ఈ టాప్ smartphones లాంచ్ ఈవెంట్ల‌తో అక్టోబ‌ర్ దుమ్ము లేచి పోనుంది!

|

సెప్టెంబ‌ర్ నెల‌లో అనేక బ్రాండ్ల నుంచి వివిధ కేట‌గిరీల్లో కొత్త మోడ‌ల్ smartphones లాంచ్ అయ్యాయి. ఆ జాబితాలో Apple నుంచి iPhone 14 సిరీస్, Appleవాచ్ అల్ట్రా, రైజెన్ 7000 సిరీస్ ప్రాసెసర్‌లు, 13వ జెన్ ఇంటెల్ కోర్ సిరీస్ ప్రాసెసర్‌లు ఇలా ర‌క‌ర‌కాల ఉత్ప‌త్తులు సెప్టెంబ‌ర్‌లో లాంచ్ అయ్యాయి. అదేవిధంగా అక్టోబర్ 2022లో కూడా వివిధ బ్రాండ్ల నుంచి చాలా smartphones లాంచ్ కానున్నాయి. ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ కూడా సెప్టెంబ‌ర్ మాదిరిగానే కొత్త ఉత్ప‌త్తుల లాంచ్‌ల‌తో బిజీగా ఉండ‌నుంది. అయితే, ఈ నెల‌లో విడుద‌ల కాబోయే స్మార్ట్‌ఫోన్ల‌తో పాటు ట్యాబ్లెట్లు ఇత‌ర గ్యాడ్జెట్ల జాబితాను మేం మీ ముందుకు తీసుకువ‌చ్చాయం. మీరు కూడా వీటిపై ఓ లుక్కేయండి.

google

Google Pixel 7 Series:
Google కంపెనీ త‌మ సంస్థ నుంచి అత్యాధునిక టెన్సర్ G2 ప్రాసెస‌ర్ ద్వారా రూపొందించిన‌ Pixel 7 మరియు Pixel 7 Proని అక్టోబర్ 6వ తేదీన విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పిక్సెల్ 6 సిరీస్‌లా కాకుండా, పిక్సెల్ 7 మరియు పిక్సెల్ 7 ప్రోలు విడుద‌ల తేదీనే మొదటి రోజు భారతదేశానికి వస్తున్నాయి. మరియు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.

గూగుల్ లాంచ్ ఈవెంట్ విశేషాలివే!
కంపెనీ తన తదుపరి "మేడ్ బై Google" లాంచ్ ఈవెంట్ ను అక్టోబర్ 6 వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంగళవారం తన US వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అక్టోబర్ 6, 2022న ఉదయం 10 గంటలకు ET జరిగే లైవ్ ఈవెంట్‌లో తదుపరి Google Pixel డివైజ్‌ల పోర్ట్‌ఫోలియోను అధికారికంగా ప్రారంభిస్తామని ల్యాండింగ్ పేజీ ప్రకటించింది. Google Pixel 7 మరియు Pixel 7 Pro కంపెనీ యొక్క రెండవ తరం టెన్సర్ SoC ప్రాసెస‌ర్‌ల‌తో రానున్నాయ‌ని స‌మాచారం.

google

Motorola G72:
Motorola G72 అనేది 10-బిట్ pOLED డిస్‌ప్లేతో Mediatek Helio G99 SoC ప్రాసెస‌ర్ ద్వారా ఆధారితమైన మిడ్-టైర్ 4G స్మార్ట్‌ఫోన్. ఫోన్‌లో 108MP ప్రైమరీ కెమెరాతో పాటు స్టీరియో స్పీకర్ సెటప్ ఉన్నాయి. మరియు ఇది Motorola Edge 30 Fusion మాదిరి డివైజ్ క‌లిగి ఉంది. అంతేకాకుండా, ఇందులో ఎన్నో గొప్ప ఫీచర్లు కూడా ఉన్నాయి. Motorola G72 అక్టోబర్ 3న భారతదేశంలో లాంచ్ అవుతోంది.

Redmi Pad:
Redmi ప్యాడ్ ను Mediatek Helio G99 SoC ప్రాసెస‌ర్ ఆధారంగా రూపొందించారు. ఇది మార్కెట్లో వ‌చ్చిన త‌ర్వాత చాలా సరసమైన టాబ్లెట్‌గా ఉండే అవకాశం ఉంది. టాబ్లెట్ 90Hz 2K డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. మరియు ఇటీవల ప్రారంభించిన Xiaomi ప్యాడ్ 5 లాగా, ఈ టాబ్లెట్ కస్టమ్ MIUIతో ఆండ్రాయిడ్ 12 OSలో టాబ్లెట్ రన్ అవుతుందని చెప్పబడింది.

Infinix Zero Ultra:
Infinix జీరో అల్ట్రా అనేది ఆ కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ డివైజ్‌గా రానున్న‌ట్లు స‌మాచారం. మరియు ఈ డివైజ్ 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని చెప్పబడింది. స్మార్ట్‌ఫోన్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఫోన్ మిడ్-టైర్ Mediatek డైమెన్సిటీ 820 SoC ప్రాసెస‌ర్‌ ఆధారంగా ప‌ని చేస్తుంది. Infinix Zero Ultra అక్టోబర్ 5న లాంచ్ కానుంది.

google

Xiaomi 12T:
Xiaomi కంపెనీ అక్టోబర్ 4వ తేదీన త‌మ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ కొత్త రెడ్‌మి ప్యాడ్ మరియు రెడ్‌మి బ్యాండ్ 7 ప్రోతో పాటు గ్లోబల్ మార్కెట్లో Xiaomi 12T సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుందని చెప్పబడింది. ప్రస్తుతానికి, Xiaomi 12T సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలోకి ఎప్పుడు వస్తాయనే విష‌యంపై ఎలాంటి అధికారిక‌ సమాచారం లేదు.

Best Mobiles in India

English summary
check details of smartphones, tablets to launch in october month.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X