వరకు చంద్రునిపై అమెరికా, చైనా, రష్యా దేశాలు సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేశాయి. భారత్‌ కూడా వాటి సరసన చేరనుంది. అయితే చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన తొలిదేశంగా భారత్‌ ఖ్యాతి గడించనుంది.

చంద్రునిపై విక్రమ్‌ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్ అయిన తర్వాత.. ల్యాండర్‌ లోపల ఉన్న ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చి చంద్రుని ఉపరితరంపై తిరుగుతూ 14 రోజుల పాటు వివిధ రకాల పరిశోధనలు చేస్తుంది. అయితే ప్రొపల్షన్ మాడ్యూల్‌ మాత్రం చంద్రుని కక్ష్యలోనే తిరుగుతూ భూవాతావరణాన్ని అధ్యయనం చేయనుంది.

ఈ కీలక ఘట్టాన్ని దేశప్రజల సహా యావత్‌ దేశం వీక్షించేందుకు వీలుగా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం సాయంత్రం 05:27 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. ఇస్రో వెబ్‌సైట్‌, యూట్యూబ్‌, ఇస్రో ఫేస్‌బుక్‌ పేజీ, సహా అనేక ప్లాట్‌ఫాంల ద్వారా లైవ్‌ అందుబాటులో ఉంటుందని ఇస్రో తెలిపింది.

2008 నుంచి చంద్రునిపై భారత అంతరిక్ష సంస్థ - ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. అప్పట్లో చంద్రయాన్‌-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోబ్‌ చంద్రుడిపై నీటి ఉనికి తొలిసారిగా కనుగొంది. అనంతరం 2019 జులై 22న ఇస్రో చంద్రయాన్‌-2ను ప్రయోగించింది. ఇందులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండింగ్‌ చేయాలన్నది ఇస్రో ఆలోచన.

అయితే చివరి వరకు అంతా సవ్యంగా జరిగినా.. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో చంద్రుడి ఉపరితలానికి కేవలం 2 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్‌ ల్యాండర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ల్యాండంగ్‌ అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది. అయితే చంద్రయాన్‌2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. జూలై 14న చంద్రయాన్‌-3ను ప్రయోగించింది.

గతంలోని పొరపాట్లు జరగకుండా కీలక చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని చోట సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి, కీలక పరిశోధనలు చేయాలని భావిస్తోంది. విశ్వం పుట్టుగ సహా భవిష్యత్‌లో చంద్రుడిపై నివాసాలు ఏర్పాటుపై ప్రయోగాలు చేయనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23న ఇస్రో చరిత్ర సృష్టించనుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
chandrayaan 3 to safe land on moon isro arranged live telecast
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X