షాకింగ్ న్యూస్..రిలీజ్ డేట్ మారింది?

Posted By: Super

షాకింగ్ న్యూస్..రిలీజ్ డేట్ మారింది?

అభిమానుల ఎదురుచూపులు మరింత వెనక్కివెళ్లేలా కనిపిస్తున్నాయి.. యూవత్ ప్రపంచాన్ని ఊరిస్తున్న సరికొత్త ‘ఆపిల్ ఐఫోన్ 5’ విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. అగష్టు 7న అంగరంగ వైభవంగా ఐఫోన్5ను ఆవిష్కరించనున్నారంటూ నిన్నమొన్నటి వరకు హల్‌చల్ చేసిన పుకార్లు తాజాగా వెల్లడైన సమాచారంతో వొట్టివని తేలిపోయింది. చైనాకు చెందిన ఓ ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ

ఆపిల్ ఐఫోన్5ను సెప్గంబర్ 21న లాంచ్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

ఆపిల్ ఐఫోన్ 5 ఫీచర్లు (అంచనా):

4 అంగుళాల నాజూకైన టచ్‌స్ర్కీన్,

షార్ప్ రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్),

సురక్షితమైన గొరిల్లా గ్లాస్,

లిక్విడ్ మెటల్ బ్యాక్ ప్లేట్,

19పిన్ మినీ డాక్‌కనెక్టర్,

ఆపిల్ ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం,

ఎన్ఎఫ్ సీ ఫీచర్,

నానో సిమ్,

క్వాడ్‌కోర్ ఏ6 ఆర్మ్ ప్రాసెసర్,

క్వాల్కమ్ 4జీ ఎల్‌టీఈ చిప్,

క్వాల్కమ్ ఎన్ఎఫ్‌సీ చిప్,

1జీబి ర్యామ్,

12మెగా పిక్సల్ సోనీ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot