విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టాడు... రాత్రికి రాత్రి వరల్డ్ ఫెమస్ అయ్యాడు

|

ఇండియా యొక్క ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్ 2 యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద దిగుతు అదృశ్యం అయింది. మొత్తానికి రెండు నెలల తరువాత ఇప్పుడు వాటి యొక్క శిధిలాలను అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా కనుక్కున్నది.

విక్రమ్ ల్యాండర్

ఈ విక్రమ్ ల్యాండర్ ను కనుకున్నది కూడా ఒక భారతీయుడు అందులోను చెన్నైకి చెందిన ఇంజనీరు కావడం గమనర్హం. శాస్త్రవేత్తలు రెండు నెలలుగా వెతుకుతున్న విక్రమ్ మూన్ ల్యాండర్ నుండి శిధిలాలను 33 ఏళ్ల షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నాడు. అంతేకాకుండా అది కూలిపోయిన ప్రదేశానికి మార్గనిర్దేశం కూడా చేశాడు.

 

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ల ధరలు మొత్తంగా ఎంత పెరిగాయో చూడండిఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ల ధరలు మొత్తంగా ఎంత పెరిగాయో చూడండి

చంద్రయాన్-2

సెప్టెంబర్‌ నెలలో ఇస్రో పంపిన చంద్రయాన్-2 మిషన్‌లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతూ సిగ్నల్స్ కోల్పోయి క్రాష్ ల్యాండ్ అయ్యిందని అందరికి తెలుసు. ఐతే అది ఎక్కడ పడిందో తెలుసుకోవడానికి ఇస్రోతోపాటూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా కనిపెట్టలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఖగోళ శాస్త్రవేత్తలు ఆ ల్యాండర్‌ను కనిపెట్టలేక ఆశలు వదిలేసుకున్నారు.

 

వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండివోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి

షణ్ముగ సుబ్రహ్మణియన్
 

తమిళనాడుకు చెందిన ఇంజినీర్, బ్లాగర్, టెకీ అయిన షణ్ముగ సుబ్రహ్మణియన్ కష్టపడి విక్రమ్ ల్యాండర్ కు చెందిన విడి భాగానికి సంబంధించిన సమాచారాన్ని నాసాకు చెప్పగా వెంటనే నాసా స్పందించింది. అది విక్రమ్ ల్యాండర్‌కి చెందిన విడిభాగమే అని గుర్తించింది. అక్కడ చుట్టుపక్కల మరింత వెతకగా విక్రమ్ ల్యాండర్ కు సంబందించిన అవశేషాలు లభించాయి. మొత్తంగా దాని చుట్టుపక్కల దాదాపు 24 విడిభాగాలు ఉన్నట్లు నాసా గుర్తించింది. ఇస్రో విక్రమ్ ల్యాండర్ ను ఎక్కడ అయితే దించాలి అని అనుకుందో దానికి అతి దగ్గర్లోనే ల్యాండర్ కూలినట్లుగా నాసా స్పష్టం చేసింది.

 

Dish TV: పాత ధరలు అమలులోకి... తక్కువ ధర వద్ద అధిక ఛానళ్లుDish TV: పాత ధరలు అమలులోకి... తక్కువ ధర వద్ద అధిక ఛానళ్లు

సెప్టెంబర్‌లో విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టడం తమ వల్ల కావట్లేదన్న నాసా దమ్ముంటే ఎవరైనా కనిపెట్టండి అని సరదాగా ఛాలెంజ్ విసిరింది. అప్పటి నుంచీ ఆ ఛాలెంజ్ ను సీరియస్ గా తీసుకొని తనకు తెలిసిన రీతిలో సెర్చ్ చేసిన షణ్ముగ రెండు నెలలపాటూ నానా కష్టాలు పడి మొత్తానికి విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టాడు. తన ఫైండింగ్‌ను నాసా నిజమేనని తేల్చడంతో ఎంతో థ్రిల్ ఫీలవుతున్నాడు.

LROC

తను సెర్చ్ చెయ్యాలి అని అనుకున్న తర్వాత అతనికి దొరికిన ఫొటోలు కేవలం నాసా ల్యూనార్ రిక్కొన్నైశ్సాన్స్ ఆర్బిటర్ (LROC) సైట్‌లో రిలీజ్ చేస్తున్నవి మాత్రమే. చెన్నైలోని తన కంప్యూటర్ దగ్గర కూర్చొని రోజూ గంటల తరబడి ఆ ఫొటోలను ఇంచు ఇంచు వెతకసాగాడు. తను అనుకున్నది సాధించడంతో ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నాడు. మెకానికల్ ఇంజినీరైన షణ్ముగ యాప్ డెవలపర్ కూడా. ఇన్నాళ్లు తన ఫ్రెండ్స్‌కి, చుట్టుపక్కల కొద్ది మందికి మాత్రమే తెలిసిన అతను ఇప్పుడు రాత్రికి రాత్రి వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. నాసాలోని LRO మిషన్ డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్ నుంచీ అతనికి ఈమెయిల్ వచ్చింది. విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టే విషయంలో మాకు సమాచారం అందించినందుకు థాంక్స్ అని జాన్ కెల్లర్ తెలిపారు.

Best Mobiles in India

English summary
Chennai Engineer Helps NASA Find Debris Of Chandrayaan-2 Moon Lander Vikram

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X