పుట్టిన రోజు సందర్భంగా,.. ధోనీ కెరీర్ గురించి ChatGPT చెప్పిన జ్యోస్యం!
మహేంద్రసింగ్ ధోనీ.. కేవలం క్రికెట్ అభిమానులకే కాదు యావత్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న ఈ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.. తన ఆటతీరుతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ మిస్టర్ కూల్ ఇవాళ తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి MS Dhoni అరంగేట్రం చేశాడు. వికెట్ కీపర్‌గా, భారత జట్టు కెప్టెన్‌గా ఎవరూ బద్దలుకొట్టలేని రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా భారత్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఎలాంటి పరిస్థితినైనా అత్యంత చాకచక్యంగా డీల్ చేసే ధోనీని అభిమానులంతా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ 2004 నుంచి 2019 వరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 T20 ఆడాడు. తన అంతర్జాతీయ కెరీల్లో ధోనీ మొత్తం 16 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు చేశాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం IPLలో మాత్రమే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
అయితే ఎంఎస్ ధోనీ కోసం నీకు ఏం తెలుసు అని ఏ క్రికెట్ అభిమానిని అడిగినా.. గంటలు గంటలు చెబుతారు. అదే ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్ కావాలా అంటే చాలా మంది ఫ్యాన్ నో అనే సమాధానం చెబుతాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ChatGPT ఇదే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిందో తెలుసా..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లాంగ్వేజ్ మోడల్‌గా నాకు వ్యక్తిగత అభిప్రాయాలు మరియు ప్రాధాన్యతలు ఉండవు. అయితే ఈ ప్రశ్నకు సంబంధించిన వివరాలు మాత్రం అందిస్తాను. ఎంఎస్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన మరియు అనుభవజ్ఞుడైన క్రికెటర్. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పటికి మూడు సార్లు టైటిల్‌ను అందించాడు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్‌లో ధోనీ ఫామ్‌పై కొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 200 పరుగులు చేశాడు. అంటే సగటున 25 పరుగులు మాత్రమే చేశాడు. మరియు 2021 ఐపీఎల్ సీజన్‌లో 7 మ్యాచ్‌లో 84 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉన్నాడు. ధోనీ అనుభవం, మంచి సామర్థ్యం కలిగి ఉన్నాడు. మరియు ఎంతటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ, జట్టును నడిపిస్తాడని పేరు తెచ్చుకున్నాడు.
అయితే ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్ కావాలా వద్దా అనేని చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అతని ఫిట్‌నెస్, ఫామ్, జట్టు అవసరాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ధోనీ తనంతట తాను ఫీట్‌గా ఉన్నాడని భావిస్తే, జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించగలడని భావిస్తే మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం.. ధోనీ ఇప్పటికీ విలువైన ఆస్తి అని విశ్వసిస్తే.. ఐపీఎల్‌లో కొనసాగాలి.
లేదా ధోనీ తన సమయం అయిపోయిందని భావిస్తే మరియు అవసరమైన స్థాయిలో రాణించలేడని జట్టు యాజమాన్యం అనుకుంటే మాత్రం.. ధోనీ తన రిటైర్‌మెంట్ గురించి ఆలోచించవచ్చు. అయితే చివరగా ఐపీఎల్ నుంచి తాను రిటైర్‌మెంట్ తీసుకోవాలా వద్దా అనేది ధోనీ మాత్రమే నిర్ణయం తీసుకోగలడు.
గమనిక: IPL నుంచి ఐపీఎల్ రిటైర్‌మెంట్ తీసుకోవాలా.. వద్దా అనే ప్రశ్న ChatGPTని అడిగే సమయానికి.. ChatGPT 2021 వరకు మాత్రమే అప్‌డేట్ పొందింది. అందువల్లనే అప్పటి వివరాలను మాత్రమే అందించింది.


Click it and Unblock the Notifications