చీప్‌గా వస్తున్నాయని చైనా ఫోన్లు వాడుతున్నారా.. ?

Written By:

తక్కువ ధరకు వచ్చాయని ఎక్కువ ఫీచర్లున్న చైనా స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నారా? అయితే మీకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 70 కోట్ల స్మార్ట్ ఫోన్లలో చైనా సాప్ట్ వేర్ ఉండగా వారి సమాచారమంతా చైనా చేతిలోకి వెళ్ళిందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు క్రిప్టోవైర్ అనే సంస్థ ఆధారాలతో సహా వివరాలను బయటపెట్టింది.

తగ్గిన జియో జోరు..అసలు సత్తా చూపకుంటే భారీ షాక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా ఫోన్లలో ఉండే మొత్తం సమాచారం

చీప్‌గా వచ్చే చైనా ఫోన్లలో ఉండే మొత్తం సమాచారం చైనా సర్వర్లకు చేరిపోయిపోయి ఉంటుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్లూ' కంపెనీ

బ్లూ' కంపెనీ విక్రయించిన బడ్జెట్ ఫోన్ల నుంచి వెళుతున్న మెసేజ్ లు చైనాలోని రహస్య సర్వర్ కు చేరుతున్నాయని 'క్రిప్టోవైర్' అనే సెక్యూరిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది.

షాంఘైలోని సర్వర్లకు

ఫోన్లో ఇన్ స్టాల్ అయిన అనుమానాస్పద సాఫ్ట్ వేర్, కస్టమర్లకు తెలియకుండా షాంగైలోని సర్వర్లకు వినియోగదారుల లొకేషన్, కాల్ లిస్టు, కాంటాక్టులకు ప్రతి 72 గంటలకు పంపుతోందని తెలిపారు.

అడుప్స్ టెక్నాలజీ

కాగా, ఈ మాల్ వేర్ ను షాంఘైలోని 'అడుప్స్ టెక్నాలజీ' అనే కంపెనీ తయారు చేసిందని, దాదాపు 70 కోట్ల ఫోన్లలో ఈ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ అయిందని, అమెరికాలో 1.2 లక్షల ఫోన్లలో ఈ సాఫ్ట్ వేర్ ఉందని 'క్రిప్టోవైర్' పేర్కొంది.

అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను

ఈ సమాచారం చైనా ప్రభుత్వానికి చేరుతోందా? లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై బ్లూ ప్రతినిధికి చెందిన ఉద్యోగి ఒకరు స్పందిస్తూ, తమ ఫోన్లలోని అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను తొలగిస్తున్నట్టు వెల్లడించారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cheap Android phones send owners' text messages and location data to China read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot