ChatGPT మీకు ఇలాంటి మెసేజ్ చూపిస్తోందా.. ఆ రెండు ఫీచర్లతో ఇక చెక్ పెట్టొచ్చు.. !
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ChatGPT, గూగుల్ బార్డ్, బింగ్ గతకొన్ని నెలలుగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఓపెన్ ఏఐ ChatGPTని లాంచ్ చేయగా.. ఈ సంవత్సరం మార్చిలో గూగుల్ బార్డ్ సహా బింగ్ అందుబాటులోకి వచ్చాయి. అయితే గూగుల్ బార్డ్ తొలుత యూకే, అమెరికాలోనే అందుబాటులో ఉండేది. మే10 నుంచి భారత్ సహా 180 దేశాల్లో బార్డ్ AI అందుబాటులోకి వచ్చింది.
ChatGPTని ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల గురించి చెప్పమని అడిగితే.. మీకు ఓ మెసేజ్ కనిపిస్తుంది. "మీకు జరిగిన అసౌకర్యానికి క్షమించండి. 2021 సెప్టెంబర్ వరకు ఉన్న సమాచారం మాత్రమే ఉంది. తాజా సంఘటనలకు సంబంధించిన సమాచారం లేదు. మీకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ ఇంజిన్ లేదా ఇతర మాధ్యమాలను ప్రయత్నించండి" సుమారుగా ఇలాంటి మెసేజ్ మీకు కనిపిస్తుంది.

అయితే ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ChatGPTని రూపొందించిన ఓపెన్ AI మరో ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఈ వెబ్ బ్రౌజింగ్ ఫీచర్‌తో చాట్‌జీపీటి నుంచి తాజా సమాచారం కూడా వినియోగదారులు పొందగలుగుతారు. అయితే ఈ ఫీచర్ కేవలం ChatGPT ప్లస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
దీనిపై వినియోగదారులకు సంస్థ ఓ ప్రకటన చేసింది. మీరు చాట్‌జీపీటీ ప్లస్ యూజర్ అయితే... ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఫీచర్ యాక్సెస్ పొందవచ్చని తెలిపింది. అయితే అభివృద్ధిలో భాగంగా ఇందులో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చని పేర్కొంది. సెట్టింగ్స్‌లోని బీటా ప్యానల్ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. వచ్చే వారంలో చాట్‌జీపీటీ ప్లస్ వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
వెబ్ బ్రౌజింగ్ : ChatGPT కొత్త వెర్షన్ వెబ్ బ్రౌజింగ్ ఎంచుకోవడం ద్వారా తాజా సమాచారం లేదా కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు.
ప్లగ్‌ఇన్ : చాట్‌జీపీటీ యొక్క తాజా ఫీచర్ ప్లగ్‌ఇన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన థర్డ్ పార్టీ ప్లగ్‌ఇన్‌లను ఎప్పుడు లేదా ఎలా వినియోగించాలో తెలుసుకోవచ్చు.
అయితే వినియోగదారులకు తాజా సమాచారం అందించడంతో ChatGPT కంటే గూగుల్ బార్డ్, బింగ్ కాస్త ముందే ఉన్నాయి. బార్డ్ AI, బింగ్ విడుదల చేసిన నుంచే రియల్‌టైం వెబ్ బ్రౌజింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఈ రెండు చాట్‌బోట్‌లు ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యాయి. మరియు రానున్న కాలంలో అప్‌డేట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటన చేశాయి.
అయితే ఇన్‌పుట్ టెక్ట్స్ ఆధారంగా ఇప్పటికే బింగ్ ఫోటోలను రూపొందిస్తుండగా.. బార్డ్ AI వాయిస్ ఇన్‌పుట్‌లను స్వీకరిస్తోంది. మరియు ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. ఆన్‌లైన్ సెర్చ్ విషయానికి వస్తే గూగుల్ బార్డ్, బింగ్ రెండింటి మధ్య చాలా సంవత్సరాల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఈ సెర్చ్‌లో గూగుల్ అగ్రస్థానంలో ఉంది.
ఏఐ ఆధారిత బింగ్ అందుబాటులోకి వచ్చాక.. పరిస్థితులు మారే అవకాశం ఉంది. మరియు ChatGPT కూడా త్వరలో రియల్ టైం సమాచారం అందుబాటులోకి రానుందని ఓపెన్ ఏఐ తెలిపింది. దీంతో ఏఐలో బార్డ్, బింగ్, చాట్‌జీపీటీ మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది.


Click it and Unblock the Notifications








