చైనాలో AI రోబో బీభత్సం.. జనంపై దారుణమైన దాడి.. అసలేం జరిగింది..?
China AI Robot: చైనాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పనిచేసే రోబోల భద్రతపై ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. టియాంజిన్‌లో ఓ పండుగ జరుగుతుండగా, ఒక్కసారిగా ఓ హ్యూమనాయిడ్ రోబో పిచ్చిగా ప్రవర్తించింది. జనం గుంపుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దాంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అదుపు తప్పిన రోబోను కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ గార్డ్స్ హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా 2010లో వచ్చిన రోబో సినిమాలో రజనీకాంత్ చేసిన చిట్టి క్యారెక్టర్ గుర్తొచ్చిందని అంటున్నారు. సినిమాలో చిట్టి విలన్‌గా మారినట్టుగానే, నిజంగానే AI రోబోలు ప్రమాదకరమా అనే చర్చ మొదలైంది.

* రోబోట్ ఎందుకు పిచ్చిగా ప్రవర్తించింది..
ఆ రోబో చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఫిబ్రవరి 9న టియాంజిన్‌లో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో దాన్ని పెట్టారు. ఉన్నట్టుండి అది ఒక్కసారిగా జనాల మీదకు దూసుకొచ్చింది. బారికేడ్ వెనుక ఉన్న జనంపై దాడి చేయడానికి ప్రయత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు.
వెంటనే దాన్ని లాగి, ప్రజలకు ఏమీ కాకుండా చేశారు. పక్కనే ఇంకో రోబో కూడా ఉంది, కానీ అది మాత్రం చాలా సైలెంట్‌గా ఉంది. అంటే ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల జరిగిందేమో, కావాలని చేసిన దాడి కాకపోవచ్చు అని అనుకుంటున్నారు. తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్లు మాట్లాడుతూ, "ఇది రోబో ఫెయిల్యూర్ మాత్రమే." అని చెప్పారు.
ఈవెంట్‌కు ముందు రోబోకు అన్ని సేఫ్టీ టెస్టులు చేశామని కూడా వాళ్లు తెలిపారు. కానీ, మళ్లీ ఇలాంటివి జరగకుండా చూస్తామని, ఇంకా మంచి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటామని ప్రామిస్ చేశారు. టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ మాత్రం సాఫ్ట్‌వేర్ గ్లిచ్ (సాంకేతిక లోపం) వల్ల రోబో అలా ప్రవర్తించి ఉండొచ్చని అంటున్నారు.
* AI రోబోలు నిజంగానే ప్రమాదకరం అవుతున్నాయా?
ఇదివరకు కూడా ఇలాంటి AI మిషన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చాయని, అందుకే ఈ సిస్టమ్స్‌పై నమ్మకం పోతోందని అంటున్నారు. ఇలా AI మిషన్లు పిచ్చిగా ప్రవర్తించడం ఇదేం మొదటిసారి కాదు. డిసెంబర్‌లో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని గిగా ఫ్యాక్టరీలో టెస్లా ఇంజనీర్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
అక్కడ కార్ పార్ట్స్ మూవ్ చేసే ఒక రోబో, పొరపాటున ఒక వర్కర్‌పై దాడి చేసింది. అతన్ని కింద పడేసి, తన మెటల్ క్లావ్స్‌తో అతని వీపు, చేతిని గట్టిగా పట్టుకుంది. అక్కడ రక్తం ఏరులై పారిందని, చూసిన వాళ్లంతా షాక్ అయ్యారని అన్నారు. 2021లోనే ఈ యాక్సిడెంట్ జరిగింది.
ఇంకో దారుణమైన ఘటన సౌత్ కొరియాలో జరిగింది. అక్కడ ఒక అగ్రికల్చరల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో రోబో సరిగా పనిచేయక ఒక మనిషి చనిపోయాడు. ఆ వ్యక్తి రోబోటిక్స్ వర్కర్, వయసు 40 ఏళ్లు. అతను రోబో సెన్సార్లను చెక్ చేస్తుండగా, రోబో పొరపాటుగా అతన్నే బాక్స్‌గా గుర్తించింది. అతన్ని గట్టిగా పట్టుకుని, కన్వేయర్ బెల్ట్‌కు అదిమిపెట్టింది.
అతని ఛాతీ, ముఖం నుజ్జునుజ్జు అయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లినా బతకలేదు. ఆ రోబోకు సేఫ్టీ టెస్టులు చేయాల్సి ఉండగా, సెన్సార్ ప్రాబ్లమ్స్ వల్ల వాయిదా వేశారని ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఈ యాక్సిడెంట్ తర్వాత, కంపెనీ వాళ్లు మళ్లీ ఇలా జరగకుండా "కచ్చితమైన, సురక్షితమైన" సిస్టమ్ కావాలని డిమాండ్ చేశారు.
* AI సేఫ్టీపై పెరుగుతున్న భయం
AI మిషన్ల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఈ ఘటనలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఊహించని ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. AIని మనుషులే ప్రోగ్రామ్ చేసినా, కోడింగ్ లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు నిపుణులు జాగ్రత్తలు, పరీక్షలతో రిస్క్ తగ్గించొచ్చని అంటున్నా, AI టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశముందని మరికొందరు భయపడుతున్నారు.
సౌత్ కొరియాలో AI రోబో సూసైడ్ చేసుకుందన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. AI భద్రతకు కఠిన నియమాలు, పరీక్షలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI వల్ల లాభాలున్నా, గుడ్డిగా నమ్మితే ప్రమాదమని చైనా ఘటన హెచ్చరిస్తోంది. భవిష్యత్తులో AI రోబోల భద్రతపై దృష్టి పెట్టాలి.


Click it and Unblock the Notifications








