30 సెకన్లలో మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తి చార్జ్

అవును.. త్వరలో మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని కేవలం 30 సెకన్ల వ్యవధిలో చార్జ్ చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ చెందిన ఓ కంపెనీ స్టోర్ డాట్ పేరుతో సరికొత్త బ్యాటరీని సీఈఎస్ 2015 టెక్నాలజీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ బ్యాటరీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాటరీలతో పోలిస్తే 100 రెట్లు వేగవంతంగా చార్జ్ కాగలదని బీబీసీ వెల్లడించింది. 8 నెలలో క్రితమే ఈ బ్యాటరీని సదరు సంస్థ ప్రదర్శించింది.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ఈ విప్లవాత్మక డివైస్ కమర్షియల్ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ తదితర డివైస్‌లకు సంబంధించి చార్జింగ్ సమస్యలకు పరిష్కారం లభించినట్లే.


Click it and Unblock the Notifications








