ChatSim 2 వచ్చేసింది, ఒకే ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018లో భాగంగా ప్రముఖ సిమ్‌కార్డ్ ప్రొవైడర్ చాట్‌సిమ్ (ChatSim), చాట్‌సిమ్ 2 పేరిట సరికొత్త సిమ్ కార్డ్‌ను లాంచ్ చేసింది.

|

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018లో భాగంగా ప్రముఖ సిమ్‌కార్డ్ ప్రొవైడర్ చాట్‌సిమ్ (ChatSim), చాట్‌సిమ్ 2 పేరిట సరికొత్త సిమ్ కార్డ్‌ను లాంచ్ చేసింది. ఈ సిమ్ కార్డ్ నుంచి అన్‌లిమిటెడ్ డేటా ట్రాఫిక్‌తో కూడిన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ చెబుతోంది. రోమింగ్ ఛార్జీలు, వై-ఫై కనెక్టువిటీ వంటి లిమిటేషన్స్ అవసరం లేకుండా ఈ సిమ్ వర్క్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ సిమ్‌తో లభించే వార్షిక ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవటం ద్వారా 165 దేశాలకు టెక్స్ట్ మెసేజ్‌లను పంపుకునే వెసలబాటు ఉంటుందని చాట్ సిమ్ పేర్కొంది. చాట్‌సిమ్ నుంచి గతంలో లాంచ్ అయిన మొదటి జనరేషన్ చాట్ సిమ్‌లో కొన్ని లిమిటేషన్స్ ఉండేవి.

Snapdragon 845 SoCతో షియోమి నుంచి తొలి స్మార్ట్‌ఫోన్..Snapdragon 845 SoCతో షియోమి నుంచి తొలి స్మార్ట్‌ఫోన్..

ChatSim 2

ఈ సిమ్ ద్వారా ఫోటోస్, వీడియోస్ అలానే వాయిస్ కాల్స్ నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా మల్టీమీడియా క్రెడిట్స్ కొనుగోలు చేయవల్సి వచ్చేది. అయితే, చాట్‌సిమ్ 2లో అలా చేయవల్సిన అవసరమే ఉండదే. అందుబాటులో ఉంచిన కోర్ ప్లాన్ లో భాగంగా అన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చేస్తాయి. మొదటి జనరేషన్ చాట్‌సిమ్‌తో పోలిస్తే చాట్‌సిమ్‌2ను పూర్తిగా అప్‌డేట్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త వర్షన్ సిమ్ కార్డ్ ద్వారా లిమిటేషన్స్ అనేవే లేకుండా ఆన్‌లైన్ యాప్స్‌ను వినియోగించుకోవచ్చని చాట్‌సిమ్ తెలిపింది.

ChatSim 2

చాట్‌సిమ్ 2 సర్వీసులను వినియోగదారులకు చేరువచేసే క్రమంలో 250 టెలికం ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చాట్‌సిమ్ సీఈఓ మాన్యుల్ జనిల్లా తెలిపారు. చాట్‌సిమ్ 2 కార్డ్‌లను కొనుగోలు చేసే యూజర్లు వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, వుయ్‌చాట్, టెలీగ్రామ్, హైక్ వంటి యాప్‌లకు సంబంధించి అన్‌లిమిటెడ్ చాట్‌ను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఈ సిమ్‌కార్డ్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ ఇంకా విండోస్ ఆధారిత డివైస్‌లను పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఆల్‌ ఇన్‌ వన్ సైజ్‌లో లభ్యమయ్యే ఈ సిమ్‌కార్డ్‌ను యూజర్ తన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
ChatSim 2 Launched With Unlimited Internet Access and Messaging, to Be Showcased at MWC 2018 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X