నీటితో ఫోన్ ఛార్జింగ్?

Posted By: Super

నీటితో ఫోన్ ఛార్జింగ్?

నిరీక్షణ ఫలించింది... వినియోగ విద్యుతోపకరణాలు కోసం ఫ్యూయల్ సెల్స్ అందుబాటులోకి వచ్చాయి. స్విడెన్ దేశానికి చెందిన ‘మైఎఫ్‌సీ’myFC సంస్థ ప్రపంచపు తొలి పోర్టబుల్ ఫ్యూయల్ సెల్ ఛార్జర్‌ను రూపొందించింది. ‘పవర్ ట్రెక్’గా పిలవబడుతున్న ఈ పోర్టబుల్ సెల్ చార్జర్ హైడ్రోజన్‌ను విద్యుత్‌గా మార్చి మొబైల్ ఫోన్‌లకు తక్షణ శక్తిని సమకూరుస్తుంది.

చార్జింగ్ అవసరమైన సందర్భంలో యూజర్ ఫ్యూయల్ ప్యాక్‌ను చార్జర్‌లో అమర్చి తగిన మోతాదులో నీటిని జోడించాల్సి ఉంటుంది. యూఎస్బీ కేబుల్ ఆధారితంగా చార్జర్ ను మొబైల్‌కు అనుసంధానించుకోవల్సి ఉంటుంది. సాధారణ చార్జర్లకు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చిన పవర్ ట్రెక్ ప్రయాణ సందర్భాల్లో పూర్తి‌స్థాయి భరోసాను కల్పిస్తుంది. ధర రూ.11,560.

శరీరం నుంచే ఛార్జింగ్!

నీటితో ఫోన్ ఛార్జింగ్?

న్యూయార్క్: శరీరంలో ఉండే వేడిని ఉపయోగించి.. చార్జింగ్ చేసుకునే అవకాశాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కల్పించనున్నారు. పెర్‌పెట్యువా అనే అమెరికన్ కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని కనుగొంది. ఈ అంశం కొత్త విషయమేమీ కాదు. 200 సంవత్సరాల క్రితం థామస్ జోహన్ సీబెక్ అనే భౌతిక శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ఒకవైపు వేడిగా ఉండి మరోవైపు చల్లగా ఉండే వస్తువులను కలిపితే విద్యుచ్ఛక్తి పుడుతుందని సీబెక్ చెప్పారు.

చుట్టూ ఉన్న గాలిలో ఉష్ణోగ్రత కంటే, మానవ శరీరంలోనే ఎక్కువ ఉంటుంది. దీని ఆధారంగా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు.. అంటే బ్లూటూత్ లాంటివాటిని చార్జింగ్ చేసుకోడానికి ఉపయోగపడే రిస్ట్‌బ్యాండ్‌లా ధరించే ఓ పరికరాన్ని పెర్‌పెట్యువా కంపెనీ తయారుచేసింది. బ్లూటూత్ పరికరాలకు కేవలం రెండు వోల్టుల విద్యుత్ సరిపోతుందని పెర్‌పెట్యువా మార్కెటింగ్ వైస్‌ప్రెసిడెంట్ జెర్రీ వియాంట్ తెలిపారు. అలాగని ఇది కేవలం బ్లూటూత్‌లకే పరిమితం కాదండోయ్.. సంప్రదాయ వాచీలు, హార్ట్ మానిటర్ లాంటి వైద్య పరికరాలకు కూడా సరిపోతుంది. భవిష్యత్తులో దీన్ని మరింత అభివృద్ధి చేస్తే సెల్‌ఫోన్లకు, టాబ్లెట్ పీసీలకూ సరిపోవచ్చేమో!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot