Home
News

మీ శరీరం నుంచే సెల్ చార్జింగ్!

By Super
charge your cell phone with your own body heat

రానున్నరోజుల్లో మీ మొబైల్ ఫోన్ మీ శరీరం నుంచి ఛార్జ్ అవుతుంది. మీ శరీరంలో ఉన్న వేడే మీ సెల్‌ఫోన్ బ్యాటరీని పవర్‌తో నింపేస్తుంది. ఇది ఏలా సాధ్యం అనుకంటున్నారా..?. శరీరంలోని వేడితో సెల్‌ఫోన్‌లకు ఉపయోగించే బ్యాటరీలు చార్జ్ అయ్యే సాంకేతికతను అమెరికాకు చెందిన వేక్ ఫార్టెస్ట్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ అండ్ మోలిక్యూలర్ మెటీరియల్స్’ శాస్రవేత్తలు సృష్టించారు. ఈ పరిశోధనలో కీలక భూమికి పోషించిన సదరు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కారోల్ స్పందిస్తూ నానో టెక్నాలజీని వినియోగించడం ద్వారా శరీర వేడిని విద్యుత్ శక్తిగా మలచి బ్యాటరీ చార్జింగ్‌కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ‘పవర్ ఫెల్డ్’గా నామకరణం చేయబడిన ఈ సాంకేతికత సౌతభ్యతతో మొబైల్ ఫోన్ బ్యాటరీ కొద్ది క్షణాల్లోని 20శాతానికి పైగా చార్జ్ అవుతుందని నిపుణులు వెల్లడించారు.

ఈ ఫోన్‌కు ఎండే ఆహారం!

మైక్రోమాక్స్ సోలార్ చార్జింగ్ పై పనిచేసే శక్తివంతమైన డ్యూయల్ సిమ్ ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు మైక్రోమాక్స్ ఎక్స్259. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్ సూర్యరసిమి ద్వారా శక్తిని గ్రహించుకుంటుంది. సోలార్ ప్యానల్ ద్వారా డివైజ్ మూడు గంటల్లో సంపూర్ణ చార్జ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ 1.5గంటల టాక్‌టైమ్ నిస్తుంది. నిత్యం విద్యుత్ అంతరాయాలతో ఇబ్బందులను ఎదుర్కొనే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ ఫోన్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.

మైక్రోమ్యాక్స్ ఎక్స్259 కీలక ఫీచర్లు:

2.4 అంగుళాల డిస్ ప్లే, (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

డ్యూయల్ సిమ్ సపోర్ట్,

1.3మెగా పిక్సల్ కెమెరా,

బ్లూటూత్, జీపీఆర్ఎస్,

మై-జోన్/మై-స్టోర్ లోకి ప్రవేశించే సౌలభ్యత,

1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.2,499.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X