మీఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం కొన్ని ప్రత్యేక చిట్కాలు

By Gizbot Bureau
|

నేటి ఆధునిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా క్షణం గడవని పరిస్థితి. అన్నింటికీ ఫోన్ పైన్నే అతిగా ఆధారపడుతోన్న నేపథ్యంలో వాటి పై మరింత ఒత్తిడి పెరిగి బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవడం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫోన్లను మరింత వేగవంతంగా ఛార్జ్ చేసుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అన్వేషిస్తున్నారు. ఐఫోన్ వినియోగదారులు లో ఛార్జింగ్ సమస్యలతో ఒక్కోసారి బాగా సఫర్ అవుతుంటారు. ఈ మధ్య వచ్చిన ఐఫోన్ ఎక్స్ కూడా ఛార్జింగ్ విషయంలో అనేక సమస్యలను ఎదుర్కుంది. అయితే ఆపిల్ యూజర్లు 18W, 29W, 30W, 61W, or 87W USB-C power adapters,Apple USB-C to Lightning cable వంటి వాటిని ఉపయోగించడం ద్వారా ఛార్జింగ్ ఫాస్ట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఈ శీర్షికలో భాగంగా ఫోన్ ఛార్జింగ్ ఫాస్ట్ గా అయ్యేందుకు కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. ఓ సారి ప్రయత్నించి చూడండి.

 
 How to Charge Your Phone Faster

Use the wall plug

ఈ మధ్య చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తున్నాయి. అయితే ఆండ్రాయిడ్ కేబుల్స్ ఐఫోన్లకు పనిచేయవు. అయితే ఈ సమయంలో ఆండ్రాయిడ్ అడాప్టర్ ఉపయోగించడం ద్వారా ఛార్జింగ్ ప్రయత్నించవచ్చు. పిల్ నుంచి వచ్చిన ఈ ఐఫోన్లన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వచ్చాయి. కాబట్టి మీరు వీటికి ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ పరికరాలనే వాడాలి. మాములువి వాడితే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

 

Use a faster-charging wireless charging pad

పాపులర్ ఫోన్లు అయిన iPhone Xs, Samsung Galaxy S10లు ఇప్పుడు wireless charging సపోర్టుతో వస్తున్నాయి.అయితే వైర్ ఛార్జింగ్ కన్నా wireless charging కొంచెం నెమ్మది పనితీరును కనబరుస్తుంది. కాబట్టి Qi charging at 7.5 wattsని వాడటం మంచిది.

Use a higher amp car charger

మీరు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఏ ఛార్జర్ పడితే అది కాకుండా higher amp car chargerని ఉపయోగించండి. ఈ చార్జర్లు 1 amp కన్నా ఎక్కువ డెలివరీ సామర్థ్యాన్ని అందించే వాటిని సెలక్ట్ చేసుకోండి. వీటితో పాటు Quick Charge 2.0 and 3.0 సపోర్ట్ ని కూడా తీసుకోవడం ఉపయోగకరం.

Use a quick charge portable battery charger

కారు ఛార్జర్ అందుబాటులో లేనప్పుడు మీరు వెంట portable battery chargerని తీసుకువెళ్లడం మంచిది. అలా కాకుంటే పవర్ బ్యాంకులు తీసుకెళ్లడం కూడా చాలా ఉత్తమం. మార్కెట్లో ఇప్పుడు ఎన్నో రకాల పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ అందించే కేబుల్స్ వీటికి కనెక్ట్ చేస్తే ఫాస్ట్ గా మొబైల్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది.

Upgrade to USB 3.0

మార్కెట్లోకి ఇప్పుడు USB 4.0 కూడా వచ్చేస్తోంది. అయితే అది ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి మీరు వెంట USB 3.0 ని తీసుకువెళ్లండి. దీని ద్వారా టాన్సఫర్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. భారీ డేటాను అత్యంత తక్కువ సమయంలోనే USB 3.0 ట్రాన్సఫర్ చేస్తుంది.
Use your iPad charger for your iPhone 6 or newer iPhone

ఆపిల్ యూజర్లు 18W, 29W, 30W, 61W, or 87W USB-C power adapters,Apple USB-C to Lightning cable వంటి వాటిని ఉపయోగించడం ద్వారా ఛార్జింగ్ ఫాస్ట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.

ఇతర జాగ్రత్తలు

మీఫోన్ ఛార్జింగ్ సమయంలో దాన్ని టర్న్ ఆఫ్ చేయండి. దీని వల్ల ఫోన్ ఛార్జింగ్ వేగం అయ్యే అవకాశం ఉంది. అలాగే స్క్రీన్ లాక్ వేయండి. తద్వారా బ్యాటరీ మరింత ఆదా అవడమే కాకుండా ఫోన్ ఛార్జింగ్ కూడా వేగవంతం అవుతుంది.

Best Mobiles in India

English summary
How to Charge Your Phone Faster

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X