ఇంట్లో ఇల్లాలు వాట్సప్‌లో ప్రియురాలు... చివరికి ఏమైందంటే
సమాచారం కోసం వినియోగించే సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయి. వాట్సప్, ఫేస్ బుక్ లకు ప్రజలు ముఖ్యంగా యువత బానిసలుగా మారిపోతున్నారు. వాట్సప్, ఫేస్ బుక్ ఛాటింగ్ ఉంటే చాలు ప్రపంచాన్నే మరచిపోతున్నారు.
సమాచారం కోసం వినియోగించే సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయి. వాట్సప్, ఫేస్ బుక్ లకు ప్రజలు ముఖ్యంగా యువత బానిసలుగా మారిపోతున్నారు. వాట్సప్, ఫేస్ బుక్ ఛాటింగ్ ఉంటే చాలు ప్రపంచాన్నే మరచిపోతున్నారు. ఇవే సోషల్ మీడియా కొందరి ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది. ఇలాంటి సంఘటనే రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ పరిధిలోని మారేడుపల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

వాట్సాప్ చాటింగ్....
సికింద్రాబాద్ పరిధిలోని మారేడుపల్లి, వాల్మీకినగర్‌లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు .వాట్సాప్ చాటింగ్ కారణంగా కుటుంబాల్లో నెలకొన్న వివాదం ఇద్దరి ఆత్మహత్యకు దారి తీసింది . చనిపోయిన వ్యక్తులలో శివ కుమార్ వయసు 27 సంవత్సరాలు కాగా కాగా వెన్నెల వయసు 19 సంవత్సరాలు .

శివకుమార్ కి నెల క్రితం లహరి అనే అమ్మాయితో....
శివకుమార్ కి నెల క్రితం లహరి అనే అమ్మాయితో పెళ్లి అయింది. అయితే తన పక్కింట్లో నివసించే వెన్నెలతో పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి అయ్యాక కూడా వెన్నెలతో వాట్సప్‌లో చాటింగ్‌తో బిజీగా ఉండడంతో భార్య మందలించింది. ఈ విషయం గురించి కుటుంబసభ్యులకు చెబుతానని అనడంతో శివకుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మనస్థాపానికి గురి అయిన వెన్నెల...
శివ కుమార్ చనిపోవడంతో వెన్నెల మనస్థాపానికి గురిఅయింది.అదేరోజు సాయంత్రం యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని....
వెన్నెల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు మరణాన్ని తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications