Home
News

84 రోజుల వ్యాలిడిటీ అందించే జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా రీఛార్జ్‌ ప్లాన్‌..!

భారత్‌లో గతంలో పోలిస్తే మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్‌ లిమిటెడ్‌) మినహా మిగిలిన టెలికాం సంస్థలు భారీగా ధరలను పెంచాయి. దీంతో అనేక మంది యూజర్లు BSNL వైపు మొగ్గు చూపారు. అయితే కోట్లాది మంది జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా యూజర్లు.. తక్కువ ధరలో వచ్చే రీఛార్జ్‌ ప్లాన్‌ల కోసం చూస్తున్నారు.

ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియా యూజర్ల కోసం 84 రోజుల వ్యాలిడిటీతో కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెల రీఛార్జ్‌ చేసేందుకు ఆసక్తి చూపని యూజర్లకు ఈ ప్లాన్‌లు ఉపయోగపడతాయి. ఈ ప్లాన్‌లో కాలింగ్‌, డేటా, SMS లను కూడా వినియోగించుకోవచ్చు.

cheapest 84 days validity recharge plan

జియో రీఛార్జ్‌ ప్లాన్ :
జియో తన యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్‌ ప్లాన్లను కలిగి ఉంది. కనిష్టంగా 14 రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ నుంచి గరిష్ఠంగా 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెల రీఛార్జ్ చేసేందుకు ఆసక్తికనబరచని యూజర్ల కోసం తక్కువ ధరలో 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ వివరాలు మీకోసం.

జియో రూ.799 రీఛార్జ్‌ ప్లాన్‌ (Jio Rs799 Recharge Plan) 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగానూ రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తంగా 126GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.

దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు జియో టీవీ, జియో AI క్లౌడ్‌ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. AI క్లౌడ్‌లో 50GB డేటాను ఉచితంగా స్టోర్‌ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్‌ 84 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ :
ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. గరిష్ఠంగా 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ ధరకు అందుబాటులో ఉన్న 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్ ప్లాన్‌ వివరాలు మీకోసం.

Take a Poll

ఎయిర్‌టెల్ రూ.859 రీఛార్జ్ ప్లాన్‌లో (Airtel Rs859 Recharge Plan) భాగంగా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా ఈ ప్లాన్‌ యూజర్లు ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఉచితంగా హాలోట్యూన్స్‌ను పొందవచ్చు.

వోడాఫోన్ ఐడియా 84 రోజుల ప్లాన్ :
వోడాఫోన్‌ ఐడియా ఇటీవలే ముంబైలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ఏప్రిల్‌ నెలలో మరిన్ని ప్రాంతాల్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. మిలిగిన నెట్‌వర్క్‌లతో పోలిస్తే వీకెండ్‌ డేటా రోల్ఓవర్‌ ద్వారా వారంలో మిగిలిన డేటాను శనివారం, ఆదివారాల్లో వినియోగించుకొనే అవకాశం కల్పిస్తోంది. నెలకు ఒకసారి 2GB వరకు వినియోగించుకోవచ్చు.

వోడాఫోన్‌ ఐడియా యూజర్లు రూ.979 రీఛార్జ్‌ ప్లాన్‌లో (Vodafone Idea Rs979 Recharge Plan) 84 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. వ్యాలిడిటీ మొత్తంలో 168GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. వీకెండ్‌ డేటా రోల్‌ఓవర్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
cheapest 84 days validity recharge plan in jio airtel and vodafone idea
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X